S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/05/2016 - 07:52

న్యూఢిల్లీ, నవంబర్ 4: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)తోపాటు బ్రిటీష్ పెట్రోలియం (బిపి), నికో నుంచి భారీ నష్టపరిహారాన్ని కోరింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి చమురు మంత్రిత్వ శాఖ రిలయన్స్‌కు గురువారమే నోటీసులు కూడా అందించింది.

11/05/2016 - 07:49

విజయవాడ, నవంబర్ 4: నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని పేరు కోసం కాకుండా ఫలితాలు కనిపించేలా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం పురోగతిపై జరిపిన సమీక్షలో ఈ మేరకు పలు సూచనలు చేశారు.

11/05/2016 - 07:48

ముంబయి, నవంబర్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేకెత్తిస్తున్న ఉత్కంఠ మధ్య మదుపరులు లాభాల స్వీకరణకే ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా భారతీయ సూచీలు వరుసగా ఐదోరోజు క్షీణించగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు నాలుగు నెలల కనిష్టాన్ని తాకుతూ 156.13 పాయింట్లు పడిపోయి 27,274.15 వద్ద స్థిరపడింది.

11/05/2016 - 07:47

హైదరాబాద్, నవంబర్ 4: భారత పాడి పరిశ్రమకు బంగారు భవిష్యత్తు ఉందని, సాలీనా 4 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తూ దూసుకుపోతున్నట్లు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ సంస్థ చైర్మన్ దిలీప్ రథ్ శుక్రవారం తెలిపారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ డెయిరీ ఫోరంలో భారత పాడి పరిశ్రమ అభివృద్ధికి చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు.

11/05/2016 - 07:47

న్యూఢిల్లీ, నవంబర్ 4: సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఇవి నడవవని మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ శుక్రవారం అభిప్రాయపడ్డారు. డ్రైవింగ్ నిబంధనలు ఎవరూ పాటించరని, కాబట్టే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇక్కడ విజయం సాధించబోవన్నారు.
బీడి పరిశ్రమ మూతబడితే
నక్సలిజం పెరుగుతుంది: బిఎంఎస్

11/05/2016 - 07:46

హైదరాబాద్, నవంబర్ 4: సులువుగా వాణిజ్యం చేసేందుకు అనువైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించడంపట్ల ఫిక్కీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎం ప్రభాకర్‌రావు హర్షం శుక్రవారం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్ ఈ జాబితాను రూపొందించగా, పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక శాఖ (డిఐపిపి) దీన్ని ఇటీవల విడుదల చేసినది తెలిసిందే. గత ఏడాదిన్నర కాలంలో ఆంధ్రలో పరిశ్రమల స్థాపనకు 11,000 ప్రతిపాదనలు వచ్చాయన్నారు.

11/04/2016 - 00:51

ముంబయి, నవంబర్ 3: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై మదుపరుల్లో నెలకొన్న ఆందోళన కారణంగా గురువారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరసగా నాలుగో రోజు కూడా నష్టాలు చవి చూసిన సెనె్సక్స్ గురువారం 87 పాయింట్లు కోల్పోయి దాదాపుగా నాలుగు నెలల కనిష్టస్థాయి అయిన 27,430.28 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ సైతం 8,600 పాయింట్ల దిగువకు పడిపోయింది.

11/04/2016 - 00:50

న్యూఢిల్లీ, నవంబర్ 3: కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుంచి ఆహార భద్రతా చట్టాన్ని దేశమంతటికీ విస్తరించి 80 కోట్ల మంది ప్రజలకు అధిక సబ్సిడీపై బియ్యం, గోధుమలను అందజేయనుంది. ఇందుకోసం సంవత్సరానికి భారీ మొత్తంలో 1.4 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. 2013లో పార్లమెంట్ ఆమోదించిన ఆహార భద్రతా చట్టాన్ని తమిళనాడు, కేరళ మినహా మిగిలిని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న విషయం విదితమే.

11/04/2016 - 00:49

లండన్, నవంబర్ 3: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలిగే (బ్రెగ్జిట్) ప్రక్రియను వచ్చే ఏడాది ఆరంభం నుంచి మొదలు పెట్టాలన్న ప్రధాన మంత్రి థెరిస్సా మే ఆలోచనలనలకు బ్రిటన్ న్యాయస్థానంలో చుక్కెదురైంది. బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభించేందుకు తొలుత పార్లమెంట్ నుంచి తప్పనిసరిగా ఆమోదాన్ని పొంది తీరాలని లండన్‌లోని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది.

11/04/2016 - 00:47

ముంబయి, నవంబర్ 3: టాటా సన్స్ సంస్థ చైర్మన్ పదవి నుంచి అనూహ్య రీతిలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్ర్తి ఇప్పుడు ఆ గ్రూపులోని మిగిలిన అన్ని సంస్థలకు చైర్మన్‌గా కొనసాగాలని యోచిస్తున్నారు. ఈ సంస్థల చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని మిస్ర్తి భావించడం లేదని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.

Pages