S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/17/2019 - 18:49

మఱియొకనాడు నేను బండి యెక్కి ‘మేచాబజారు’నుండి పోవుచుండ అమ్మ ‘షోకుగా’ వేషము వేసికొని జనులను మోహింపజేయుటకై సంసిద్ధమై సుందరివలె గాన్పించినది. నుదుట కస్తూరీ తిలకమును, తలలో సవరమును ధరించి యామె విలాసముగా హుక్కా పట్టుచుండెను. ‘‘అమ్మా! ఈ రూపమును గూడ నీ వెన్నుకొంటావా!’’అని నేనాశ్చర్యముతో లోకేశ్వరినడిగి యామెకు సాష్టాంగ ప్రణామమాచరించితిని.

07/16/2019 - 18:49

ఈ స్థితిలో నాకు అమ్మ (కాళి)యే సర్వము నైయున్నట్లు కాన్పించుచున్నది. సర్వత్ర ఆమెయే- లోకేశ్వరియే- నాకు గోచరించుచున్నది. దుష్టులు కూడ- భాగవత పండితుని సోదరుడు కూడ- అమ్మయే యైయున్నదని కాళికాలయమున నాకు గోచరించినది. నేనెంత ప్రయత్నించి నను రామలాల్ తల్లిని దూషింపలేక పోతిని. అమ్మయే మఱియొక రూపమున ఆమెయై యున్నదని నాకు గాన్పించినది. బాలకలందు అమ్మ కానవచ్చుట చేతనే నేను వారిని పూజింతును.

07/15/2019 - 19:36

‘నేను’కాదు, ‘నేను’కాదు, అంతయు ‘నీవే’.

07/14/2019 - 22:21

ఇది వర్ణింప నలవికానిది- జీవుడు బ్రహ్మముగా మాఱునట్టి యఖండ పరిణామము. ఉప్పుబొమ్మ సముద్రపు లోతును గనుగొనుటకై అందు దుమికినదట కాని యది నీటిని తాకినంతనే కరగిపోయినదట! అపుడిక సముద్రము ఎంత లోతున్నదో వచ్చి చెప్పువారెవ్వరు!
గురుదేవుని నిరంతర బ్రహ్మానుభూతి
990. ‘‘స్వామీ! మీరు భగవంతుడు కలడని నమ్మెదరా!’’ అని యొకరు ప్రశ్నింప, ‘‘ఔను, నమ్మెద’’నని శ్రీ గురుదేవుడు సమాధానమొసగెను.

07/13/2019 - 22:19

ఈ స్థితిలో మఱికొన్ని నాళ్లు గడచిన వెనుక లోకేశ్వరి యాజ్ఞ నాకిట్లు వినవచ్చెను: ‘‘లోకమునకు బోధించుటకై ‘భావముఖమున’(అనగా ద్వైత ప్రపంచ స్ఫురణము, ఆత్మావలోకనము నను రెంటికిని నడుమ- ద్వైత ప్రపంచ ద్వారమున)నుండుము.’’ నాటినుండి రక్తగ్రహణి ప్రారంభమయ్యెను. ప్రేవులను మెలిపెట్టి పిండుచున్నట్లు దుర్భర బాధ కలుగసాగెను. ఆఱునెలలు ఈవిధమైన బాధ మూలమున క్రమముగా మఱల శరీర స్మృతి కలుగనారంభించెను.

07/11/2019 - 22:27

ఇతర విషయములనుండి మనస్సును మఱల్చుట నాకు కష్టమనిపించలేదు గాని కేవల చైతన్యసారమై, దేదీప్యమానమై యొప్పు శ్రీలోకేశ్వరి రూపము నాకు మిగుల చనవైన కారణమున ఆ దివ్య స్వరూపము నాకు సత్యస్వరూపమున ప్రత్యక్షమై నా మనస్సును నామరూప ప్రపంచమును దాటి పోనీయకుండెను. ఎన్నిసారులు అద్వైతముపై మనస్సును నిలుప బ్రయత్నించినను ప్రతి పర్యాయమును ఆ రూపము నాకు అడ్డువచ్చుచునే యుండెను. అప్పుడిక నిరాశుడవై, ‘ఇది నాకు సాధ్యము కాకున్నది.

07/10/2019 - 18:47

982. మహమ్మదీయ మత సాధనల నాచరించినప్పుడు తన మనఃస్థితిని వర్ణించుచు శ్రీగురుదేవుడిట్లు తెల్పెను. ‘‘నేనపుడు అల్లా నామ స్మరణము చేయుచు, మహమ్మదీయులవలెనే బట్టలను ధరించుచు, యథావిధిగా నమాజుచేయుచుండెడివాడను. మనస్సునుండి హిందూ భావములన్నియు పూర్తిగా పలాయనమగుటచే హిందూ దేవతలకు నేను నమస్కరింపకుండుటయేకాక, వారిని దర్శింపవలయునని నాకపుడు బుద్ధికూడ పుట్టెడిది కాదు.

07/09/2019 - 19:38

979. శ్రీగురుదేవుని పరిశుద్ధమానసమే యాతనికి ప్రథమ గురువై, ప్రధాన గురువై యొప్పెను. ఇన్విషయమునుగూర్చి శ్రీగురుదేవుడిట్లు వచించియున్నాడు; అవసరమైనప్పుడెల్ల నా శరీరములోపలి నుండి సరిగా నావలెనే కాన్పించునొక బాలసన్న్యాసి వెలువడి నాకు సర్వము బోధించువాడు. ఈ విధముగా నాతడు వెలువడ నొక్కొక్కప్పుడు కొంచెము బాహ్యస్ఫురణ గలిగియుండెడివాడను. మఱియొక్కొక్కప్పుడు ఆతని సాన్నిధ్యమును చేష్టలను కనిపట్టుట తప్ప.

07/08/2019 - 18:37

ఒక్కొక్కప్పుడు తీవ్ర భగవద్విరహవేదనచే మొగము నేలనుబెట్టి రాచుకొన, గాయములై రక్తము వచ్చెడిది. ధ్యానముతో, ప్రార్థనలతో, భక్తిసాధనలతో, దినములు అట్టె నిముషములవలె గడచిపోవ, నాకపుడు వానిని గూర్చిన యెఱుకయే లేకుండెడిది. సంధ్యాసమయమును ఆలయమునుండి శంఖ ఘంటారవములు ఘోషింప పగలు గడచి రాత్రియగుచున్నదని నాకపుడు స్మరణకు వచ్చెడిది.

07/07/2019 - 23:01

తన దివ్యానుభవమును శ్రీగురుదేవుడిట్లు వర్ణించెను: తలుపులతో, కిటికీలతోగూడ ఆ గదియు ఆలయమును నాచుట్టునున్న సమస్తము క్షణములో అదృశ్యమయ్యెను. ఇక నేమియు లేనట్లు తోచెను. దేదీప్యమానమగు ననంత చైతన్యసాగరము మాత్రమే నాకు గోచరింపసాగెను. ఏ వైపు జూచినను- అన్ని దిశలనుండియు- ఆ దివ్యసాగర మహోత్తుంగ తరంగములు నావైపు ఉవ్వెత్తుగ వచ్చుచుండెను. అచిరకాలముననే యవి నాపైబ్రసరించి నన్ను ముంచివేసెను.

Pages