S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

04/24/2019 - 02:00

వ్యక్తులు లేదా సంస్థలు నిర్భీతిగా ముందడుగు వేస్తున్నపుడు ఆరోపణల రూపంలో దాడి చేయడం, వారి సర్వసత్తాక సామర్ధ్యాలను దెబ్బతీయడం మన ప్రజాస్వామ్య దేశంలో చాలాకాలంగా చూస్తున్నదే. సైనిక పాలన ఉన్న దేశాల్లోనో, రాచరిక పాలనలోనో అయితే ఇలాంటి ఆరోపణలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రధాన మంత్రిని సైతం పంచాయతీ వార్డు సభ్యుడు కూడా విమర్శించేంత స్వేచ్ఛ ఉంది.

04/21/2019 - 02:26

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం దుర్గమారణ్యాలతో నిండి ఉంటుంది. ఇక్కడ అనాదిగా ఆదివాసీలు జీవిస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు మత పరివర్తనలకు ఇలాంటి ప్రాంతాలనే ఎంచుకున్నాయి. చైనా ప్రేరేపిత ఉగ్రవాదులకు ఈ అడవులపై మంచి పట్టు ఉంది. దంతెవాడ, సుకుమా వంటి ప్రాంతాల్లో వేలకొద్ది మావోయిస్టులు ఉన్నారు. ఇక్కడ రహస్యంగా గంజాయి సాగు జరుగుతూ ఉంటుంది.

04/19/2019 - 21:56

మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా సుదీర్ఘకాలం జైలులో ఉండటమే కాకుండా, తీవ్రమైన పోలీసు చిత్రహింసలకు గురైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను భోపాల్ నియోజకవర్గం నుండి తన అభ్యర్థిగా ప్రకటించడం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వేసిన పెద్ద ‘మాస్టర్ స్ట్రోక్’ అని చెప్ప వచ్చు.

04/19/2019 - 02:00

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకొంది. స్థానిక కోర్టు భవనంలో కొంత భాగం ‘మా పూర్వీకులదని’ ఓ తెలుగుదేశం నాయకుడు ఆ ప్రాంగణంలో హద్దురాళ్లు పాతాడు. దీన్ని విచారించేందుకు జిల్లా న్యాయాధిపతి ఆ పట్టణానికి వచ్చాడు. విచారణ లోతుగా జరగ్గానే దీనికంతటికి రెవిన్యూ అధికారుల అవినీతి కారణమని జడ్జి గ్రహించారు. వెంటనే మండల రెవిన్యూ అధికారిని కోర్టుకు పిలిపించారు.

04/18/2019 - 03:43

ఆంధ్రాలో పోలింగ్ ముగిసినా రాజకీయ పార్టీల మధ్య రాద్ధాంతం కొనసాగుతోంది. ఈసారి పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కానీ, ఈ ఆనందం మంటగలిపేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. పోలింగ్ ముగిసి వారం రోజులు గడచినా ఉద్రిక్తతలు తగ్గలేదు. ఏపీలో రాజకీయ పార్టీల తీరు ఇలాగే ఉంటుందని మరోసారి రుజువైంది.

04/14/2019 - 05:17

భారతదేశ స్వరూప స్వభావాలను, నిచ్చెనమెట్ల కుల సమాజ స్థితిగతులను, ప్రజల ఆకాంక్షలను డా.అంబేద్కర్ అర్థం చేసుకున్నట్టుగా మరే తాత్త్వికుడు అర్థం చేసుకోలేదు. బుద్ధుని ధర్మం, సత్యం, అహింస మార్గావలంబియైన అంబేద్కర్ ఈ దేశ మూల జాతులనుంచి వచ్చిన అసలైన ‘్భరతరత్న’. బుద్ధుని ప్రేమమయ సిద్ధాంతాన్ని జీర్ణించుకొని, మహాత్మ జ్యోతిబా ఫూలేను గురువుగా భావించి దేశం కోసం తనను తాను అంకితం చేసుకున్న అపర బోధిసత్వుడు.

04/12/2019 - 22:55

ఎన్నికల వేళ వివిధ వర్గాలను ఉద్వేగానికి గురిచేసి, వారి నిస్సహాయతను ఆసరాగా తీసుకొని, వారికి భారీగా సంక్షేమ పథకాలు ప్రకటించడం, ఎన్నికల్లో లబ్ధి పొందడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. ‘వోట్ బ్యాంకు’ రాజకీయాలు తప్ప- ప్రజల అవసరాలు గుర్తించి, సమగ్ర వికాసం కోసం, సుస్థిర అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలను రూపొందించే ప్రయత్నం దాదాపు ఏ రాజకీయ పక్షం చేయడం లేదు.

04/11/2019 - 03:10

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి మెజారిటీ సీట్లు దక్కని పక్షంలో తలెత్తే పరిస్థితిపై ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. భాజ పా మాత్రం తమ కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయనే ధీమాతో ఉంది. ఎన్డీఏకు దీటుగా కూటమిని ఏర్పాటు చేయడంలో విపక్ష పార్టీలు విఫలమయ్యాయి. కేవలం యూపీలో ఎస్పీ,బీఎస్పీ కూటమి మాత్రమే ‘కమలనాథుల’కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

04/10/2019 - 05:18

ఎన్నికల ప్రక్రియ మరింత జవాబుదారీగా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న మన దేశంలో విలువలను పాటించాలంటే , ప్రజల నమ్మకాన్ని ఇనుమడింపచేయాలంటే , రాజకీయ పార్టీల్లో విశ్వసనీయతను పెంచాలంటే ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

04/07/2019 - 02:09

‘తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియా మాకు శనిలా దాపురించాడు’- అని కోమటిరెడ్డి సోదరులు అన్నప్పుడే రాహుల్ గాంధీ జాగ్రత్తపడవలసింది. కాని అలా జరుగలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వృక్షం కుప్పకూలిపోతున్న దృశ్యం కనిపిస్తోంది. డి.కె.అరుణ సహా కొందరు కాంగ్రెస్ నేతలు భాజపాలో చేరారు.

Pages