S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/20/2019 - 22:51

(అగస్త్యుడు స్ర్తి గర్భము నుంచి జన్మించలేదు) అగస్త్యుడు అన్నిటికంటే ఎక్కువ ప్రకాశవంతంగా వెలిగే నక్షత్రము అని పురాణాలలో చెప్పబడింది. ఆయన సహధర్మచారిణి లోపాముద్ర; బృహస్పతిః=బృహస్పతి ; సురాచార్యః= సు+ ఆచార్య= దేవతలు +గురువు= దేవతల గురువు, బృహస్పతి; గీష్పతి= జ్ఞానవంతుడు, బృహస్పతి; ధీషణః= తెలివిగలవాడు, బృహస్పతి గురుః = దేవతలకు గురువు, జీవః=బృహస్పతి;

11/20/2019 - 22:50

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి
సర్వపాపహరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే
ఎవరైతే గరుత్మంతుని అధిరోహిస్తారో ఎవరైతే కోలాసురుడు అనే రాక్షసుని సంహరించి (కోలాసురుడు అనే రాక్షసుని చంపుట వలన ఆ పట్టణము కొల్హాపూర్ గా పేరుగాంచి 18 శక్తి పీఠములలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది) భయంకరిగా పేరుగాంచుతారో ఎవరైతేసర్వ పాపములను హరింప చేస్తారో ఆ మహాలక్ష్మికి ప్రణమిల్లుతున్నాను.

11/20/2019 - 22:43

తే.గీ: పెద్దవారినిఁ బ్రశ్నించు విధముదప్పు
ముప్పుఁగొనిదెచ్చు నా తప్పు మూడు మూర్తు
లకట! సైపరు కనుగొన లక్షయేల?
చూడుమో కర్మసాక్షి! ఓ సూర్యదేవ!

11/19/2019 - 22:56

శీతం గుణే తత్వదర్థా సుషీమః శిశిరో జడః
తుషారః శీతలః శీతో హిమః సప్తాన్యాలింగకా

11/19/2019 - 22:55

* నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖ చక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే

భావం: ఎవరైతే దేవతలచే పూజింపబడుతున్నారో ఎవరైతే శ్రీపీఠంలో అమ్మవారు నివసించే స్థానం నివసిస్తున్నారో, ఎవరైతే శంఖం, చక్రం, గద చేతులలో కలిగి ఉంటారో ఆ శక్తి మహాలక్ష్మికి ప్రణమిల్లుతున్నాను.

11/19/2019 - 22:55

భక్తులలో చాలారకాల ఉంటారు. వారిలో ఎక్కువగా అర్థార్థులు ఉంటారు. అసలు అర్థార్థి అంటే అర్థం. ఏదో ఒక కోరిక అది సాధారణంగా భౌతికమైన సుఖాలకోసమే ఉంటుంది అంటే ధనం. ధనం కావాలి, అధికారం కావాలి, ఇంకా అనేక విధములైన సుఖ, సంతోషాలు కావాలని కోరుకుంటారు. శీలమే సదాచారము, జ్ఞానమే ఐశ్వర్యము. సదాచారమే సంపద- ఇవే నిజమైన ధనము, ఐశ్వర్యము, సంపద.

11/19/2019 - 22:49

తే.గీ. విద్య నేర్వంగ సరిపోదు వెలుగులీను
మేటి సంస్కార వంతులై మెలగవలయు
నదియు లేనట్టినరులు హీనతనుఁ గాంచుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

11/18/2019 - 23:17

హిమామ్శుశ్చంద్ర మా శ్చంద్ర ఇందుః కుముదబాన్దవః
విధుః సుధాంశుః శుభ్రాంషురోషధీషో నిశాపతిః
అబ్జో జైవాతృకః సోమో గ్లౌర్ముఖాఙ్గః
ద్విజరాజః శశధరో నక్షత్రేశః క్షపాకరః

11/18/2019 - 23:15

* రామస్కందం హనుమంతమ్ వైనతేయమ్ వృకోదరం
శయనేయ స్మరణే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి
భావం: హనుమంతుడు రామునికి కుడిభుజం, గరుడుడు విష్ణువు వాహనం, నక్క పొట్ట, (వృక= నక్క, ఉదరం = పొట్ట) లాగా ఉండేవాడు భీముడు. వీరు ముగ్గురిని ధైర్యవంతులుగా, బలవంతులుగా పరగణిస్తారు. అందువలన రాత్రి పడుకునే ముందు ఈ శ్లోకం చదువుకుంటే పీడకలలు రావు. ఈ శ్లోకం గజేంద్రమోక్షం లోనిది.

11/18/2019 - 23:15

ఈ రోజు ప్రపంచంలో అన్ని అనర్థాలకూ ముఖ్యకారణం ఏమిటి? అసూయ! పక్కవాడు పచ్చగా ఉంటే చూసి ఓర్చలేడు. అవతలివాడు ఆనందంగా ఉంటే అది చూసి సహించలేడు. ఇంకొకరిని నలుగురూ మెచ్చుకుంటే విని భరించలేడు. ఏదో ఒక రకంగా వాడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తాడు. ఇదీ లోకం రీతిగా కలియుగంలో మారిపోయంది. అందుకే ఎక్కడ చూసినా అమానుషాలు, అక్రమాలు, అసహజ మరణాలు సంభవిస్తు న్నాయ. అంతేకాక అసహనం చాలామందిలో ఎక్కువ అయంది.

Pages