S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/08/2019 - 20:00

ఇద్దఱు స్నేహితులు భాగవత కాలక్షేపము జరుగు తావునకు సమీపమునుండి పోవుచుండిరి. అందొకడు, ‘‘అదిగో, అచటికిబోయి కొంచెముసేపు పురాణమును విందము’’ అనెను.

08/07/2019 - 19:53

పాపమా నిర్భాగ్యుడేమి చేయగలడు? గురువుగారా, ఏవో మాయ మాటలతో- కల్లబొల్లి వాగ్దానములతో బంపివేయుటకు, ఆమె తన శయ్యామందిరపు గురవయ్యెను! ఇక నేమి చేయుట! ఈమె యాజ్ఞ అప్పటికప్పుడే చెలామణియై తీరవలయును. లేనిచో, ‘ఇంటిలోని పోరు ఇంతంత గాదయా!’ యనునట్లగును. తుదకా వర్తకుడు విధిలేక అర్థరాత్రి వేళ బోయి, కొట్టు తీసి భార్య కోసము బట్టలు తెచ్చినాడు.

08/06/2019 - 20:51

ఆ బ్రాహ్మణుని దైన్యముచూచి యామె, ‘‘అయ్యో, పాపము! ఈ బ్రాహ్మణుడు చాలా దురవస్థలో నున్నాడు’’ అని జాలిపడెను. ఆ బ్రాహ్మణుడు వెంటనే యిట్లనెను: ‘‘నీవు బాబుగారితో నొక్కమాట చెప్పితివా నాకుద్యోగము దొరకును’’. ‘‘గోపమ్మ యా రాత్రియే ‘బాబుగారితో’ జెప్పెదనని వాగ్దానము చేసెను’’. విచిత్రము!

08/05/2019 - 18:09

ఒకసారి రాజు తనకడకు రండని వారికి గబురుచేయగా, ‘‘రాజునే యిక్కడకు రమ్మనుడు’’అని జవాబు చెప్పిరి. కాని తరువాత వారు పెండ్లిండ్లు చేసికొనసాగిరి. అంత నిక రాజునకు వారిని బిలువనంపవలసిన యగత్యమే లేకుండబోయినది! వారు తమంతతామేపోయి, ‘‘మహారాజా! ప్రభూ! మిమ్ము దీవింపవచ్చితిమి. మీకొఱకై దేవాలయమునుండి ప్రసాదమును దెచ్చితిమి; స్వీకరింపుడు’’అని వేడుకొనువారు. వారటుల జేయక తప్పినది కాదు. పాపము. ఆ నిర్భాగ్యులేమి చేయగలరు?

08/04/2019 - 22:10

కామమే బంధ కారణము
‘సంసారము నంటని సంసారి’

08/02/2019 - 19:57

నాకును యక్షుడీగోతములను దీసికొమ్మని రుూయబోయెను; కాని యాధనము, ‘దాచుకొనుటకా, వ్యయించుటకా?’యని నేనడుగగా, యక్షుడు మాఱు పలుకకుండ బాఱిపోయినాడు. ఆ ధనము ఎవరును వాడుకొనదగినది కాదని నీకు తెలియదా? అది చేచిక్కినవారికి దానినింకను గూడబెట్టవలయుననియే కాని వ్యయింపవలయునని బుద్ధిపుట్టదు.

08/01/2019 - 19:13

పఆ మంగలి యిటునటు చూడగా నెవ్వరును గానరాలేదు. ఏడు గోతముల బంగారము నిచ్చెదనను శబ్దమెటులైనను వానికి బేరాసను గల్గింపనాతడు, ‘‘ఆహా! తీసికొందు’’నని గట్టిగా నఱచెను. ‘‘ఇంటికి బొమ్ము, నేనాగోతములను నీ యింటికి జేర్చినాను’’ అను ప్రతివచనము వెంటనే వినవచ్చెను. ఈ విచిత్రమెంతవఱకు నిజమో కనుగొందమను నాత్రముతో నాతడింటికి బరుగెత్తెను. ఇల్లుచేరి చూచుసరికి గోతములు కట్టెదుటనుండెను!

07/31/2019 - 18:51

ఒరే నీకంటె నేనే కైపు ఆపుకొని పడిపోకుండ ఉన్నాను! చూడు నా మజా!’’- తుదకొక సాధువు వచ్చి సమాధిమగ్నుడైన యొక మహనీయుడచట పడియుండెనని గ్రహించి యాతని చెంత గూర్చుండి పాదములొత్తనారంభించెను.
(నిజమైన మహత్త్వమును పవిత్రతను గ్రహింపకుండ మన లౌకిక ప్రవృత్తులిట్లు మనలను నిరోధించుచుండును)
పల్లెవాండ్ర దివ్యావేశము : అర్చకుని యన్నము

07/30/2019 - 19:34

ఇట్లాలోచించుచు, ‘‘ఇపుడు ఆకస్మికముగా నన్నొక పెద్దపులి వచ్చి గుటుక్కున మ్రింగెనా!’’ అని ఊహింపగనే క్షణములో గాండ్రుమని ఒక పెద్దపులి వానిపై నురికి మెడ కొరికి నెత్తురు పీల్చనారంభించెను. ఇటులాబాటసారి ప్రాణములు గోల్పోయెను.

07/29/2019 - 18:38

1055. అమితభక్తిచే (తన్మయత్వము పొందుటచే) హాని కలుగుననుట అవివేకము- అసంగత ప్రలాపము. మాణిక్యకాంతులు మనోహరముగను ప్రశాంతికరముగను ప్రకాశించునే కాని తగులబెట్టవు.
1056. లీలమూలమున నిత్యుని దెలిసికొనయత్నింపుము.
1057. ‘సత్తు’ను దెలిసికొనుటకై ‘చిత్తు’నాశ్రయింపుము. (అనగా శుద్ధసత్త్వస్వరూపమగు బ్రహ్మమును దెలిసికొనుటకై శుద్ధ చైతన్యరూపమగు వాని లీల నాశ్రయింపుమని భావము.)

Pages