S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

09/20/2019 - 01:49

తాతముత్తాతల కాలం నుంచి
ఇక్కడే జీవనం సాగిస్తున్నాం
నల్లమల మా పుట్టిల్లు

చెట్టుచేమ, ఆకు అలములు
సకల జీవులు మా తోబుట్టువులు

కొండకోనలు, వాగువంకలు,
నదులు, సెలయేళ్ళు
మా ఇలవేల్పులు

అడవితల్లిని నమ్ముకున్నోల్లం
అనె్నం పునె్నం ఎరుగని ఆదివాసీలం

09/10/2019 - 02:08

అతి తక్కువ ఖర్చుతో రెండు పూటలా భోజనాన్ని- అన్ని సామాజిక వర్గాల్లోని నిరుపేదలకు అందించేందుకు ఏపీలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసింది. ధనిక వర్గాల కోసమో, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమో వీటిని ఏర్పాటు చేయలేదు.

09/06/2019 - 21:45

ఒక జాతి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్నా, ఒక భాష స్థితిగతులు, వర్తమాన పరిస్థితులు భవిష్యత్ తరాలకు చరిత్రగా అందించాలన్నా అది గ్రంథాల ద్వారా మాత్రమే సాధ్యం. ఎన్నో వేల, లక్షల గ్రంథాలను భద్రపరిచి ప్రజలను విజ్ఞానవంతులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దేదే గ్రంథాలయ వ్యవస్థ.

09/04/2019 - 02:03

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల నియామకాలను చేపడుతోంది. అందులో భాగంగా మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలోనే ఇవి అతి పెద్ద నియామక పరీక్షలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

09/01/2019 - 03:42

అమరావతి ప్రాంతం వరదలు వచ్చినపుడు మునిగిపోతుంది, నిర్మాణ వ్యయం ఇతర చోట్లకంటే రెట్టింపు అవుతుంది, శివరామకృష్ణయ్య కమిటీ రాజధానికి అనువుకాదని నివేదిక ఇచ్చింది కావున మరో ప్రాంతానికి మార్పుచేయాలని రాష్ట్ర మంత్రి బహిరంగంగా ప్రకటించడం, అందుకు కొందరు మంత్రులు మద్దతు పలకడం, ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం, అసలు రాజధాని అమరావతిలో ఉంటుందా?

08/30/2019 - 02:03

ఏ ప్రభుత్వమున్నా ఏమున్నది గర్వకారణం- నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించడంలో వారి విద్యార్హతకు తగ్గ ఉద్యోగం కల్పించడంలో మాత్రం పాలకులు ఘోర వైఫల్యం చెందుతూనే వుంది.

08/29/2019 - 01:35

మన ప్రధాని నరేంద్ర మోదీ విజేయుడనిపించుకుంటూ ముందుకు పోతున్న విషయం అందరికీ తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు పుల్వామా దాడులకు ప్రతిదాడుల నేపథ్యంలో లష్కరే తోయిబా స్థావరం మీద మెరుపుదాడులు చేసి అనేక మందిని మట్టుపెట్టడంతో యావత్ ప్రపంచం ‘ఔరా.. భారత్..!’ అని ఆశ్చర్యపడింది.

08/27/2019 - 01:45

తెలుగు తేజం పీవీ సింధు ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించడం భారతీయులందరికీ గర్వకారణం. ఈసారి ఆమె ‘ఫైనల్ ఫోబియా’ను జయించి, భారతీయ క్రీడాకారులెవరూ ఇప్పటివరకూ సాధించని ఘనతను తన ఖాతాలో వేసుకొంది. గతంలో రెండుసార్లు అందినట్టే అంది చేజారిన ‘ప్రపంచ చాంపియన్ షిప్’ ఇపుడు సింధు సొంతం కావడంతో భారత పతాకం అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడింది.

08/25/2019 - 02:37

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్-మాక్సిస్ కుంభకోణంలో పీకలదాకా కూరుకుపోయి జైల్లో ఊచలు లెక్కబెట్టే దయనీయ పరిస్థితికి చేరుకోవడం దేశవ్యాప్తంగా పెనుసంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ‘కంచే చేను మేస్తే’ ఇక అడ్డుచెప్పేది ఎవరు? ఆపేది ఎవరు?

08/23/2019 - 21:47

గద్దలు, రాబందులు
ఒకే గూటికి చేరుకున్నాయి
ఒకే నినాదం ఎంచుకున్నాయి

జెండాలు, ఎజెండాలు విడిచి
ఒకే వేదిక పంచుకున్నాయి
ఒకే రాగం గొంతుకెత్తుకున్నాయి
ఒకే వ్యూహరచన చేస్తున్నాయి

మునుపటిలా కళేబరాలను గాక
బతికున్న జీవుల కుళ్లబొడిచి
రక్తమాంసాలు పీక్కు తిన
సామూహికంగా సంసిద్ధమయ్యాయి

Pages