S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/07/2018 - 00:11

97. అట్లు శపథము జేసి రామానుజుండు
పాదుకల భక్తితో తలపై ధరించి
అన్న అనుమతి వడసి శతృఘు్న తోడ
అరద మెక్కెను తిరిగి కోసలను జేర

98. రామచంద్రుడు గురుజనంబులకు మంత్రి
వరులకును వందనమ్ము లొనర్చి పరిజ
నముల వీడ్కొల్పి గద్గద గాత్రుడౌచు
తల్లులకు మ్రొక్కి యాశ్రమ మందు జొచ్చె

03/07/2018 - 00:09

ఎన్ని సంపదలు, పదవులు, విద్యా సంపద, ధనం, హోదాలు ఎలా ఏవి ఉన్నా అహంకారం ఎప్పుడూ పనిచేయదు. తామే గొప్ప అనుకోవడం ఇతరులని తక్కువగా అంచనా వేయడం చిన్నచూపు చూడడం తగదు. అది అహంకారులకే ముప్పు. అందుకు నిదర్శనంగా మనకు అత్యంత భక్తుపరుడు, సంగీత విద్వాంసుడు, తాండవకృష్ణమాచార్యులు కథ తేటతెల్లం చేస్తుంది.

03/05/2018 - 21:11

సామవేద మహావాక్యము ‘తత్త్వమసి’. చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది ‘ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది.

03/05/2018 - 21:05

85. గురు జనంబులు మంత్రులు వౌని వరులు
అందరాసీనులై యుండ రామచంద్రు
పాదముల చెంత గూర్చుండి భక్తి వినయ
ములతొ భరతుడు అన్నతో బల్కెనిట్లు

86. అన్న! శమియింపు మన్న నన్ గన్న తల్లి
మూఢ చిత్తమై చనటి కార్యంబొనర్చె
అగ్రజుండవు నీవుండ పిన్న వాడు
రాజ్యమేలుట ధర్మమే? రామచంద్ర!

03/05/2018 - 21:04

దేహము, ఆత్మ వేరు వేరు. చేసిన కర్మల వల్ల ఈ దేహము ప్రాప్తవౌతుంది కాని దేహము ఆత్మ ఒక్కటి కాదు. మానవుడు పాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లుగా చేసిన కర్మల ఫలితాన్ని బట్టి ఆత్మ ఇపుడున్న దేహాన్ని విడిచి మరొక దేహాన్ని పొందుతుంది. కాని ఆత్మ చావదు పుట్టదు. అసలు ఆత్మకు చావు పుట్టకలు లేవు. ఆత్మ దేహము కాదు. దేహమందు దేహి ఒకడు కలడు. అతనికి కౌమార, యవ్వన జరలవలనే మరొక దేహము కూడ ప్రాప్తమగును.

03/05/2018 - 20:59

అయ్యో నాకోసం ఇంత తపించే నావారిని నేను ఇబ్బందులకు గురిచేయడం ఏం బాగుందిఅనుకొన్నాడు. వెంటనే ఒక్కసారిగా తన దేహాన్ని పెంచాడు. అప్పటిదాకా అంతా నా ప్రతాపం అనుకొన్న కాళీయుడు విచిలితుడయ్యాడు. ఇదేమిటి ఇట్లా అవుతోందే అనుకొన్నాడు. తృటి కాలంలో కృష్ణుని దేహం కాళీయుని చీల్చుకుని పైకి వచ్చింది. ఆ దెబ్బకే కాళీయునిలో బలహీనత ఆవరించింది. ఆపై కృష్ణుని కాళీయుని పడగలపై నిల్చున్నాడు.

03/05/2018 - 02:05

నేటి యుగంలో ఒకర్ని చూసి మరొకరు అందని ‘ద్రాక్ష’ కోసం ఎగురుతూ, ఇంకా సాధ్యం కాకుంటే నైతిక విలువలను కాలరాసి, తమ పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. ఈ ‘పరుగు’ ధర్మానికి విరుద్ధమన్న విషయాన్ని పక్కన పెడుతున్నారు. దీనివల్లనే జీవితానికి తెలియని ‘అసంతృప్తి’ అనే ముప్పు పుట్టుకొస్తుంది.చికాకులు పరాకులు వస్తున్నాయ. ఒకరంటే మరొకరికి కోపం, పరిస్థితుల పట్ల అసహనం ఎక్కువ అవుతున్నాయ.

03/05/2018 - 02:03

నేను చెప్పేది 55 సంవత్సరాల క్రితం నాటి సంగతి. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాక, లేకలేక ఆ ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి లక్ష్మి సరోజిని అనే పేరు పెట్టుకున్నారు. ఎంతో గారాభంగా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. చదువంటే అమితమైన ఇష్టం ఉన్న ఆ తల్లిదండ్రులకి ఆ పాపకు చదువు నేర్పించాలని అనుకొని స్కూల్లో వేశారు. అప్పట్లో ఐదవ తరగతి వరకే చాలా ఎక్కువమంది చదువుకునేవారు.

03/05/2018 - 02:00

బయాలజీ క్లాస్‌లో టీచర్ మానవదేహం మీనియేచర్ మోడల్‌ని చూపించి చెప్పాడు.
‘‘ఇది గుండె. గుప్పెడు ఉండే ఇది రోజుకి ఏడువేల లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తూ శుద్ధి చేస్తుందని తెలుసా?’’
మిగతా విద్యార్థులతో పాటు భాస్వంత్ కూడా దానివైపు ఆశ్యర్యంగా చూసి చెప్పాడు.
‘‘వావ్. మా కార్లో ఓసారి నలభై రెండు లీటర్లే పడుతుంది!’’

03/05/2018 - 01:54

మనిషి ఎదుట తీపి మాటలు మాట్లాడి
వెనుక జేరి కీడు వెదుకుచుంద్రు
చాపకింద నీరు చందము కొందరు
దివ్య సుగుణ బాల ధీవిశాల!

సారహీనమైన చదువు చదువుకాదు
అడుసులోన కవియు అత్తరునది
జ్ఞానహీనమైన జన్మంబు వ్యర్థము
దివ్య సుగుణ బాల ధీవిశాల!

Pages