S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

01/13/2017 - 02:19

లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని మోదీ ఆలోచన ఆచరణలో అసాధ్యం అనిపిస్తోంది. ఈ విధానం గతంలోనే విఫలమైంది. అప్పట్లో దేశ జనాభా తక్కువగా ఉండేది. రాజకీయ పార్టీలు కొంతవరకైనా విలువలను పాటించేవి. ఓటర్లపై ధన ప్రభావం, ఇతర ప్రలోభాలు అంతగా ఉండేవి కావు. స్వేచ్ఛగా ఓటర్లు తమకు నచ్చిన పార్టీని గెలిపించేవారు.

01/12/2017 - 07:20

సంక్షేమ హాస్టళ్లను దశలవారీగా గురుకులాలుగా మారుస్తామని ఎపి సర్కారు పలుసార్లు ప్రకటించింది. బడుగువర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది. ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 100 హాస్టల్ సంక్షేమాధికారుల, గిరిజన సహాయ సంక్షేమాధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం విడ్డూరం.

01/11/2017 - 07:16

సమరయోధులు, జాతీయ నాయకుల విగ్రహాలతో ఇప్పటికే రోడ్లన్నీ నిండిపోతుండగా ఈ మధ్య స్థానిక నేతలు, కులనాయకుల విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. జయంతులు, వర్ధంతుల రోజుల్లోనే కాదు ఎప్పుడు పడితే అప్పుడు స్థానిక నేతల విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తూ వారి అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. కులసంఘాలు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొంటూ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు.

01/10/2017 - 01:38

పెద్దనోట్లను రద్దు చేశాక డిజిటల్ లావాదేవీలపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు చాలా ప్రమాదకరం అన్న అనుమానాలు లేకపోలేదు. బ్యాంకు ఎకౌంట్ ‘హ్యాక్’ అయితే గనుక మొత్తం డబ్బు పోతుంది. ఎటిఎం కార్డుల పిన్ నెంబర్లు ఇతరులకు తెలిసిపోతే సులువుగా మోసాలు చెయ్యడం జరుగుతుంది. నూరు శాతం అక్షరాస్యత ఉండే అమెరికాలోనే నగదు వాడుతున్నారు. భారతదేశంలో చదువుకున్నవారే మోసపోతున్నారు.

01/09/2017 - 00:39

సీరియళ్లు వచ్చే సమయానికి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ టీవీలకు అతుక్కుపోతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, పగ, ద్వేషాలు, భార్యభర్తల, అత్తాకోడళ్ల గొడవలు నేపథ్యంగా సీరియళ్లు ప్రసారమవుతూ పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. ఇవి చూసి ఇంట్లో గొడవలు, అనుమానాలు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటిని చూడడం వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతోంది.

01/06/2017 - 23:52

గత పదేళ్ల కాలంలో లారీలు, బస్సులు, కార్లు, బైక్‌లు, ఆటోలు, వ్యాన్‌లు, ఇతర వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ వాహనాల వల్ల వాయు, శబ్ద కాలుష్యాల శాతం వృద్ధి చెందుతోంది. పల్లెల నుంచి నగరాల వరకూ మెకానిక్ షెడ్‌లు, లారీ షెడ్‌లు, వెల్టింగు షాపుల్లో పనుల వల్ల వాయు, శబ్ద కాలుష్యాలు ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమించాయి.

01/05/2017 - 23:55

రాజకీయంగా ఏ మాత్రం పరిపక్వత లేని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేస్తున్న ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నోట్లరద్దు వ్యవహారంలో అవినీతి జరిగిందని, ఆ విషయాలను లోక్‌సభలోనే వెల్లడిస్తానని చెప్పిన రాహుల్ మాటలు ప్రజలందరికీ నవ్వు తెప్పించాయి. మోదీ ముడుపులు స్వీకరించినట్టు రాహుల్ ఆరోపించడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.

01/05/2017 - 07:15

ప్రజాస్వామ్య దేశాల్లో మత విశ్వాసాల కన్నా వ్యక్తి స్వేచ్ఛ, హక్కులు మిన్న. ఏళ్ల తరబడి కొనసాగే దాంపత్య బంధాన్ని ‘తలాక్’ అనే మాటతో రద్దు చేసి పొమ్మనడం ముస్లిం స్ర్తిల హక్కుల్ని హరించడమే. కొన్ని ముస్లిం దేశాల్లో ఇప్పటికే ‘తలాక్’ని రద్దుచేశారు. ‘మా దేశంలో ఉండాలంటే మా చట్టాల్ని పాటించాల్సిందే’- అని ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలు నియమం పెడతాయి. అందుకు అంగీకరించిన మీదటే ముస్లింలు అక్కడ వుంటున్నారు.

01/04/2017 - 00:56

కుల, మత, భాషా భావజాలాన్ని ఆధారం చేసుకొని ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరడం నిషిద్ధమని, అది అవినీతితో సమానమని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునివ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టం గట్టే చర్య. లౌకిక విలువలకు ప్రజాప్రభుత్వం కట్టుబడాలి. అన్ని కులాలు, మతాల్ని సమానంగా గౌరవించాలి. అలాంటి ప్రభుత్వం ఏర్పరడానికి పోటీపడే పార్టీలు ఆ స్ఫూర్తిని ఆచరణలో చూపాలి.

01/03/2017 - 01:39

కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరడంతో విసుగెత్తిన ప్ర జలు నరేంద్ర మోదీపై ఎంతో విశ్వాసం ఉంచి గత ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి అధికారం కట్టబెట్టారు. నల్లధనాన్ని అంతం చేసేందుకు మోదీ పెద్దనోట్లను రద్దు చేయగా ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా ఎంతో సహనం ప్రదర్శించారు. నగదు లేక, చిల్లర లేక అనునిత్యం అవస్థలు పడినా తమకు ప్రధాని మోదీ ఏదో మంచి చేస్తారని ప్రజలు ఎదురుచూశారు.

Pages