S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/19/2018 - 19:03

ఇయంవై కద్రూరసౌ సువర్ణీ
ఛందాగంసి సౌపర్ణేయాః
ఈమె కద్రువు. ఈమె సుపర్ణి. ఈ సుపర్ణికి ఛందస్స్య రూపులైన ముగ్గురు పుత్రులున్నారు. వారు సౌవర్ణేయులు. జగతి త్రిషుటప్పు గాయత్రి అని వాళ్ళ పేర్లు.
సా బ్రవీదప్మై వై పితరౌ, పుత్రాన్ బిభృతస్తృతీ
య స్వామితో దివి. సోమస్తమాహరం.
తేనాత్మానం
నిష్క్రీణీయే ష్వితి మా కద్రువవోచదితి.
(కృ.య.వేద సంహిత 6-1-6)

12/18/2018 - 19:36

శ్రీ - లోని
శవర్ణం- సుఖబీజం. అది ఆనందకారణం.
రం వర్ణం- అగ్ని బీజం అది తేజఃకారణం
ఈ వర్ణం- తేజఃపుంజాత్మక చిచ్ఛక్తిరూపం.
అందుకని వాల్మీకి మహర్షి సుందరకాండలో అక్కడక్కడ స్వామిని శ్రీమాన్ అంటారు.
ఆ మాటకిది అర్థం అని ఆ సమయంలో మనం భావన చేయాలి.
స్వామి మహేంద్రగిరి మీద నిలిచి ఉన్నాడు.
ప్రమాణానికి చాలనంత శరీరాన్ని పెంచి ఉన్నాడు.
తనతోటి వానరులు

12/17/2018 - 18:53

అయితే-
సర్వదేవతామూర్తులుగా స్వామిచేత నమస్కరింపబడిన వారిలో సూర్యుడు ఇంద్రుడు వాయువు బ్రహ్మ ఉన్నారు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథః
అగస్తి రగ్ని సూర్యశ్చ ఇప్ద్రస్స్కందశ్కివస్త్థా
క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామీ ఉపాసకాః

12/16/2018 - 22:15

పూర్వం ఋషులందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. వారంతా బ్రహ్మదేవునికి నమస్కరించి మేము ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశాన్ని ఇవ్వమని అడిగారు. వారి మాటలకు బ్రహ్మదేవుడు సంతోషించారు. ‘నేను నా రథ చక్రాన్ని విసురుతాను. అది వెళ్లి ఆగిన చోట పవిత్రమైన ప్రదేశంగా భావించండి. అక్కడ మీరు మీమీ తపస్సులు, రచనలు సాగించండి. ఆ ప్రదేశం నేమి నిలిచిన చోటుకనుక నైమిశారణ్యంగా ప్రఖ్యాతి వహిస్తుంది.

12/16/2018 - 22:14

సామాన్య సాధకులకసాధ్యములు, మీదుమిక్కిలి ప్రమాదకరములు, సంపూర్ణమగు నింద్రియ నిగ్రహమున్ననే కాని సమీపమునకుగూడ బోధగని సాధనలివి. కాని జితేంద్రియ చక్రవర్తియు జగజ్జనని ముద్దుబిడ్డడునగు శ్రీరామకృష్ణుడు వీనినన్నిటి నవలీలగా సాధింపగలుగుటాశ్చర్యము కానేరదు. అతని ప్రతిభాతిశయ మెట్టిదో దీనిమూలముననే మనకు దెలియగలదు.

12/16/2018 - 22:12

ఆ గుహలలో సూక్ష్మ శరీరంతో నివసిస్తూన్న భూతాలు కూడా ఉండలేకపోయినవట. మహావృక్షాలు గుండెలకు రాస్తూ ఉండగా స్వామి నిష్ప్రమాణ స్వరూపుడై ఎదిగిపోతున్నాడు. ఇక్కడ స్వామిని విద్యాధరులు దర్శయంతో మహావిద్యాం అనినట్లు చూస్తున్నారు. స్వామి యోగ విద్యాస్వరూపమై ఉన్నాడు.
మార్గమాలోకయాన్ దూరాదూర్థ్యం ప్రణిహితే క్షణ:
రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్.

12/13/2018 - 19:14

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః
ఇయేష పదమనే్వష్టుం చారణా చరితేపథి
తన దర్శన మాత్రం చేతనే శత్రువులను కృశింపజేయగల ఆంజనేయస్వామి సీతానే్వషణం కొరకు చారణా మార్గంలో బయలుదేరాడు.
చారణ విధ్యాధర కిన్నర కింపురుష గంధర్వాది దేవతాగణములు తమతమ యోగ బలస్థాయిల ననుసరించి ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు.

12/12/2018 - 19:51

తల్లి అనుగ్రహం వాళ్లకు కలిగింది. ఎందుకని? ఆమె- పంచ సంఖ్యోపచారిణి. ఐదిటివలన ఎప్పుడూ ఉపచారాలను పొందుతూ ఉంటుంది. ఏమిటీ పంచ?
భూమి నీరు నిప్పుగాలి ఆకాశం అనే రుూ మహాభూతాలు. వీటిచేత సేవింపబడే ఆ తల్లి ఈ అయిదుగురిని అనుగ్రహించింది. ఎందుకని! వీరు అవి ఒకటే కనుక. ఎలా?

12/11/2018 - 22:18

ఆ తరువాత అరణ్య వాసమన్నారు. సరే అన్నాడు.
తల్లి కౌసల్యకు చెప్పేడు. ఆవిడ ఏడిచింది. వద్దన్నది.
ఆమెను ఊరడింపచేసేడు. సీతా సందర్శనానికి వచ్చేడు.
వాల్మీకి మహర్షి ఇక్కడ మన చేత సీతా దర్శనం చేయిస్తారు. ఎలాటి సీతను-
వైదేహీ చాపి తత్సర్యం నశుశ్రావ తపస్వినీ
తదేవ హృది తస్కాశ్చ వరాజ్యాభిషేచనవ్
వరాజ్యాభిషేక భంగ వృత్తాంతవే తెలియని తపస్విని అయిన సీతను చూపిస్తారు.

12/11/2018 - 22:15

రామకృష్ణ జననము, బాల్యము

Pages