S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/27/2019 - 19:37

భరత భూమి కర్మభూమి. కర్మాచరణ పై మక్కువ ఉన్నవారు ఎక్కువగా నే ఉంటారు. భగవంతుడే అన్నింటికీ కారణమనుకుంటూ కర్మను మనచేత చేయంచేవాడు భగవంతుడే అనే కర్మసిద్ధాంతాన్ని నమ్మేవరు ఉన్నారు. చేయాల్సిన పనిని నీవు చేస్తే ఇవ్వవలసిన ఫలితాన్ని నేను ఇస్తాను అని గీతాచార్యుడు చెప్పాడు.

02/26/2019 - 19:38

కాకతీయుల కాలంలో వీరశైవం దేదీప్యమానంగా వెలుగొందినది. వారు ఎన్నో శివాలయాలు కట్టించారు. శివభక్తిపరులై పరమశివుని ఆరాధించి కొన్ని వందల సంవత్సరాలు అజేయులై పరిపాలించారు. ఈ కొమరవెల్లి గ్రామం వరంగల్ పరిధిలోనే ఉన్నందున అక్కడ శివారాధన ఆలయాలు ఎన్నో వెలిశాయి. వాటిలో ఇంద్రకీలాద్రిపై వెలసిన మల్లికార్జునస్వామి ఆలయం ప్రసిద్ధమైనది.

02/26/2019 - 19:35

కృష్ణపత్నులు:
ఏమిటి ఈ విచిత్రమ్ము? ఎందులకి తీరు?
ఒక యింటనె పుట్టి పెరిగి- కౌరవ పాండవులు

కలహింతురె ఈ విధాన? కలసియుండ నోపరె?
పోరు తోడ పెరిగి పోరు పౌరుల నశియించరె?

శ్రీకృష్ణుడు:
నిజమేలే! మీరు చెప్పు మాటలు నిజమేలే!
చెప్పుటయే మనవంతు చేయుట వారల వంతు

చంద్రుడొకడే కానీ- చీకటి వెలుగులును రెండు
చంద్రునందె పుట్టిపెరిగి- చంద్రునిలో కలహించును

02/25/2019 - 19:39

శ్రీకృష్ణుడు:
సరియైనదె మీ ప్రశ్నయు- సరియగు సందేహము
సరిసరి! ఒక మర్మమిందు దాగున్నది తెలుపుడు

నే పాండవ పక్షపాతినందురోయి నిజమేను!
పాండవ పక్షమె ధర్మం- ధర్మపక్షమే నేను!

చీకటి వెలుగులను బోలు- కౌరవ పాండవులు
చీటికి మాటికి పోరుట- కలుగును చీరాకులు

ధర్మజుండు ధర్మరాజు- ధర్మస్వరూపుండు
తప్పుదేమొ నేనైనను- తప్పడతడు మాట.

02/25/2019 - 19:44

గోదావరీ నదీ దక్షిణ తీరమున పరివ్యాపితమైయున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, ఉత్తర దక్షిణ భారతీయులకు సేతువై నిలిచిన ఈప్రాంత నాగరికత కాల ప్రవాహంలో కొట్టుకొని పోయినా, ఔత్సాహికులైన చారిత్రక పరిశోధకుల అవిరళ కృషి ఫలితంగా కథలుగా, గాధలుగా, నోళ్ళలో, రాళ్ళలో, ఆకులలో, రేకులలో, ఆక్కడక్కడా నిక్షిప్తమైయున్న చరిత్ర కొంతవరకు వెలుగులోనికిరాగలిగింది.

02/24/2019 - 19:54

రాముడేక సతీవ్రతుడు- అది రాముని మార్గం
బహుపత్నీవ్రతుడీతడు- ఇది కృష్ణుని మార్గం

ప్రేమకు దూరమ్మాయెను రాముండానాడు
ప్రేమకు మూలమ్మాయెను కృష్ణుండీనాడు

రాజకీయములను నలిగె- రాఘవుడానాడుః
తానే చక్రము ద్రిప్పెను- కృష్ణుడీనాడు

నరుల వానరుల బ్రోవగ- రాముడవతరించె గోవుల గొల్లల గావగ- కృష్ణుడుద్భవించె

02/24/2019 - 19:53

భక్తుల కుల ఇల దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా స్వయంభూ దైవమైన శ్రీరాజ రాజేశ్వర స్వామికి పేరుంది. జగిత్యాల నూతన జిల్లాలోని సారంగాపూర్ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతమైన పెంబెట్ల గ్రామం వద్ద గల గుట్టపైన శ్రీరాజరాజేశ్వరుడు వెలసియున్నాడు.

02/24/2019 - 19:51

దేశ మాతృ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టిన అమర వీరులను ఆరాధించే సత్సంప్రదాయం హైందవ సంస్కృతిలో ఉంది. సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఉత్తర తెలంగాణ జానపదులు ఆరాధ్య దైవాలుగా కొలవడం సదాచారంగా మారింది. దాదాపు 900 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన వన దేవతల జాతర పూర్తిగా గిరిజన సాంప్రదాయంలోనే సాగుతుంది.

02/22/2019 - 20:27

ఆకాశమె ఎగురలేక అవనిపైన ఒరుగును
వాయువైన ధాత్రి కొంగు పట్టుకు పారాడును

చినుకైనా మట్టిపొరల కునుకుతీయు నోరుూ!
పూవైనా పరిమళించి పుడమి రాలునోరుూ!

ఇది కాదో అవతారం?
ఇదె రహస్యసారం!

ధర్మమ్మే తానగుచును బ్రతుకువాడె యుగపురుషుడు
ప్రజల కొరకు తానంకితమైన వాడె మహత్ముడు

ధర్మరక్షణమ్ము కొరకు ధాత్రిని శ్రీకృష్ణుడు
పాపుల శిక్షించుటయే ఆతని ధ్యేయమ్ము

02/21/2019 - 19:20

ఋగ్వేదంలో గణపతి వేదాలకు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వ వ్యాపక శక్తులకు ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు.

Pages