S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

02/23/2019 - 21:50

ప్రజలకు అవసరమైన కూడు, గూడు, గుడ్డ సమకూర్చే దిశగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. కూడుపెట్టే రైతన్నకు ఏటా పదివేలు, నిరుపేదలందరికీ ఇళ్లు సమకూర్చుతోంది. గుడ్డ నేచే నేతన్న పరిస్థితే విషమంగా ఉంది. చిలప నూలుపై కేంద్రం పన్ను విధించింది. కుల వృత్తిని నమ్ముకుని వేరే దారిలేక లక్షల కుటుంబాలు మగ్గం గోతికే పరిమితమయ్యాయి.

02/22/2019 - 02:21

నేటి నవ నాగరిక సమాజంలో మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటికి అంతమంటూ లేదు. పసికందుల నుంచి ముసలి వాళ్లవరకూ.. బడికెళ్లే చిన్నారులు మొదలు యువతులు, ఉద్యోగినులు, ఆఖరికి మహిళా మంత్రులు కూడా లైంగిక వేధింపులకు గురివుతున్నారంటే.. ఎలాంటి భయంకర పరిస్థితుల మధ్య నేడు మనం బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు.

02/07/2019 - 00:17

మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొంది 70 వసంతాలు పూర్తిచేసుకోవడం ఆనందదాయకం. దేశ భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన రాజ్యాంగం నుండి ఆశించిన ఫలాలు అందడం లేదు. ఇందుకు కారణాలను పునరావలోకనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలందరికీ సామాజిక, సాంఘిక, ఆర్థిక న్యాయం కల్పించాలని మన రాజ్యాంగానికి 122కు పైగా సవరణలు చేశారు. ఏ ఫలితాలను ఆశించి సవరణలు చేసినా పరిస్థితిలో మార్పు లేదు.

02/01/2019 - 21:49

దేశ సత్వర అభివృద్ధికి పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ వుండడం ఎంతో అవసరం. ప్రభుత్వం తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాలు ప్రజలందరికీ లబ్ధికలిగించే విధంగా వుండాల్సిన ఆవశ్యకతను ఆర్థిక నిపుణులు, మేధావులు పదేపదే చెబుతూవచ్చారు. ఆర్థికపరమైన విధానాలు లోపభూయిష్టంగావున్నా లేక తొందరపాటు నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నా మొత్తం దేశ ఆర్థికవ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం వుంది.

01/31/2019 - 00:22

అమెరికా పెత్తనాన్ని ధిక్కరిస్తూ సామ్యవాదాన్ని అవలంబిస్తున్న దేశంగా నిలిచిన వెనెజులా తీవ్ర సంక్షోభంలో ఉంది. గత కొనే్నళ్లుగా ఆర్థిక యుద్ధంలో ఉన్నట్లు ప్రకటించిన ఆ దేశం ప్రస్తుతం రాజకీయ, సామాజిక సంక్షోభంలో చిక్కుకోవడంలో అమెరికా హస్తం ఉంది.

01/18/2019 - 22:13

మన దేశంలో ఎయిర్ ఇండియా సంస్థ దశాబ్దాల తరబడి సేవలందించడం ఆనందదాయకమైన విషయం. కానీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అనుచిత నిర్ణయాలతో పెను రుణభారాన్ని ఈ సంస్థ మోయలేక మోస్తోంది. అయిదారేళ్ళుగా మన దేశంలో విమానయానం మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోనికి వచ్చింది. ప్రైవేటు విమానయాన సంస్థలతో పోటీ పడలేక- ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా కూలబడిపోవడం బాధాకరం.

01/18/2019 - 02:18

కులపరమైన రిజర్వేషన్ల పేరుతో రాజకీయాలాడే పార్టీలు దేశానికి ప్రమాదకరం. కులం పేరిట రిజర్వేషన్లు దేశంలో ప్రజల ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రజల్లో ఐకమత్యాన్ని లేకుండా చేయడానికే రిజర్వేషన్లను మన నాయకులు ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు. కొన్ని కులాలకు కొంత కాలం రిజర్వేషన్లు కొనసాగించి, ఆ తర్వాత రద్దుచేయమని భారత రాజ్యాంగంలోనే డా.బి.ఆర్.అంబేద్కర్ సెలవిచ్చారు.

01/11/2019 - 01:28

ర్యాంకులు, మార్కులు విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తున్నందున నేడు పలు విపరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. బతకడం కోసం, విజ్ఞానం కోసం ఉపయోగపడాల్సిన చదువులు యువతను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని కోట పట్టణంలో ముగ్గురు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. చదువులో ఒత్తిడికి లోనై వీరు బలవన్మరణాలకు పాల్పడి ప్రాణాలు విడిచారు.

01/08/2019 - 01:10

దారి తెలియని అజ్ఞానం కన్నా దారితప్పిన విజ్ఞానమే ఎక్కువ నష్టం కలిగిస్తుంది. సమాజంలో అసలైన విజ్ఞానం, శాస్ర్తియ దృక్పథం పెరిగేలా విస్తృత కృషి జరగాలి. విద్యాధికులు అందుకు ముందుండాలి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్లు మరింత శ్రద్ధగా ఆ పని చేయాలి. ఇప్పటికే మూఢ నమ్మకాలతో దిగజారుతున్న మన సమాజానికి మరిన్ని మూఢ నమ్మకాల్ని పరిచయంచేస్తూ ఇంకా గందరగోళ పర్చరాదు.

12/28/2018 - 00:47

దేశవ్యాప్తంగా అన్నదాతలు తరచూ రోడ్డెక్కడం బాధాకరం. గత రెండేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆందోళనలకు దిగుతున్నా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. గత నెలలో వేలాది మంది రైతులు తమ డిమాండ్ల సాధనకు కిసాన్ ముక్తిమోర్చా పేరిట ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించినా, వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది. నానాటికీ పెరుగుతున్న రుణభారంతో రైతు కుదేలైపోతున్నాడు.

Pages