S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/23/2019 - 22:03

దేశం ముందు పెను సవాళ్లున్నాయి. అందులో మొదటిది ఆర్థికంగా దివాళా దిశగా దేశం దిగజారుతూ పోవడం. కనుక ఆర్థికస్థితి చక్కబరచడం ప్రభుత్వానికి తొలి ప్రాధమ్యం కావాలి. ఒక రకంగా చూస్తే అదే ఏకైక ప్రాధమ్యం కావాలి కూడా. ఆ స్థాయిలో ఫోకస్ అవసరమున్న తీవ్రమైన అంశం ఇదే.

12/22/2019 - 02:14

భారతదేశంలో సుమారు నూట ముప్పై కోట్ల మంది భారతీయుల్లో కోట్లాది మందికి నివాసానికి స్థలాలు, ఇళ్ళు లేక అనేక అవస్థలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ భూములు, పంట భూములు, అటవీ భూములు, చెరువులు విస్తీర్ణం కుదించి (ఆక్రమణలకు గురై) బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినా కోట్లాది మందికి గూడు లేక అలమటిస్తున్నారు.

12/20/2019 - 05:45

కేంద్రం తాజాగా తెచ్చిన పౌరసత్వ చట్టంతో భారతీయ పౌరులెవరికీ నష్టం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించినా ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లో హింసాకాండ కొనసాగుతోంది. పాక్, బంగ్లా, అఫ్ఘన్ దేశాల్లో బలవంతపు మత మార్పిడిలు, కిడ్నాపుల వంటి వేధింపులు తట్టుకోలేక డిసెంబర్ 2014 లోపు వచ్చిన కొన్ని వేల మంది ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వటంతో స్థానిక ప్రజల్లో అభద్రతాభావం ఇంకా పెరిగిపోయింది.

12/15/2019 - 02:31

సీనియర్ నటుడు, ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత, కాలమిస్ట్, వక్త గొల్లపూడి మారుతీరావు అస్తమయం అటు సినిమా, టీవీ ఇటు నాటక, పత్రికా ప్రపంచానికి ఎనలేని తీరని లోటు. ముఖ్యంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గొల్లపూడి డాక్టర్ చక్రవర్తి (1969) సినిమాతో రచయితగా సినిమా పరిశ్రమకు పరిచయమై తదనంతరకాలంలో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, ఎక్కుతూ అనేక పేరుమోసిన నవలలు, రచనలకు అంకురార్పణ గావించిన మేధో సంపన్నుడు.

12/12/2019 - 04:28

నాగరిక సమాజం ఏర్పడాలంటే అది న్యాయ మార్గం ద్వారానే సాధ్యం. ఆలస్యం అమృతం విషం- అన్న సూక్తి న్యాయానికి చక్కగా అన్వయం అవుతుంది. ఆలస్యంగా న్యాయం అందితే అది- న్యాయం నిరాకరించబడినట్టే. అందుకనే పటిష్టమైన న్యాయవ్యవస్థను ఏర్పరచుకోవడం సమసమాజ స్థాపనకి మొదటిమెట్టు. అవసరమైన చట్టాలూ వాటిని నిష్పాక్షికంగా అమలు చేసే యంత్రాంగం, బాధ్యత కలిగిన పౌర సమాజం సత్వర న్యాయం దిశగా సమాజం నడవడానికి కీలకం.

12/10/2019 - 23:36

‘దిశ’ హంతకులను పోలీస్ కస్టడీకి ఇస్తున్నారని తెలియగానే - ప్రజల్లో చాలామంది ‘పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తారనే’ ఆలోచనకు వచ్చారు. అలా అనుకున్నట్టుగానే నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల చర్యకు తెలంగాణ సమాజమే కాకుండా యావత్ భారత దేశం హర్షం వ్యక్తం చేస్తున్నది.

12/05/2019 - 00:46

‘ఉల్లిచేసే మేలు తల్లి చేయదన్నా’
నీరుల్లి, ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు,
ఉల్లిగడ్డ, ఎఱుల్లి, సవాళ,
ఆనియన్, వెంగాయమ్, డున్గ్రీ,
ప్యాస్, పియాజ్, కాందా--
ఇన్ని నామాలింకెన్ని నామాలో! అన్నా
ఎంత మురిసిపోతావెంత మురిసిపోతావ్!

12/04/2019 - 00:05

మృగాలుగా మారిన నలుగురు కిరాతకుల చేతిలో ఓ పశువైద్యురాలు హైదరాబాద్ శివార్లలో దారుణంగా అత్యాచారానికి గురై హత్యగావింపబడటం మానవత్వం వున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసే విషయం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ దారుణ, పెను విషాదకర సంఘటన తెలుగు రాష్ట్రాల ప్రజానీకం యావత్తును తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

12/03/2019 - 00:43

విశ్వనగరం.. భాగ్యనగరం.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం హైదరాబాద్ అని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్న నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఓ వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం, సజీవ దహనం ఉదంతం యావత్ దేశాన్ని కలిచి వేసింది. 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘోరం తరహాలో ఆమధ్య జరిగిన దారుణం పట్ల ప్రజానీకం దిగ్భ్రాంతికి గురి అయ్యింది.

12/01/2019 - 04:42

మూసీ నది కాలుష్యంపై నమోదైన ప్రజాప్రయోజనం వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు వెంటనే స్పందించి, తక్షణం నదీ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం ముదావహం. 40 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన జలాలతో తెలంగాణలో పది లక్షల జనాభాకు ప్రాణాధారంగా నిలిచిన మూసీ నది నేడు మురుగునీటి కంటే అధ్వానంగా మారడం అత్యంత దురదృష్టకరం. మూసీ మాత్రమే కాకుండా దేశంలో ప్రధాన నదులన్నింటిదీ ఇదే వ్యథ.

Pages