S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

01/27/2016 - 03:25

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తామన్న విద్యుత్‌శాఖ అధికారుల వాగ్దానాలు నీటి మీద రాతలుగా మిగిలిపోతున్నాయి. తెనాలి, రేపల్లె మండలాలలో నిత్యం విద్యుత్ సమస్యలు తలెత్తుతునే వున్నా యి. ప్రమాద భరితంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్లు, విరిగిన విద్యుత్ స్తంభాలు, తక్కువ ఎత్తులో వున్న తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.

01/25/2016 - 23:51

స్వాతంత్య్ర సౌరభాన్ని
భూమ్యాకాశాలను నింపిన
మహాపురుషుల నెలవు యిది
ఇది పుణ్యభూమి; సద్భావనావని
తలిదండ్రులను గౌరవించి సేవించమని
స్ర్తిలను పవిత్రంగా చూడమని
పేదా, బిక్కీ
నువ్వూ, నేనూ- అందరమూ
ఆ శంకరుని భిక్షకు పాత్రులమేనని
బోధించిన ఆదర్శభూమి
భగీరథుడు ఆకాశగంగను
భూమికి తెచ్చిన చరిత్ర మనది
హరిజనులంటూ, అంటరానివారంటూ

01/24/2016 - 23:58

చిన్న చూపేల?

01/22/2016 - 23:36

మన తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది విద్యార్థులు స్కాలర్‌షిప్ రాక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు విద్యార్థులకు స్కాలర్‌షిప్ సరియైన కాల వ్యవధిలో అందడంలేదు. మైనారిటీ విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు స్వస్తిచెప్పే పరిస్థితి వస్తోంది. మన తెలంగాణా ముఖ్యమంత్రి జిల్లా అయిన మెదక్‌లో చాలాచోట మైనారిటీలకు స్కాలర్‌షిప్ రావడం లేదు.

01/21/2016 - 23:46

నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ప్రమేయానికి, క్రియాశీలక పాత్రకోసం నిర్దేశించబడిన ఎం.పి. లాడ్స్ నిధులు పెద్దఎత్తున దుర్వినియోగం అవుతున్నాయన్న కాగ్ తాజా నివేదిక క్షేత్రస్థాయిలో ఈ పథకం వైఫల్యానికి తార్కాణంగా నిలుస్తోంది. ఈ విధమైన ఎంపీ స్థానిక ప్రాంత పథకం మన దేశంలో తప్ప ఎక్కడా అమలులో లేదన్నది స్పష్టం.

01/21/2016 - 04:24

‘కంచెలో కన్నాల’ గురించిన సంపాదకీయం బాగుంది. బ్రిటిష్‌వారు కుటిలనీతిని ప్రయోగించి, చరి త్రను వక్రీకరించి దేశాన్ని ద్వేషించడమే నాగరికత అన్న స్థాయలో కానె్వంట్లలో పాఠాలు చెప్పించారు. అందువల్ల ప్రజలకు దేశభక్తి పనికిరాని పదార్థమైపోయం ది. అయ్యర్ లాంటి వారు పాక్‌కు వెళ్లి మోదీని దించేస్తే కాని శాంతి చర్చలు జరుగవని ప్రకటించడం దారుణం. మరో దేశంలో అయతే దేశద్రోహం కింద అయ్యర్‌ను జైల్లో పెట్టి ఉండేవారు.

01/20/2016 - 06:03

విశాఖనగరంలో కొండ వాలు ప్రాంతాలలో పెద్దఎత్తున ఆక్రమణలకు పాల్పడుతూ స్థిర నివాసాలను ఏర్పాటుచేసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాలలో గుడిసెలు వేసుకునేందుకు అనుమతులు రానందున నగరంలో కొండలను, గుట్టలను ఆక్రమించుకుంటున్నారు. కొండవాలు ప్రాంతాలలో నిర్మాణాలు ప్రమాదంతో కూడుకున్నవని తెలిసినా గతిలేని పరిస్థితులలో పేదలు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇటువంటి 25వేల కుటుంబాలు ప్రమాదాల అంచున జీవిస్తున్నారు.

01/18/2016 - 23:59

పృథ్వీరాజ్ 16 సార్లు మహమ్మద్ ఘోరీని ఓడించి, క్షమించి వదిలేశాడు. 17వ సారి ఘోరీ మహమ్మద్, ఫృథ్వీరాజ్ చౌహాన్ని తరైన్ యుద్ధంలో ఓడించి, కళ్లు పీకించి, గుర్రానికి కట్టి లాక్కెళ్లాడు. భారత్ నుంచి బంగారాన్ని గుర్రాల మీద, స్ర్తిలను బానిసలుగా తీసుకెళ్లాడు.

01/18/2016 - 07:34

నేడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు చాలా ఉన్నాయి. అయితే వాటిల్లో పిల్లల్ని చేర్పించాలంటే చాలా కష్టం. చేతినిండా డబ్బులుండాలి. ఫీజులు, డొనేషన్లు, యూనిఫార్మ్‌లు, అవీ ఇవీ అంటూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. కొందరు తల్లిదండ్రులు పేదవారైనా అప్పులు చేసి మరీ ఈ బడుల్లో చేర్చి తమ ఇంటిని గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. వారు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు తెరవడం లేదు.

01/15/2016 - 08:01

గోద్రా సామూహిక హత్యాకాండ తరువాత జరిగిన మతకల్లోలాలను సాకుగా తీసుకొని నరేంద్ర మోదీని దోషిగా చూపడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసులు వేసి, సిట్‌ను నియమించి శతవిధాలా ప్రయత్నించింది. కానీ ఏ తప్పూ చేయని మోదీ నిర్దోషిగా బయటపడ్డారు. కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు.

Pages