S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

05/05/2018 - 00:06

పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, ఇసుక తుఫాన్లు రెండు రోజుల వ్యవధిలోనే వందలాది ప్రాణాల్ని బలిగొనడమే కాకుండా భారీగా ఆస్తి, పంట నష్టాల్ని మిగిల్చాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్లు కొన్ని గంటలపాటు విలయాన్ని సృష్టించాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా హఠాత్తుగా విరుచుకుపడ్డ ఈ ఉపద్రవాలు ఒక రకంగా ప్రకృతి పంపుతున్న ముందస్తు సంకేతాలు.

05/01/2018 - 23:54

జాతి నేతల సృజనాత్మకత ప్రస్తుతం వెర్రితలలు వేస్తోంది. మేధావిగా, ఉన్నతాధికారిణిగా గుర్తింపు పొంది, ఇపుడు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్న కిరణ్ బేడీ- ‘టాయిలెట్లు వాడని గ్రామాలకు రేషన్ బియ్యం కట్ చేయాలం’టూ ఆదేశాలు జారీ చేయడం విడ్డూరం.

04/29/2018 - 00:02

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించేందుకు ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి జోసెఫ్ పేరును కొలీజియం సిఫార్సుచేయగా, కేంద్ర ప్రభుత్వం అందుకు అభ్యంతర పరచడం అన్యాయం. అలా అభ్యంతర పరిచే హక్కు కేంద్రానికి ఉన్నప్పటికీ, అందుకు ఉటంకించిన కారణం సరైంది కాదు. జోసెఫ్ కన్నా ఆ పదవికి పోటీపడే సీనియర్లున్నారని, ఆ రాష్ట్రం నుండి ఇప్పటికే ప్రాతినిధ్యం ఉందని ఏవేవో కారణాలు ప్రభుత్వం చెప్పింది.

04/27/2018 - 23:41

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ఉభయ తారకం. ఇరుదేశాల అధినేతల ఆహ్లాద, అనధికారిక సమావేశం ఎవరూ ఊహించనిది. గత కొనే్నళ్లుగా భారత్, చైనాల మధ్య సంబంధాలు అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి. డోక్లామ్ సరిహద్దు వివాదం, ఒన్ టెల్ట్ ఒన్ రోడ్డు నిర్మాణంపై అభ్యంతరాలు, పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదం, టిబెట్ అంశంపై పొరపొచ్చాలు తదితర అంశాల మధ్య అనుమానాల స్నేహాన్ని రెండు దేశాలూ నెట్టుకొస్తున్నాయి.

04/23/2018 - 23:50

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్షను ఖరారు చేస్తూ భారత ప్రభుత్వం అత్యావసరాదేశాన్ని తీసుకురావడం శుభపరిణామం. కఠినమైన చట్టం నేరస్థుల్ని భయపెట్టడానికి, అకృత్యాలను అదుపు చేయడానికి కొంతవరకూ అక్కరకొస్తుంది. జమ్మూలో చిన్నారిపై పైశాచిక ఘటన వెలుగు చూశాక, సమాజంలో నెలకొన్న ఆందోళనను గమనించి ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకొంది. దారుణమైన నేరాల పట్ల తాము మెతక వైఖరి తీసుకోబోమంటూ చెప్పినట్టయింది.

04/22/2018 - 00:04

ఈమధ్య పది రోజుల పాటు అసెంబ్లీలోనూ, టెలికాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని మోదీని, భాజపాని ఏకిపారేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండాకులు ఎక్కువ చదివిన ఆయన అనుచరులు మోదీని ‘నరకాసురుడు, రావణుడు, హిట్లర్’ అంటూ నోరారా తిట్టారు. హామీలు అమలు పరచాలంటూ తాము మర్యాదగా అడుగుతుంటే భాజపా ఎదురుదాడి చేస్తోందని అమాయకత్వం నటించారు చంద్రబాబు.

04/21/2018 - 00:07

2025 నాటికి క్షయ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ఇటీవల సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో క్షయవ్యాధి పీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తుమ్మినా, దగ్గినా ఒకరినుంచి మరొకరికి సులువుగా వ్యాపించడంతో ఎక్కువమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది.

04/19/2018 - 23:45

తెలంగాణలో ఇంటర్ బోర్డు కళాశాలలకు సెలవులు ప్రకటించినా హైదరాబాద్‌లో యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయ. ఒకవైపు ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు కనీసం వారం రోజులపాటు కుటుంబ సభ్యులతో గడపకుండా తిరిగి ద్వితీయ సంవత్సరం తరగతులకు వెళ్లాల్సి రావడంతో, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు.

04/17/2018 - 00:02

అక్కడో అసీఫా.. ఇక్కడో అయేషా
నిమిషానికో నిర్భయ.. అడుగుకో అనామిక
బడిలో, గుడిలో
నగరిలో, నడివీధిలో, నట్టడివిలో
పుణ్యభూమి భారతావనిలో

ఎటుచూసినా పసిమొగ్గల ఆర్తనాదాలే
విషమించిన, విషనాగుల పశువాంఛకు
అకారణంగా.. అమానుషంగా
నేలరాలుతోన్న పసిడి ప్రాణాలే

04/14/2018 - 00:19

ఎన్నికల వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఉద్యోగులకు జీతభత్యాలను, పదవీ విరమణ వయసును పెంచుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో రిటైర్మెంటు వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచింది. కేంద్రం కూడా అదే బాటలో వుందనే వార్త నిజమైతే లక్షలాది మంది నిరుద్యోగుల నోట మట్టికొట్టినట్లే.

Pages