S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/30/2016 - 07:56

న్యూఢిల్లీ, జూలై 29: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్ రేసులో తన అభ్యర్థిత్వంపై ఊహాగానాలను కొనసాగిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య.. దీనిపై తాను స్పందించలేనన్నారు. ఇదంతా మీడియా ఊహాగానాలేనన్న ఆమె తాను ఆర్‌బిఐ చీఫ్ రేసులో లేనని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారు. శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో పాల్గొన్న భట్టాచార్య..

07/30/2016 - 07:55

న్యూఢిల్లీ, జూలై 29: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 22.1 శాతం పడిపోయి 2,516 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో 3,232 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది.

07/30/2016 - 07:55

న్యూయార్క్, జూలై 29: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సిఇఒ జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో నిలిచాడు. వారెన్ బఫెట్‌ను వెనక్కినెట్టి 65.3 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో దూకుడును ప్రదర్శించాడు. బఫెట్ సంపద 64.9 బిలియన్ డాలర్లుండగా, ఆయన నాలుగో స్థానానికి పడిపోయాడు.

07/30/2016 - 07:54

న్యూఢిల్లీ, జూలై 29: దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దాదాపు 700 మంది ఉద్యోగులను తీసేస్తోంది. అమెజాన్, స్నాప్‌డీల్ తదితర ఇతర ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ నేపథ్యంలో సంస్థాగత వ్యయాన్ని తగ్గించుకునే దిశగా ఫ్లిప్‌కార్ట్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 700 మంది సిబ్బందికి ఉద్వాసన పలకనుంది. సంస్థలో 22,000 మందికిపైగా పనిచేస్తున్నారు.

07/30/2016 - 07:54

న్యూఢిల్లీ, జూలై 29: ప్రభుత్వరంగ బ్యాంకుల సమ్మెతో శుక్రవారం వేలాది కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐలోకి దాని అనుబంధ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఒక్కరోజు బంద్‌ను నిర్వహించారు. దీని ఫలితంగా ఈ ఒక్కరోజే 12,000 కోట్ల రూపాయల నుంచి 15,000 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు ప్రభావితమైనట్లు పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది.

07/30/2016 - 07:53

న్యూఢిల్లీ, జూలై 29: తెలంగాణ రాష్ట్రంలో చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేంద్రానికి రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ వాసుల సమస్యలను కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆయన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, పౌర విమానయాన శాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజులతో సమావేశం అయ్యారు.

07/29/2016 - 05:18

న్యూఢిల్లీ, జూలై 28: దేశంలో ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ల (ఎఓపి) మంజూరుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని త్వరలో సవరిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశీయ విమానాయాన సంస్థల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎఓపి విధానాన్ని సవరించనున్నట్లు ప్రభుత్వం వివరించింది.

07/29/2016 - 05:17

విజయవాడ, జూలై 28: ఆంధ్రప్రదేశ్‌లో గత కొనే్నళ్ల నుంచి విశాఖపట్నం, కృష్ణా జిల్లాలు తలసరి ఆదాయంలో వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కొనసాగుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు జిల్లాల వారీగా తలసరి ఆదాయ వివరాలు విడుదల చేశారు.

07/29/2016 - 05:05

ముంబయి, జూలై 28: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. వస్తు సేవల పన్ను( జిఎస్‌టి) మిల్లుపై సానుకూల సంకేతాలు, కార్పొరేట్ సంస్థల ఆదాయాలు మెరుగుపడ్డం వంటి సానుకూల అంశాలతో గురువారం కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

07/29/2016 - 05:03

చెన్నై, జూలై 28: దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన సమ్మె యథాతథంగా జరుగనుంది. సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ల ఐక్య వేదిక (యుఎఫ్‌బిఎ)తో పాటు ఐబిఎ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్)కి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంగళవారం జరిగిన రాజీ సమావేశం విఫలమవడంతో ఈ సమ్మె యథాతథంగా జరుగుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు.

Pages