S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

07/31/2019 - 04:33

రెండు చెంపలూ వాయించి ముఖం నల్లగా ఉంది, ఎర్రగా అయ్యేందుకే కొట్టాను అని చెప్పడాన్ని భారతీయ సమాజం ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలో అయితే లేదు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని అప్పటి యుపీఏ ప్రభుత్వం తీసుకువచ్చినపుడు లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ పెద్ద దుమారమే చెలరేగింది.

07/28/2019 - 03:49

ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళడాన్ని వలసలు అంటారు. ఇవి విభిన్న రకాలుగా ఉంటాయి, ఒక ఊరి నుండి మరొక ఊరికి, పల్లె నుండి పట్నానికి, పట్నం నుండి పల్లెకు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక ఖండం నుండి మరొక ఖండానికి వలసలు వెళ్తుంటారు. వలసలు వెళ్ళడానికి సైతం విభిన్న పరిస్థితులతో కూడుకొని ఉంటాయి.

07/26/2019 - 22:30

సరిగ్గా 20 ఏళ్ల క్రితం కార్గిల్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య పరిమితంగా యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సేనలు తీవ్రవాద ముసుగులో రహస్యంగా నియంత్రణ రేఖను దాటు కొంటూ చొరబడి, వ్యూహాత్మకంగా కీలకమైన ఎత్తయన ప్రదేశాలను ఆక్రమించుకోగా, భారత సైనికులు నిరయంత్రణరేఖ లోపలనే పోరాటం జరుపవలసి వచ్చింది. తీవ్రమైన కష్టతరమైన పరిస్థితులలో, ప్రతికూలమైన వాతావరణంలో, అనుకూలంగా లేని భూభాగంలో జరుపవలసి వచ్చిన యుద్ధం అది.

07/25/2019 - 02:04

అన్ని విధాలుగా భారత్‌లో అంతర్భాగంగా ఉన్న కశ్మీర్‌పై ‘శే్వతసౌధం అధిపతి’, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ అనుచితం. కశ్మీర్ సమస్యను దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గతంలోనే నిర్ణయించాయి. ఇందులో మూడవ దేశానికి స్థానం లేదు.

07/24/2019 - 01:49

‘చంద్రయాన్-2’తో భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్య చకితుల్ని చేసింది. స్వీయ నియంత్రణ వ్యవస్థలతో, దేశీయ ఉత్పత్తులతో ఉపగ్రహాల రూపకల్పన మొదలు ప్రతి దశలో సొంత పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రపంచ పెద్దన్నల పాత్రను తగ్గిస్తూ భారత్ ఖ్యాతి గడించింది. అంతరిక్ష రంగంలో భారత్ అద్భుత విజయాలను మున్ముందు కూడా సాధించనుండడం తిరుగులేని సత్యం.

07/21/2019 - 02:16

వారం తిరగకముందే మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ల పేర మరో ఇద్దరిని దారుణంగా హతమార్చారు. గత వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీ సభ్యుడిని పోలీసు ఇన్‌ఫార్మర్ అంటూ కాల్చి చంపగా, ఈ వారం విశాఖ మన్యంలో పోలీసు ఇన్‌ఫార్మర్లంటూ ఇద్దరు గిరిజనులను చిత్రహింసల పాలు చేసి చంపారు. ఇలాంటి ఘటనలతో- తమ వర్గం వారినే హతమార్చేందుకు మావోయిస్టులు తీర్మానించుకున్నట్లు తోస్తోంది.

07/19/2019 - 22:12

లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పరాభవానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మే 25న రాహుల్ గాంధీ రాజీనామా చేస్తున్నట్లు చెప్ప గానే ముందుగా అందరూ ఒక ‘నాటకం’ అనుకున్నారు. నాలుగు రోజులు బతిమలాడించుకొని రాహుల్ తిరిగి సర్దుకుంటారులే అని భావించారు.

07/18/2019 - 22:13

సంక్షేమ పథకాల వల్లే ఎన్నికల్లో గెలిచి తీరతామని ఏ రాజకీయ పార్టీ భావించినా అది కేవలం భ్రమే! నేతల అనుభవాన్ని, జనాకర్షక కార్యక్రమాలను చూసి ప్రజలు గెలిపించరు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకు పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది.

07/17/2019 - 05:11

సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ మ ధ్య ఒక కేసు విచారణలో భాగంగా ఒక యువకుణ్ణి నిర్దోషిగా ప్రకటించింది. పూర్వపరాలు చూస్తే పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆ యువకుడు బాలుడు మాత్రమే. జువెనైల్ హోంలో చాలా కాలం ఉండి, కేసు పరిష్కృతం కాకపోవడంతో జైలుకు తరలించారు. చాలాకాలం తర్వాత సుప్రీం కోర్టు తీర్పు పుణ్యమాని నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ యువకుడి బాల్యాన్ని తిరిగి ఎవరు వెనక్కు ఇవ్వగలరు?

07/14/2019 - 02:42

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (రాగా) పార్టీ పదవికి రాజీనామా చేశారు. అదేమంత పెద్ద విషయం కాదు, విశేషం అసలే కాదు. అయినా, ఆ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జరగరానిది ఏదో జరిగిపోయిందన్న రీతిలో చిత్రించి, చింతిస్తున్నారు.

Pages