S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/03/2016 - 07:11

న్యూఢిల్లీ, జనవరి 2: కిరోసిన్ అమ్మకాలపై రాయితీని వినియోగదారుల ఖాతాలకు నగదు బదిలీ పథకం (డిబిటి) ద్వారా పంపించడం వల్ల అర్హులకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందినట్లవుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ శనివారం ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కిరోసిన్ విక్రయాలపైనా డిబిటిని అమలుపరుస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించినది తెలిసిందే.

01/03/2016 - 07:11

లీటర్ పెట్రోల్‌పై 0.37 పైసలు, డీజిల్‌పై రూ. 2 చొప్పున వడ్డన

01/02/2016 - 05:02

ముంబయి, జనవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరానికి లాభాలతో స్వాగతం పలికాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 43.36 పాయింట్లు పెరిగి 26,160.90 పాయింట్లకు చేరితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 16.85 పాయింట్లు అందుకుని 7,963.20 వద్ద స్థిరపడింది. గురువారం కూడా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసినది తెలిసిందే.

01/02/2016 - 05:01

విశాఖపట్నం, జనవరి 1: స్మార్ట్‌సిటీల అభివృద్ధిలో అమెరికా సహకారం కేవలం డిపిఆర్‌ల తయారీకి మాత్రమేనట. దేశంలో విశాఖపట్నం, అలహాబాద్, అజ్మీర్ నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి అమెరికా ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తుందని ప్రకటించడమే కాకుండా తన అమెరికా పర్యటనలో సాక్షాత్తూ ఆ దేశాధ్యక్షుని నోట హామీ ఇప్పించారు.

01/02/2016 - 04:59

న్యూఢిల్లీ, జనవరి 1: నాన్-సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర శుక్రవారం 49.5 రూపాయలు పెరిగింది. అయితే నాన్-సబ్సిడీ కిరోసిన్ ధర మాత్రం లీటర్‌కు 1.05 రూపాయలు తగ్గింది. విమానయాన ఇంధనం (ఎటిఎఫ్) ధర కూడా 10 శాతం తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ఎటిఎఫ్ ధర 4,428 రూపాయలు దిగి 39,892.32 రూపాయలకు చేరింది.

01/02/2016 - 04:56

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా.. గత నెల డిసెంబర్‌లో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని చేధించింది. 51.08 మిలియన్ టన్నుల బొగ్గు ను ఉత్పత్తి చేయాలని నిర్దేశించుకోగా, 52.07 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసింది. అయినప్పటికీ గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో నిర్ణయించుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరలేకపోయింది.

01/01/2016 - 17:01

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 43 పాయింట్లు లాభపడి 26,161 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 7,963 పాయింట్ల వద్ద ముగిసింది.

01/01/2016 - 06:00

7 నుంచి ఎఫ్-బ్యాండ్ అమ్మకాలు

01/01/2016 - 05:59

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం సింగరేణి కార్మికులకు సిఎండి శ్రీధర్ పిలుపు

01/01/2016 - 05:55

దిగుబడిపై సిఎఐ అంచనా

Pages