S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/23/2018 - 20:10

రాస్తేనే కవిత్వమా
మరి..
మెదడు జీర్ణించుకోలేని
సందర్భాలలో వేదన వినే దిక్కెవరు?
మెచ్చుకోలును ఒప్పుకోని ఈగో
సన్మాన పీఠమెక్కడానికి
తయారవుతోంది రేపటి లోగో
తేనె పొగడ్తల మాటల వెనక
విషపూరిత సమాలోచనలు
గుండెకు అర్థమవుతూనే ఉంటాయ్
ప్రతిభను ప్రోత్సహించే పెద్ద మనుషులు
గద్దలకూ తెలుసు ఆహారాన్ని
ఎలా పట్టుకోవాలో

08/22/2018 - 19:48

ఎన్ని చదువులు చదివినా
ఏమి లాభం?
మానవత్వం పరిమళించనపుడు
మానవత్వమే మనిషిలోని దైవత్వం

నేటి ‘నీటి’ వృథా
భావితరాలకు
కన్నీటి వ్యథ

‘అమృతం’ సురలకు
పంచాడు విష్ణువు
‘అమ్మ’ను మానవాళికి
ప్రసాదించాడు బ్రహ్మ
గర్భగుడిలో దేవుడు
భక్తులు కోరేది దైవదర్శనం
హుండీ నిండాలని గుడి ధర్మకర్తలు
కోర్కెలు పండాలని భక్తజనం

08/21/2018 - 19:08

ఒక ఆత్మీయ పలకరింపు
బరువెక్కిన గుండెను
తేలికపరచగలదు.

చేరువైన ఒక బంధం
ఒంటరితనాన్ని
దూరం చేయగలదు.

ఒక ఆశావహ దృక్పథం
నైరాశ్యాన్ని తొలగించి
ఉత్సాహాన్ని నింపగలదు.

ఒక ప్రేమాస్పద వైఖరి
వైరి భావాన్ని హరించి
స్నేహతత్వాన్ని పెంపొందించగలదు.

ఒక విస్పష్ట ఆలోచనా ధోరణి
శూన్యాన్ని పోగొట్టి
కార్యశీలత నందించగలదు.

08/20/2018 - 20:42

ఇసుక తినె్నలు
నా భారాన్ని మోయలేక
పాదముద్రల సొట్టలు పడుతూ
పశ్చిమ తీరానికి నన్ను ఆహ్వానిస్తున్న
శుభ సాయం సంధ్యవేళ..
ఎదురుగా నా ఆయుష్షుకు
ప్రతిరూపంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు
ఏదో చల్లని చెమరింపు స్పర్శ
నా అరిపాదాల క్రింద...
అణువణువూ విస్తరిస్తూ
పైకి పాకుతున్న అనుభూతి...
అస్థిత్వపు చలనాన్ని కలుగజేస్తూ చిన్న కదలిక..

08/17/2018 - 18:44

పురివిప్పిన చిరుజ్ఞాపకం
మనసు పొరల్ని-
ఆర్ద్రంగా తడిమినా-
తిరిగి రాని ఆ వసంతం
కలలా కరిగిపోయింది!
నవ్వుల నావలా సాగిపోయిన
యవ్వన జవ్వని - నేడు
జవసత్త్వాలు కోల్పోయి
మోహనరాగాలు పలికించలేక
మోడువారిన తరువులా మిగిలాయి!
సుమధుర సరాగాలను
శృతిచేసిన వలపు వీణ
కాలాన్ని జయించలేక
కన్నీటి పర్యంతమై మిగిలింది!

08/15/2018 - 21:13

నన్ను రాసే ప్రతి మనిషి
తన స్వగతాన్ని తప్ప నా మనోగతాన్ని
పట్టించుకోరెందుకు
అక్షరాలని దండగా కూర్చి
అందమైన అలంకారమై నిలిచినప్పుడు
వాసనలేని పువ్వులా
చెరిపి వేయబడతాను..
కవితనో, పాటగానో రూపుదిద్దుకునే
క్రమంలో ఎన్ని గాయాలో
ఎగ్గొట్టి దిగ్గొట్టి ముక్కలుగా చేసినా
అర్థంపర్థంలేని వ్యాకరణాల
సమూహంలో
నేను బిక్కుబిక్కుమంటూ

08/13/2018 - 19:46

నా చేతి వేళ్లు పట్టుకున్న
ఉదయంలా నవ్వుతూ
కాస్తంత ముందుకి
ఇల్లు పిల్లాడి అల్లరితో ఊగుతుంది.

తెరచిన కిటికీ అరల్లోంచి
చేతులు చాచుకు ఎగిరే గాలికి
గోడకి వేలాడే క్యాలెండర్లు
ఎగిరి ఎగిరి నవ్వుకుంటున్నాయి.

మూసిన హృదయాల్ని తెరిచే తలుపులు
కొద్దికొద్దిగా వీధి దృశ్యాల్ని
కూరగాయల బండిగానో నడిచిపోయే బాధ్యతలగానో
ఒంపుతున్నాయి.

08/10/2018 - 18:56

సద్యోగాలు ఎప్పుడోగానీ రావు
సమయానికి మేల్కొని
విమలంగా ఆలోచించి
సమరంలా యత్నించాలి
అనుక్షణం అప్రమత్తమై
అనుదినం తదేకచిత్తమై
ఎదురుచూడాలి శుభ సమయం కోసం!
ఉద్యమంతో ఉద్భవించి
కృషితో ఉజ్జ్వలించి
సాధనలో ఫలిస్తుంది
అదృష్ట కల్పవృక్షం!
ఆ వృక్షం అడిగిందల్లా ఇస్తుంది!
ఆజీవనాంతం సిరులతో వనె్న తెస్తుంది!!
*

08/07/2018 - 19:15

ఓటమిని ప్రేమిస్తున్నా
నన్ను గెలిపించాలని చూడకండి
ఇప్పుడు ఓటమి నా శ్వాస
తన నుండి దూరమై ఒక్క నిమిషం కూడ
బతకలేని నిస్సహాయ స్థితి నాది
ఓటమిప్పుడు నా ప్రాణంలో ప్రాణం
గెలుపు కోసం వేసిన అడుగుల మడుగుల్లో
అడుగడుగునా ఓటమి ఓదార్చింది
అందినట్టే అంది చేజారిన గెలుపు రాపిడిలో
వరుసుకుపోయిన గాయాల సలపరింతలపై
ఏదో మాయాలేపనం పూసి

08/03/2018 - 19:31

ఎందుకైనా మంచిది
ఎందరిలో నువ్వున్నా
నవ్వులెన్ని పూయిస్తున్నా
అభద్రతలో పడిపోవడం
కాదు కాని.. నువ్వొక్కడివే
నిజంగా నువ్వొక్కడివే

ఎందరు నిన్ను ఎన్ని విధాలుగా
పొగడ్తల్లో ముంచెత్తినా
అందుకు కారణాలు
ఏవైనా.. ఎన్నున్నా
అపనమ్మకం కాదు కాని
పొగడ్తని నిజమనుకునే
అమాయకత్వం
పొందేదేమిటని..?

Pages