S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

03/24/2018 - 03:56

నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రా మారావు, పి.వి.నరసింహారావు వంటి తెలుగువారు జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర వహించారు. తెలుగువారి ఉనికిని జాతీయ స్థాయిలో చాటారు. ఆ తర్వాతి కాలంలో ఢిల్లీలోని పెద్దల చుట్టూ తిరుగుతూ, వారిని ప్రసన్నం చేసుకొంటూ జాతీయస్థాయిలో తమ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నవారే గాని, బలమైన నాయకత్వాన్ని ప్రదర్శించిన తెలుగు నేతలు లేరని చెప్పవచ్చు.

03/22/2018 - 01:39

దే శ రాజధానిలో ఉగాది నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీకి ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉంది. సోనియా గాంధీ నుండి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ప్రథమ సభలివి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ సభలకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ 20 రాష్ట్రాలలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ నామావశిష్టంగా ఉంది.

03/21/2018 - 00:04

ఏదైనా కేసు ఉంటే చాలు- పెద్ద చదువులు చదివిన వారికైనా ఉద్యోగం ఇవ్వరు.. అయితే, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు, జైలుశిక్షలు పడినా బెయిల్‌పై ఉన్నవారు చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులుగా ఎలా కొనసాగుతున్నారు? ఇలాంటి నేతలను పదవులకు అనర్హులుగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న ఇపుడు అనేక మలుపులు తిరిగి పెను సంచలనానికి దారితీసింది.

03/18/2018 - 00:15

ఇప్పుడు చైనాకు ‘చక్రవర్తి’ జిన్‌పింగ్. జీవిత కాలమంతా ఆయన చైనా అధ్యక్షుడిగా కొనసాగుతారు. చైనా రాజ్యాంగంలో ఈమేరకు సవరణ చేశారు. దానికి నేషనల్ పీపల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ)గా పిలిచే ఆ దేశ పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది.

03/17/2018 - 03:31

ఉపఎన్నికల ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అవి తాత్కాలికంగా ప్రకంపనా లు సృష్టించినా, రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపే అవకశం ఉండదు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఇటీవల తమిళనాట ఆర్కే నగర్ నుంచి దినకరన్ విజయం సాధించడం.. ఇలాంటి ఉదంతాల ప్రభావం దీర్ఘకాలం కనిపించదు.

03/14/2018 - 23:52

దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నమస్కారములు, శుభాకాంక్షలు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న సందర్భంగా మీ కోసం రాసిన ఈ బహిరంగ లేఖను చిత్తగించండి. తమకు తెలుగు భాష రాకపోయినా ఇంటెలిజన్స్ వర్గాలు, భాజపా కార్యకర్తలు ఈ లేఖ సారాంశాన్ని మీకు అందజేస్తారన్నది నా ఆశ.

03/13/2018 - 23:28

జీవితం, మరణం అనే భావనలను నిర్వచించడానికి తత్వవేత్తలు,వైద్యులు,రచయితలు అనాదిగా అనేక ప్రయత్నాలు చేశారు. జీవితాన్ని, మరణాన్ని వెలుగు-చీకట్లతో వర్ణించారు. ‘జీవితం నిరంతరం కాలే దీపం.. వెలుగు కావాలంటే దీపంలోని ఒత్తి కాలిపోవల్సిం దే, ఒత్తి కాలకుండా వెలుగు సాధ్యం కాదు’ అని స్వామి వివేకానంద పేర్కొన్నారు. జీవితం, మరణం పరస్పర సంభవాలు. ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ డ్రైడన్ ‘జీవితం ఒక మోసం’ అంటారు.

03/10/2018 - 23:52

ప్రధాన మంత్రి కావాలని తపన పడే ఏ నేతకైనా దేశం మీద, సాంస్కృతిక పరంపర మీద పరిపూర్ణమైన ప్రేమ, భక్తి విశ్వాసాలు ఉండాలి. ఓటుహక్కు ఉన్న వారెవరైనా ఎన్నికల్లో పోటీచేసి గెలవవచ్చు. ఇలా గెలిచిన నేతలందరి వల్లా జాతి రక్షింపబడుతుందనే నమ్మకం లేదు. సు మారు ఆరు దశాబ్దాల పాటు నెహ్రూ కుటుంబం ఈ దేశాన్ని పాలించింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘నేను హిందువును కాను’ అని చెప్పుకున్నారు.

03/10/2018 - 05:53

గత పాతికేళ్లుగా సీపీఎంకు కంచుకోటగా ఉన్న త్రిపురలో అఖండ విజయం సాధించిన భాజపా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకొన్నది. ‘ప్రజా నాయకుడి’గా పేరొంది సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని భాజపా కూల్చివేయడం ఘన విజయమని చెప్పుకోవాలి.

03/08/2018 - 03:50

అసెంబ్లీ, పార్లమెంటు అనే చట్టసభలు ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయాలు. ఈ ఆలయాలను ప్రజాప్రతినిధులు బహిష్కరించడమంటే- ప్రజల నమ్మకాలను వమ్ము చేసినట్లే. నిరసన తెలియచేసేందుకు ప్రతి దానికీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ పరిమితులు హద్దు దాటితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ఏపీ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది.

Pages