S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/01/2017 - 00:34

విజయవాడ, ఆగస్టు 31: రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల విస్తరణ, అనుసంధానం పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. వివిధ నగరాల మధ్య ప్రస్తుతం నడుపుతున్న విమాన సర్వీసులను పెంచాలని కూడా చెప్పారు. పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సర్వీసులను పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

09/01/2017 - 00:33

న్యూఢిల్లీ, ఆగస్టు 31: పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతమైందని, రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడమే ఇందుకు నిదర్శనమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.

08/31/2017 - 00:30

న్యూఢిల్లీ: దేశీయ ఆటో రంగానికి సెస్సు సెగ తగిలింది. మధ్య, భారీ, లగ్జరీ శ్రేణి కార్లపై వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో ప్రస్తుతం 15 శాతంగా ఉన్న సెస్సు.. మరో 10 శాతం పెరిగి 25 శాతానకి చేరనుంది మరి. బుధవారం కేంద్ర కేబినెట్ సెస్సు పెంపునకు అంగీకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జిఎస్‌టి కౌన్సిల్ ఇప్పటికే దీనికి ఆమోదం తెలిపింది. దీంతో ఇక అమలే తరువాయ.

08/31/2017 - 00:29

హైదరాబాద్: టైర్ల తయారీ దిగ్గజం బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా.. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధును తమ తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ మేరకు బ్రిడ్జ్‌స్టోన్ కార్పొరేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాంకో అన్నుంజిటో స్పష్టం చేశారు. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా ఇకపై సింధు బ్రిడ్జ్‌స్టోన్ కార్యకలాపాల్లో పాలుపంచుకోనుంది.

08/31/2017 - 00:28

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫాస్ట్ ఫుడ్ రిటైల్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్.. విక్రమ్ బక్షీకి మధ్య నెలకొన్న వివాదం అంత సులభంగా సద్దుమణిగేలా కనిపించడం లేదు. బక్షీతో సెటిల్మెంట్‌కు అంగీకరించేది లేదని మెక్‌డొనాల్డ్స్ బుధవారం నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి) ముందు స్పష్టం చేసింది. దీంతో ఇరు వర్గాలు వేసిన పిటిషన్లపై పరస్పరం స్పందించాలని ఎన్‌సిఎల్‌ఎటి నోటీసులు జారీ చేసింది.

08/31/2017 - 00:28

ముంబయి: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) జివిఎ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు 7.3 శాతానికి పెరిగే వీలుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 6.6 శాతంగా ఉంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ప్రధాన ద్రవ్యోల్బణం 2-3.5 శాతంగా, ద్వితీయార్ధంలో 3.5-4.5 శాతంగా ఉండొచ్చంది.

08/31/2017 - 00:28

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 258.07 పాయింట్లు పెరిగి 31,646.46 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 88.35 పాయింట్లు అందుకుని 9,884.40 వద్ద నిలిచింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు తొలి నెల జూలైలో పెద్ద ఎత్తున నమోదు కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

08/30/2017 - 00:26

ముంబయి, ఆగస్టు 29: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. వరుస లాభాల్లో పరుగులు తీస్తున్న సూచీలను అంతర్జాతీయ పరిణామాలు ప్రభావితం చేశాయి. జపాన్‌పై ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేయడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి గురయ్యారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 362.43 పాయింట్లు పతనమై 31,388.39 వద్ద స్థిరపడగా, ఈ నెల 22 నాటి స్థాయికి పడిపోయింది.

08/30/2017 - 00:24

న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. గుజరాత్ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న తమ జాయింట్ వెంచర్ పేరును మార్చేసింది. మహీంద్ర గుజరాత్ ట్రాక్టర్స్‌ను గ్రోమాక్స్ అగ్రి ఎక్విప్‌మెంట్ లిమిటెడ్‌గా మార్చుతున్నట్లు ప్రకటించింది. అలాగే ట్రాక్‌స్టార్ అనే ఓ నూతన ట్రాక్టర్ బ్రాండ్‌నూ పరిచయం చేసింది.

08/30/2017 - 00:24

న్యూఢిల్లీ, ఆగస్టు 29: అత్యుత్తమ, పారదర్శక సంస్కరణలతోనే దేశంలో పేదరికాన్ని పారద్రోలగలమని, వ్యాపారానికి అనువైన పరిస్థితులను నెలకొల్పగలమని, కోట్లాది మంది జీవన ప్రమాణాలను పెంచగలమని నీతి ఆయోగ్ పేర్కొంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: యాన్ ఎంటర్‌ప్రైజ్ సర్వే ఆఫ్ ఇండియన్ స్టేట్స్’ పేరిట ఐడిఎఫ్‌సితో కలిసి నీతి ఆయోగ్ ఓ నివేదికను రూపొందించింది.

Pages