S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

03/10/2018 - 23:52

ప్రధాన మంత్రి కావాలని తపన పడే ఏ నేతకైనా దేశం మీద, సాంస్కృతిక పరంపర మీద పరిపూర్ణమైన ప్రేమ, భక్తి విశ్వాసాలు ఉండాలి. ఓటుహక్కు ఉన్న వారెవరైనా ఎన్నికల్లో పోటీచేసి గెలవవచ్చు. ఇలా గెలిచిన నేతలందరి వల్లా జాతి రక్షింపబడుతుందనే నమ్మకం లేదు. సు మారు ఆరు దశాబ్దాల పాటు నెహ్రూ కుటుంబం ఈ దేశాన్ని పాలించింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘నేను హిందువును కాను’ అని చెప్పుకున్నారు.

03/10/2018 - 05:53

గత పాతికేళ్లుగా సీపీఎంకు కంచుకోటగా ఉన్న త్రిపురలో అఖండ విజయం సాధించిన భాజపా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకొన్నది. ‘ప్రజా నాయకుడి’గా పేరొంది సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని భాజపా కూల్చివేయడం ఘన విజయమని చెప్పుకోవాలి.

03/08/2018 - 03:50

అసెంబ్లీ, పార్లమెంటు అనే చట్టసభలు ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయాలు. ఈ ఆలయాలను ప్రజాప్రతినిధులు బహిష్కరించడమంటే- ప్రజల నమ్మకాలను వమ్ము చేసినట్లే. నిరసన తెలియచేసేందుకు ప్రతి దానికీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ పరిమితులు హద్దు దాటితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఏపీ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది.

03/07/2018 - 07:39

మన దేశంలో చట్టాలకు కొదవ లేదు. ఏ మతానికి చెందిన వారికైనా వర్తించేలా వివాహ చట్టాలు, విడాకుల చట్టాలు, ఆస్తి పంపకాలకు సంబంధించిన చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.

03/04/2018 - 00:06

మూడు ఈశాన్య రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు కొందరికి విస్మయాన్ని కలిగించాయి. ముఖ్యంగా కమ్యూనిస్టులకు కంచుకోట అయిన త్రిపుర రాష్ట్రంలో భాజపా స్పష్టమైన మెజారిటీ సంపాదించి మంత్రివర్గం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ‘కామ్రేడ్ల’ రాజ్యంలో ఇది ఎలా జరిగింది? భారతదేశ చరిత్రలో త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళ ఈ మూడు కమ్యూనిస్టు ప్రాధాన్యం కలిగిన రాష్ట్రాలు.

03/02/2018 - 22:45

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం అరెస్ట్‌తో జాతీయ స్థాయిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లండన్ నుంచి చెన్నైకు చేరుకున్న కార్తీని మనీ లాండరింగ్ కేసులో ఎయిర్‌పోర్ట్‌లోనే సిబిఐ అధికారులు హడావుడిగా అరెస్టు చేయడంతో- అవినీతి పట్ల తాము కఠినంగా ఉన్నామన్న సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం యత్నించినట్టు స్పష్టమవుతోంది.

03/01/2018 - 00:40

నకర్మణా న ప్రజాయా ధనేన త్యాగే నైకేన అమృత్వ మానషుః - అని ఆర్ష సంప్రదాయం. ఒక వ్యక్తిగాని, ఒక సంస్థగాని త్యాగం వల్ల మాత్రమే అమృతత్వాన్ని పొందగలగడం సాధ్యం. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం ద్వారా తాను అమృతత్వం సాధించడంతోపాటు భారత జాతికి అమృతమయమైన ఒక సందేశాన్ని అందించారు.

02/28/2018 - 01:05

సర్వోన్నత న్యాయస్థానంలోనే క్రమశిక్షణ అంశం చర్చకు రావడం, న్యాయవ్యవస్థలో క్రమశిక్షణ లోపిస్తే వ్యవస్థలకు నష్టమని ముగ్గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించడంతో- మరో మారు సుప్రీం జడ్జీల మధ్య ‘స్నేహం’పై చర్చ మొదలైంది.

02/25/2018 - 02:19

మానవులంతా సమానమే కాని కొందరు మాత్రం ఎక్కువ సమానం అని ఆంగ్లంలో ఒక నానుడి వుంది. ఇదిగో ఈ ఎక్కువ సమానస్థుల జాబితాలో మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు చేరుతారు. న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఒక బ్యాంక్ ఖాతాలో నూట నాలుగు కోట్ల ముప్ఫది ఎనిమిది లక్షల రూపాయల - వెయ్యి రూపాయల (పెద్ద) నోట్లు జమచేయబడ్డాయి. ఆ ఖాతా మాయావతి సోదరునిది. మొత్తం ఎనిమిదిసార్లు ఈ మొత్తం జమ చేయబడింది.

02/24/2018 - 06:41

తొమ్మిది వేల కోట్ల మేరకు బ్యాంకు రుణాలను చెల్లించకుండా దేశం నుండి పరారైన విజయ్‌మాల్యా ఉదంతం కనుమరుగు కాకముందే మరో ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11,500 కోట్ల మేరకు టోపీ పెట్టి సంపన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశం విడిచి వెళ్లిపోవడం సంచలనం కల్గించింది.

Pages