S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

04/08/2018 - 00:06

భారతదేశ రాజ్యాంగ రచనకు సారథ్యం వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన మాటలను నేడు రాజకీయ నేతలు పెడచెవిన పెడుతున్నారు. అణగారిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కేవలం పది సంవత్సరాలు కొనసాగించి, ఆ తర్వాత వాటిని రద్దు చేయాలని అలనాడు అంబేద్కర్ కోరారు. ఎంతో దూరదృష్టితో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.

04/04/2018 - 23:37

తప్పుడు వార్తలు రాసే పాత్రికేయులకు దండన తప్పదంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ అందుకు తగ్గ విధి విధానాలు ప్రకటించారు. పత్రికా రంగానికే కాక మొత్తం సమాజానికి జరుగబోయే కీడును శంకించిన ప్రధాని వెంటనే అందుకు అడ్డం పడి ఎంతో మేలు చేశారు. నరేంద్రుని మంత్రివర్గంలో జరిగిన ఈ ఉదంతం- ఇంద్రుని సభలో జరిగిన ఘటనను గుర్తుకుతెస్తోంది. ఆ వృత్తాంతం ఏమనగా...

04/04/2018 - 00:18

పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడం సామాన్యుడి నడ్డి విరచడమే. రోజువారీ ధరల నిర్ణయం తర్వాత ఆయిల్ ధరలు శుక్లపక్ష చంద్రుడిలా పెరుగుతూ పోవడమే తప్ప ఒక్కసారైనా తగ్గింది లేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరకు అనుగుణంగా పెట్రో ధరలు సవరిస్తామన్న ప్రభుత్వం అక్కడ తగ్గినా ఇక్కడ తగ్గించింది లేదు.

04/03/2018 - 02:06

మనిషి మనుగడకు నీరు ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పని లేదు. ప్రతి వ్యక్తి రోజుకు ఆరు లీటర్ల పరిశుభ్రమైన మంచినీళ్ళు తాగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో సూచించింది. వేసవికాలం ఆరంభంలోనే తెలంగాణలో మంచినీటికి కటకట ఏర్పడి ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇప్పుడే నీటికొరత ఈ విధంగా ఉంటే మే, జూన్‌లలో పరిస్థితి ఏమిటి? తాగునీటి సమస్య పట్ల ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించడం క్షంతవ్యం కాదు.

03/31/2018 - 00:37

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుండి బ్యాండ్ల రూపంలో అప్పులు చెయ్యడానికి సిద్ధపడుతున్నారు. బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు. ఈ నిర్ణయం సబబు కాదేమో? ఇప్పటికే రాష్ట్రం నెత్తిమీద రూ. 2,25,000 కోట్ల ఋణం ఉంది. ఇది ఈ ఏడాది బడ్జెట్ కన్నా ఎక్కువ. అప్పులు చేయకుండా అభివృద్ధి అసాధ్యమే. కానీ మితిమీరిన అప్పులతో ముప్పే.

03/30/2018 - 00:14

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఒప్పంద, కంటింజెంట్ ఉద్యోగులు తమ సర్వీసులు క్రమబద్ధం కావాలంటూ దశాబ్దాల తరబడి నిరీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వు 143 (తే 16- 3-1984దీ) ప్రకారం ఐదు సంవత్సరాలు సేవలు పూర్తిచేసిన వారిని , ప్రస్తుతం పనిచేసేవారిని (ఐదేళ్లు నిండగానే) పర్మనెంట్ చేయాలని స్పష్టం చేస్తోంది. సుమారు లక్షా పాతికవేలమందికి ఉద్యోగ భద్రత ఏర్పడింది.

03/29/2018 - 02:05

నిన్నటి దాకా మిత్రులుగా కొనసాగిన ఎన్డీఏ, తెలుగుదేశం పాలక పక్షాలు ‘బంధాన్ని’ వదులుకొని, ఇప్పుడు ఉత్తరాల యుద్ధం మొదలుపెట్టాయి. భాజపా అధ్యక్షుడు అమిత్ షా తొమ్మిది పేజీల నిందారోపణల లేఖను ఏపీ సీఎం చంద్రబాబుకి రాయగా, చంద్రబాబు అంతకన్నా పెద్దదైన బుక్‌లెట్ రూపంలో తిరుగు జాబు పంపారు. అయితే లేఖలన్నీ, లెక్కలన్నీ అందరికీ తెలిసిన తీరులోనే సాగుతున్నాయి.

03/25/2018 - 01:31

2019లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ తొలి సంతకం పెడతానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. తొలి సంతకం పెట్టాలన్న తపన తీరాలంటే ఆయన ప్రధాని అవ్వాలి కదా! ఇక, ప్రత్యక్ష రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్న సోనియా గాంధీ పుత్రోత్సాహంతో ప్రాంతీయ, జాతీయ పార్టీల్నీ ఏకతాటిపైకి తెచ్చి భాజపాని చిత్తుచేయాలని 17 మంది విపక్ష నేతలను ఆ మధ్య విందుకు ఆహ్వానించారు.

03/24/2018 - 00:26

ప్రఖ్యాత సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్’కు చెందిన 5 కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా వ్యాపారావసరాలకు వినియోగించడం విస్మయం కలిగించని అంశమే. ఈ వ్యవహారంపై ‘ఫేస్‌బుక్’ అధినేత పశ్చాతాపం ప్రకటించినా, మళ్లీ అలాంటి తప్పు జరగదన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇంకోసారి ఇంకో సంస్థ ద్వారా ఇలాంటి పనులు జరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

03/23/2018 - 00:11

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ లెనిన్ విగ్రహాలను రాజకీయ కక్షతో కొందరు ధ్వంసం చేయడం అనాగరిక చర్య. ఓడిపోయిన వారు దేశం వదలిపోవాలనడం సరికాదు. తమిళనాడులో పెరియార్ విగ్రహాలపై దాడి చేయడం రాక్షస చర్యే. లెనిన్ టెర్రరిస్టు అని, అతను ఎంతోమందిని చంపించాడని భాజపా నేత సుబ్రమణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు మూర్ఖత్వం అనాలి. యుద్ధంలో రక్తపాతం అనివార్యం.

Pages