S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

07/25/2019 - 01:57

ఈ మధ్య ఐరోపాలోని పోలండ్, చెక్ రిపబ్లిక్‌ల్లో జరిగిన పరుగుపందేల్లో ఐదు స్వర్ణ పతకాలు సాధించి మన దేశం గర్వించేలా ప్రతిభ చూపారు హిమాదాస్. అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించడమే చాలా గొప్ప విషయం. అలాంటిది మన దేశం తరఫున అంతర్జాతీయ పోటీలో ఒకేనెలలో ఐదు స్వర్ణ పతకాలు సాధించడం ఎంతటి గొప్ప విషయమో అర్థం చేసుకోవచ్చు.

07/24/2019 - 01:41

ప్రకృతి వనరుల్లో భాగమైన నీరు సకల జీవజాతికి ప్రాణాధారం. పంటలకు, మానవజాతి మనుగడకు జలవనరులు కీలకం. కానీ, మానవుడు తన అవసరాల నిమిత్తం నీటిని ఇష్టారీతిగా వినియోగిస్తున్నందున భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వాలు ఎంతగా నిధులు ఖర్చు చేస్తున్నా సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు.

07/21/2019 - 02:16

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉద్యోగ నియామకాలు భారీ స్థాయిలో జరుగుతాయని నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు రెండు లక్షలు పోస్టులను భర్తీచేస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఆయన మాటలు నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించాయి.

07/16/2019 - 22:30

నీటిఎద్దడి శరవేగంగా విస్తరిస్తున్న దేశం మనది. పట్టణాలు, పల్లెలు నానాటికీ ‘నిర్జల ప్రదేశాలు’గా మారిపోతున్నాయి. వర్షాకాలం వచ్చినా చెన్నై పట్టణానికి రైళ్లలో మంచినీరు సరఫరా చేయాల్సి వస్తోందంటే నీటి కొరత ఎంత తీవ్రరూపం దాల్చిందో అవగతమవుతుంది. రానున్న రెండేళ్లలో మరో ఇరవై ఒక్క పట్టణాలు ఇదే బాట పట్టనున్నాయని అధికారిక నివేదికలు ఘోషిస్తున్నాయి.

07/10/2019 - 21:56

అభివృద్ధి చెందిన దేశాలు ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేసేలా చర్యలు చేపడుతుండగా మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండడం దురదృష్టకరం. ఇది తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందాన వుంది.

07/10/2019 - 02:43

మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుండి ముఖ్యంగా గత ఐదారు సంవత్సరాలుగా బ్యాంకులు, పోస్ట్ఫాసులు సామాన్యుల పొదుపు డిపాజిట్లపై క్రమంగా వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోని వడ్డీలతో పోల్చి, కార్పొరేట్ వర్గాల వత్తిడితోను, మన దేశం ఆర్థికంగా ఎదిగిందని ఇలా తగ్గిస్తున్నాయి.

07/05/2019 - 21:51

హైదరాబాద్‌లో నూతన సచివాలయం నిర్మాణం పేరుతో ఇప్పుడున్న పాత భవనాలను కూల్చివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదు. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే నూతన సచివాలయం పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగపరచటమే అవుతుంది. ప్రస్తుత సచివాలయ భవనాలు పటిష్టవంతంగా ఉన్నాయని వాటిని కూల్చివేయరాదని, నూతన సచివాలయం అవసరం లేదని వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.

07/05/2019 - 02:07

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చెయ్యడం మంచి నిర్ణయం. ఆ నిర్ణయంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఏమేరకన్నది తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది. మరికొన్ని పరిణామాలు చూశాకే ఆ విషయం చెప్పగలం. తనలాగే ఇంకా చాలామంది బాధ్యత వహించాల్సి ఉంటుందన్న ఆయన మాటలు సత్యదూరం కావు. కాంగ్రెస్ పార్టీ, ఆమాటకొస్తే ఏ జాతీయ పార్టీ అయినా బలహీనం కావడం దేశానికి మంచిది కాదు.

07/04/2019 - 02:41

భారత్ వ్యవసాయ ప్రధాన దేశం. మన దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం ప్రధాన పాత్ర వహిస్తోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు వ్యవసాయం ప్రకృతి పద్ధతులతో మొదలయ్యింది. తర్వాతి కాలంలో అనేక కొత్త విధానాలు, కొత్త పంటల రకాలు, వాటిలో అధిక దిగుబడి నిచ్చే సంకరాలు సాగులోకి వచ్చాయి. పంటలకు వచ్చే తెగుళ్ళ నివారణకు వివిధ రసాయనాల వాడకం మొదలయ్యింది.

07/03/2019 - 04:34

దేశీయంగా ఒకప్పుడు 82 శాతం ఉన్న వ్యవసాయ కుటుంబాలు- నేడు 62 శాతానికి కుదించుకు పోవడం పాలనాపరంగా ప్రభుత్వాలు చేయూత నివ్వకపోవడం, అన్నదాతలను ప్రోత్సహించే నైజం పాలకులకు లేకపోయాయన్నది కఠోర వాస్తవం. భూమిని నమ్ముకొని రైతులు, వారి కుటుంబ సభ్యులు నిరంతర కష్టంతో పంటలు సాగుచేస్తారు. పంట ఉత్పత్తుల అంచనాలతో కుటుంబ వ్యవస్థ ప్రగతిని రైతు ఆశిస్తాడు.

Pages