S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/21/2017 - 01:07

బెంగళూరు, ఫిబ్రవరి 20: అంతర్జాతీయ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్.. భారతీయ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల ప్రస్తుతం భారత పర్యటనలో ఉండగా, ఇందులో భాగంగానే సోమవారం ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సిఇఒ బిన్ని బన్సల్‌తో కలిసి ఆయన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించారు.

02/21/2017 - 01:04

ముంబయి, ఫిబ్రవరి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఐటి దిగ్గజం టిసిఎస్ షేర్ బైబ్యాక్ ప్రకటనతో ఆ సంస్థ షేర్లు మదుపరులను అమితంగా ఆకర్షించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 192.83 పాయింట్లు ఎగిసి 28,661.58 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 57.50 పాయింట్లు అందుకుని 8,879.20 వద్ద నిలిచింది.

02/21/2017 - 01:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) లిమిటెడ్.. సోమవారం 16,000 కోట్ల రూపాయల షేర్ బైబ్యాక్‌ను ప్రకటించింది. భారతీయ క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో ఈ స్థాయిలో బైబ్యాక్ ఆఫర్ రావడం ఇదే ప్రథమం. కాగా, ఈ బైబ్యాక్‌కు టిసిఎస్ బోర్డు ఆమోదం తెలియపరచగా, దీనివల్ల సంస్థ మిగులు నగదు నిల్వలు భాగస్వాములకు చేరనున్నాయి.

02/20/2017 - 07:49

గన్నవరం, ఫిబ్రవరి 19: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి వారణాసికి స్పైస్‌జెట్‌నూతన విమాన సర్వీసు ఆదివారం కోలాహలంగా ప్రారంభమైంది. 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో తొలిసారిగా 156 మంది ప్రయాణికులు వారణాసికి పయనమయ్యారు. కొత్త టెర్మినల్ భవనంలో తొలి బోర్డింగ్ పాస్‌ని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు స్పైస్‌జెట్ ప్రతినిధి ప్రమోద్, డిసిపి శ్రీనివాసరావుతో కలిసి ప్రయాణికులకు అందజేశారు.

02/20/2017 - 07:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం, ఉత్తర్రపదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం మధ్య మదుపరులు పెట్టుబడులపై స్థిరమైన ఆలోచనలతో ముందుకెళ్లే వీలుండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

02/20/2017 - 07:46

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: పర్యాటక రంగం ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా నిర్వీర్యం అయిపోతోంది. ఆశించిన స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులు ఏలాగూ రావడంలేదు. కనీసం నిధుల కేటాయింపులోనూ పర్యాటక శాఖకు న్యాయం జరగడంలేదు. కేవలం కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టే యోచన కనిపిస్తోందంటూ ఈ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకేనేమో ఈసారి బడ్జెట్‌కు ప్రతిపాదనలు వెళ్ళలేదు.

02/20/2017 - 07:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) కళ వచ్చింది. పెట్టుబడులకు విదేశీ మదుపరులు మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నారు మరి. నిరుడు భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

02/20/2017 - 07:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నగదు ద్వారా 2 లక్షల రూపాయలకు మించిన ఆభరణాల కొనుగోళ్లపై 1 శాతం టిసిఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ పరిమితి 5 లక్షల రూపాయల వరకు ఉంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 3 లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరగకుండా కేంద్రం చర్యలు చేపడుతోంది.

02/19/2017 - 07:18

హైదరాబాద్/తిరుమల, ఫిబ్రవరి 18: పాత పెద్ద నోట్ల రద్దు సెగ.. తిరుమల తిరుపతి దేవస్థానాని (టిటిడి)కీ తగిలింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం.. టిటిడి ఆదాయానికి గండి కొట్టింది. రోజుకు దాదాపు 5 కోట్ల రూపాయలుగా ఉండే టిటిడి ఆదాయం.. నోట్ల రద్దు కారణంగా 2 కోట్ల రూపాయల మేర తగ్గిపోయింది మరి.

02/19/2017 - 07:16

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశీయ టెలికామ్ రంగంలో రోజుకొకటి చొప్పున వస్తున్న ప్రమోషనల్ ఆఫర్లపై, ఆరోగ్యకరంగా లేని పోటీయుత ధరల విధానంపై టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ దృష్టి సారించింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని 4జి సేవల సంస్థ రిలయన్స్ జియో రాకతో టెలికామ్ రంగంలో నిత్యం సంచలనాలు చోటుచేసుకుంటున్నది తెలిసిందే.

Pages