S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

05/22/2019 - 01:42

ప్రపంచంలో ఏ దేశం అయినా ప్రగతి సాధించి ముందడుగు వేయాలంటే వివిధ రంగాల్లో అభివృద్ధి జరగాలి. అందుకు పెట్టుబడులు కావాలి, ప్రభుత్వం వద్ద ఉన్న నగదు అంతా పన్నుల రూపేణా వసూలు చేసిందే. అంటే దేశం నడవాలంటే ప్రజలు అంతా తమ వంతుగా ఏదో ఒక రూపంలో పన్నులు కట్టాల్సిందే.

05/19/2019 - 02:42

ప్రస్తుత సార్వత్రిక సమరం ముగిశాక- 130 కోట్ల మంది ప్రజలను పాలించేదెవరు? ఈ ఏడాది ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వనె్నల జెండా ఎగరేసే నేత ఎవరు? లోక్‌సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకోవడంతో ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ దఫా ఎన్నికలకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత ఏర్పడింది.

05/18/2019 - 01:42

ఏదైనా కారణం చేత తాను తిరిగి ప్రధాని పదవిని చేపట్టలేని పక్షంలో భాజపాలో మరెవ్వరూ ఆ పదవిని చేపట్టడానికి నరేంద్ర మోదీ సుముఖంగా లేరని- ఆయన గురించి తెలిసిన వారందరికీ స్పష్టం అవుతుంది. కేంద్రంలో భాజపా రహిత, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడితే- అది ఒకటి, రెండేళ్లలోనే కూలిపోతుందని, అప్పుడు భారీ ఆధిక్యతతో తాను ప్రధాని పదవి చేపట్టవచ్చని మోదీ ఆలోచిస్తున్నట్లు వినికిడి.

05/17/2019 - 02:30

‘గరీబ్‌కా బీబీ సబ్‌కా బీబీ’ అని ఉర్దూలో ఓ సామెత. పేదవాడి భార్య అందరికీ వరసకు వదినే అని దాని అర్థం. ఇపుడు భారతదేశంలో పేరుకు మెజారిటీగా వున్నది హిందువులు. కానీ ఎవరైనా మెజారిటీలను తిట్టవచ్చు. చాలామంది నాయకులు ‘హిందువులను తిట్టే నేతలుగా ఎదిగారు. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు నోరులేని మూగజీవాలు. లౌకికవాదం అనే రక్తాన్ని నరనరాన ఎక్కించుకున్నారు. ఓట్లకోసం హిందువులను తిట్టని మేధావులు, నాయకులు లేరు!

05/16/2019 - 02:09

తెలుగు ప్రజలకు తమ నేతల గురించి తక్కువగా మాట్లాడడం మొదటి నుంచి అలవాటు. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలు, బెంగాలీల కంటే ఘనమైన చరిత్ర, సంస్కృతి మనకు ఉన్నా- తెలుగు రాష్ట్రాల ప్రజలు పొరుగింటి పుల్లకూరకే ఎక్కువగా ఆశపడుతుంటారు. ఏడు విడతల పోలింగ్ ముగిశాక, ఈ నెల 23వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

05/15/2019 - 01:58

చిన్న చిన్న విషయాల్లోనూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. వ్యక్తులూ, వ్యవస్థలే కాదు, ప్రభు త్వం సైతం అనేక మార్లు నిర్లజ్జగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం, అవి కాస్తా ఉన్నత న్యాయస్థానాలకు చేరాక చివరికి తప్పును సరిదిద్దుకోవడం మనం చూస్తున్నదే. భారత రాజ్యాంగంలో సమానత్వానికి, సేచ్ఛకు పెద్దపీట వేశారు. ప్రాథమిక హక్కుల పేరుతో ఒక ప్రత్యేక విభాగమే పొందుపరిచారు.

05/12/2019 - 01:35

మసూద్ అజార్ అనే ఉగ్రవాది ‘జైషే మహమ్మద్’ సంస్థను స్థాపించిన వాడు. ముంబయి పేలుళ్ల వంటి పెను విధ్వంసాలకు సూత్రధారి అయిన అజార్ చాలాకాలంగా పాకిస్తాన్‌లో దాక్కున్నాడు. మన దేశంలో జరిగిన ఎన్నో ఉగ్రదాడులకు జైషే మహమ్మద్ సంస్థయే కారణం. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా వద్ద 45 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చింది ఈ సంస్థకు చెందిన ఆత్మాహుతిదళ సభ్యుడే.

05/11/2019 - 00:20

మరో రెండు దశలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలు వెలువడిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై పడింది. రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారుగా అంచనాలు వేసుకొంటూ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు.

05/10/2019 - 01:32

ఓ ఊళ్లో రచ్చబండ మీద జనం పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు. అందులో ముల్లా నసీరుద్దీన్ కూడా ఉన్నాడు. అందులోంచి ఓ పెద్ద మనిషి ‘‘నసీరుద్దీన్ గారూ! మీవయస్సెంత?’’ అన్నాడు. దానికి ముల్లా తడుముకోకుండా ‘‘నలభై ఏళ్ళు!’’ అన్నాడు. దానికి పెద్దాయన ‘‘పదేళ్ల క్రితం అంతే చెప్పారు.. మళ్లీ ఇప్పుడూ నలభై ఏళ్లు అంటూ బుకాస్తారా? మీ వయస్సు పెరగదా?’’ అన్నాడట.

05/09/2019 - 01:31

ప్రపంచ కార్మిక దినోత్సవం రక్తసిక్తమైంది. శ్రామికవర్గం ప్రతినిధులమని చెప్పుకునే మావోయిస్టులు గడ్చిరోలి (మహారాష్ట్ర) జిల్లాలో మందుపాతర పేల్చి, 16 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చారు. ఈ జవాన్లు దేశభద్రత కోసం పోరాడుతున్న శ్రామికులు. ఈ సంఘటనను చూస్తే- పోలీసులు, పారా మిలటరీ విభాగం వారు గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేదనిపిస్తోంది.

Pages