S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

08/21/2019 - 18:58

కాలు జారినా ఫర్వాలేదు కానీ నోరు జారితే మళ్లీ తీసుకోలేమని విజ్ఞులు చెబుతారు. నిజమే. ఈమాట ఏకాలానికైనా అవసరమే. తొందరపడి ఒక మాట ఎదురువారు బలహీనులుగా ఉన్నారనో, మనకన్నా తక్కువగా ఉన్నారనో అనేస్తే సంపదలు, హోదాలు ఇవన్నీ కాలచక్రంతోపాటు తిరుగుతుంటాయి. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. అట్లాంటివాటిని చూసుకొని ఇతరులను అవమానించడం తగదని మహాభారతం కూడా చెబుతుంది.

08/20/2019 - 19:24

పరిక్రమంటే ప్రదక్షిణం. భగవంతుని చుట్టూ ప్రదక్షిణం చేయడం యుగాలుగా జరుగుతున్నది. ప్రదక్షిణ చేయడంవల్ల సత్ఫలితాలు ప్రాప్తిస్తున్నాయని పురాణాలలో ఉంది.

08/19/2019 - 19:15

మధురమైంది. మహనీయమైంది కీర్తిచంద్రికలను అందించేది. కడవరకు సాగేది ఏది అని అడిగితే స్నేహం అని అందరూ ఏకీభవిస్తారు. స్నేహానికి అధికము అల్పము అన్న తేడా ఉండదు. గొప్ప బీద అనే తారతమ్యాలు కూడా ఉండవు.రాజు కొడుకుకు, బిచ్చగాని కొడుకుకూ స్నేహం కుదురుతుంది. స్నేహంలో పేద ధనిక అనే భేదాలే కాదు పండితునికి పామరునికి కూడా అత్యంత సన్నిహితమైన స్నేహం ఉండచ్చు. వారిద్దరూ ఒకరికొకరు గొప్పమేలును కూడా చేసుకోవచ్చు.

08/13/2019 - 19:46

అగస్త్యుడు మలయధ్వజుని కుమార్తె వల్ల దృఢచ్యుతుడ నే పుత్రుడిని కన్నాడు. ఆ దృఢచ్యుతుడు కూడా పెద్దవాడై వివాహం చేసుకొని ఇధ్మవాహుడు అనే కుమారుడిని పొందాడు.

08/12/2019 - 18:48

పురంజనుడు డస్సిపోయేదాకా కోమలి కోపాన్ని నటించి ఇక కాళ్లను పట్టుకొని తనను క్షమించమని కోరుకుంటే అపుడు కోపాన్ని తగ్గించుకుని పురంజనునికి కోమలి సంతోషాన్ని కలిగించింది. ఆమె చిరునవ్వే తనకు పదివేల రెట్ల బలాన్నిస్తుందని ఎపుడూ చిరునవ్వుతోనే ఉండమని తనని సేవకునిగా భావించిమని మరీ మరీ కోమలితో చెప్పాడు.

08/11/2019 - 19:29

ఒకనాడు పురంజనునికి వేటకువెళ్లాలనే కోరిక పుట్టింది. వెంటనే కవచము ధరించాడు. బాణాలను అమ్ముల పొదిని పట్టుకొని రాణిని విడిచి వేటకు వెళ్లాడు. వేటాడుతూ వెళ్లి వెళ్లి దారిలో ఉన్న సెలయేరులో స్నానం చేశాడు. మంచి గంధాన్ని అలుదుకున్నాడు. తిరిగి బాణాలు పట్టుకొని వేట ప్రారంభించాడు.

08/08/2019 - 19:59

పురంజనుడికీ కోమలి ఇద్దరూ ఆనందంగా కాలం గడుపుతున్నారు. కోమలి పురానికి ఇప్పుడు పురంజనుడే రాజు అయ్యాడు. ఆయనకు తోడుగా అక్కడ ఉండే వారు సహాయపడడానికి కోమలి ఆజ్ఞతో ముందుకు వచ్చారు.

08/07/2019 - 19:50

కనుక నేను ముందు పలుకరిస్తాను2 ఇలా మనసున అనుకొని నాలుగు అడుగులు వేసి ఆ కోమలి కంట్లో పడేట్లుగా పురంజనుడు నిల్చున్నాడు.
3కోమలీ మీరు దేనికోసమో వెతుకుతున్నట్టు ఉన్నారు. నేను మీకేమైనా సహాయం చేయగలనా2అన్నాడు పురంజనుడు.

08/06/2019 - 20:50

3పురంజనా నీవు ఎంత చెప్పినా వినడంలేదు. కానీ ఆత్మ అన్నదే నిత్యం కానీ మరేదే ఈలోకంలో నిత్యం కాదు.2 అన్నాడు అవిజాతుడు.

08/05/2019 - 18:06

రామునితో పాటు సీత, లక్ష్మణులు కూడా వనవాసానికి బయలుదేరి వెళ్లారు.్భరతుడు కూడా అన్న వనవాసం పూర్తి చేసుకొని వచ్చేవరకు తాను దీక్ష వహించి రామపాదుకలకు పట్ట్భాషేకం చేసి రాజ్యాన్ని రాముని బంటుగా పాలించాడు.

Pages