S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

10/18/2019 - 21:25

‘ప్రపంచ ఆకలి సూచీ’ ప్రకారం మన దేశం 112 దేశాల్లో 102వ స్థానంలో ఉంది. పిల్లల ఎదుగుదల, పౌష్టికాహార లభ్యత, శిశుమరణాల రేటు ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్‌లను ఏటా ఇస్తున్నారు. ఐదేళ్ల లోపు బాలలు వయసుకుతగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎత్తుకి ఎదగక పోవడం లాంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం కూడా మన దేశంలో బాలల ఆరోగ్యం తీసికట్టుగానే ఉంది.

10/18/2019 - 01:21

ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు విద్యాసంవత్సరం మొదలై 5 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ రెండు జతల ఉచిత యూనిఫామ్ (ఏకరూప దుస్తులు) రాకపోవడం పట్ల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దయనీయ స్థితిలో ఉన్న ప్రభుత్వ బడులలో బడుగు, బలహీనవర్గాల పిల్లలే ఎక్కువగా చదువుతున్నారు.

10/15/2019 - 00:05

లాంచీలను పరిశీలించకుండా పర్యాటక శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంతో నదుల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వరద హెచ్చరికలను లెక్కచేయకుండా ధనార్జనే ధ్యేయంతో లాంచీలను నడపటంతో ఇటీవల పాపికొండల యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఎప్పుడూ వెళ్ళే దారిలో కాకుండా వేరే మార్గంలో గోదావరిలో బోటు నడపడం వల్ల ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి.

10/11/2019 - 21:48

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుండి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే ‘సమాచార హక్కు’. పాలనలో పారదర్శకతను పెంచి అవినీతిని అరికట్టేదే సమాచార హక్కు చట్టం. భారత ప్రభుత్వం అక్టోబర్ 12, 2005 తేదీన సమాచార హక్కు చట్టాన్ని దేశం అంతటా అమలులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించుకుని ప్రభుత్వ పనులకు సంబంధించిన సమాచారాన్ని పౌరులెవరైనా పొందవచ్చు.

10/10/2019 - 02:03

‘వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్’ సంస్థ తొలిసారిగా 1992 అక్టోబర్ 10వ తేదీన ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినం’ నిర్వహించింది. 1994 నుండి ప్రతి సంవత్సరం మానసిక ఆరోగ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని లక్ష్యంగా ప్రకటిస్తున్నారు. మన ఆలోచనలు, ఆచరణలు అన్ని మెదడుపైనే ఆధారపడి వుంటాయి. మెదడు గనుక లేకుంటే ఇంజన్ లేని రైలులా, దారం లేని గాలిపటంలా మానవ శరీరం ఉంటుంది.

10/04/2019 - 21:33

దేశమంతటా ఒకే భాష సాధ్యమేనా? పలు ప్రాచీన భాషలకు, విభిన్న సం స్కృతులకు నిలయమైన మన దేశంలో అది సాధ్యం కాదు. ‘ఒకే దేశం-ఒకే భాష’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో జాతీయభాషపై మరోసారి చర్చకు తెర లేచింది. ‘యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం హిందీ భాషకు ఉంది. అంతర్జాతీయంగా మనకు విశిష్ట గుర్తింపు ఉండేలా ఒకే భాష ఉండాలి.

10/01/2019 - 00:06

‘జాతిపిత’ మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలంగా నిర్వహిస్తోంది. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన ఘన చరిత్ర గురించి ఇపుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన ఆశయాలను ప్రచారం చేయడం ద్వారా నేటి తరానికి, రాబోయే తరాలకు గాంధీ సిద్ధాంతాలు ఆదర్శం కానున్నాయి.

09/24/2019 - 03:25

పాపికొండల నడుమ
పారేటి నిండు గోదారమ్మా!

నీ చుట్టూ అల్లుకున్న
ప్రకృతి అందాలు తిలకించి
మురిసిపోవాలని
వాళ్లెంత ముచ్చట పడ్డారో...

నీ అలల హొయలపై తేలిపోతూ
తన్మయత్వం పొందాలని
ఎంత తపన చెందారో...

ఆశలు తీర్చుకొన నీ చెంత వాలితే...
‘మృత్యుసుడు’లు ముంచేస్తుంటే
పట్టనట్లు పరవళ్లు తొక్కుతావా?
ఎరగనట్లు నీ దారిన నువ్వెళ్లుతావా?

09/22/2019 - 03:43

ఎన్ని ప్రభుత్వాలు మారినా గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయుల దయనీయ స్థితి దశాబ్దాల తరబడి మారడం లేదు. 2016వ సంవత్సరంలో సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్‌లోని దోహాలో ప్రవాస భారతీయ కార్మికుల శిబిరాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీక్షించి, వాటిని వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చి రెండేళ్ళు దాటినా కించిత్ అయినా మార్పు రాకపోవడం బాధాకరం.

09/20/2019 - 22:40

ఇప్పుడొక్కసారి మన గతాన్ని పరిశీలిద్దాం. మన గతం అంటే సామాన్యం కాదు, చరిత్రకందని వేల ఏళ్ల చరిత్ర మనది. నేటి మన రాజకీయ నాయకులు కొంతమంది- ఎంతగా పట్టించుకోకపోయినా ఇక్కడే వేదాలు పుట్టాయి. రామాయణ, మహాభారతాల పుణ్యపురుషుల చరిత్ర ఈ దేశానిదే. నేటికీ మన పురాణేతిహాసాలు సజీవంగా ఉన్నాయి. ఆ గ్రంథాలు, ఆ వేదాలు ఉన్నాయి, ఆ పరంపర కొనసాగుతున్నది. ఒకవేళ ఇదంతా ‘మాకొద్దు’ అన్నా ప్రపంచం అంగీకరించదు.

Pages