S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/20/2018 - 19:05

నేడు భార్యాభర్తలిద్దరూ సంపాదనా పరులు. కాలంతో పాటు పరుగులెత్తేవారే. వీరికి పిల్లలు జత అయితే వీరితో పాటు వారు పరుగులెత్తాల్సిందే,.. కాలంతో పోటీపడుతూ ఉద్యోగాలు, ఇంట్లో పనులు అన్నీ చేసుకుని వెళ్లే మహిళల్లో చాలామంది తమ తమ భాగస్వాములతో గొడవలు పడుతున్నారు. ఇలా భార్యాభర్తలు గొడవలు పడుతుంటే వారి మధ్య పిల్లలు నలిగిపోతున్నారు.

07/19/2018 - 19:31

మహిళలు చేయలేని పని ఏదీ ఉండదు. అది ఇంట్లో కావచ్చు. వీధిలోకావచ్చు. ఆఫీసులో కావచ్చు. ఎక్కడైనా సరే మనసు పెట్టి కూర్చున్నదంటే చాలు ఆ పని పూర్తికావలసిందే. ఆఫలితం నలుగురికీ పంచాల్సిందే. ఆదిపరాశక్తిగా అభివర్ణించారంటే అర్థం ఇదేనన్నమాట. తలుచుకొంటే దైన్నైనా చేస్తారు. ఏ పనికీ వెనుకాడే సమస్యే లేదు. అన్నీ కలుషితమైన ఈ ప్రపంచంలో తిండి గురించి చెప్పనవసరం లేదు.

07/18/2018 - 19:49

గోరింట పూచింది కొమ్మలేకుండా అనే పాట అందరి మనసులను దోచినట్లే గోరింటాకు అరచేతుల్లో పూయించడం అనాదిగా వస్తున్నదే. రామాయణ కాలంలోకూడా సీతమ్మకు చేసిన అనేకానేక వేడుకల్లో గోరింటాకు ప్రత్యేకతను తులసీదాసు అందంగా సుందరంగారచించి ఉన్నారు. సరస సల్లాపాలలో కూడా గోరింట తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది.

07/17/2018 - 19:17

సేవ చేయాలని చిన్నప్పుడే కలుగాలి. బై బర్త్ వచ్చిందండీ అంటుంటారు కదా. అలా దానం చేయడం కాని, ఒకరికి సాయం చేయడం కానీ చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి. లేకుంటే పెద్దైన తరువాత డబ్బులు సంపాదించేటపుడు చెబుదాం లే అంటే అపుడు పైసా కూడా ఇతరులకు ఇవ్వబుద్ధి కాదు. ఎందుకంటే అంతా తనది నాది నాది అనే తత్త్వం పెరుగుతుంది.

07/16/2018 - 19:28

వేసవి సెలవుల తర్వాత విద్యాలయాలన్నీ మళ్లీ తలుపులు తెరచుకున్నాయి. సాధారణంగా తమ తమ ఇండ్లల్లో పూజలు చేయటంలోను, ఎక్కడ ఏ పూజలు జరిగినా అత్యంత శ్రద్ధగా అందులో పాల్గొనటంలోనూ స్ర్తిలు ముందుంటారు. అలాగే విద్యాలయాల్లో జరిగే పూజ- అదే విద్యార్జన అనే పూజలోనూ యువతులందరూ ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.

07/15/2018 - 22:39

పుత్రుడు పుట్టినప్పుడు కలిగేది పుత్రోత్సాహం కాదు. ఆ పుత్రుడ్ని లోకం కనుగొని పొగడుతుంటే అపుడు నిజమైన పుత్రోత్సాహం వస్తుంది అని వేమన చెప్పాడు. ఇక్కడ పుత్రుడు అంటే కేవలం మగపిల్లవాడు అనేక ఆదు ఆడపిల్ల అని కూడా అనుకోవచ్చు. తను కన్నబిడ్డను లోకం అంతా పొగడుతుంటే ఆ తల్లికి కావాల్సింది ఏముంటుంది? లోకాన్ని తను గెలిచినంత సంతోషపడిపోతుంటుంది.

07/13/2018 - 19:50

మన సంగతి మనమే చూసుకోవాలి...
నిద్ర లేచింది మొదలుకొని ఇల్లు క్లీన్‌గా పెట్టడం, వంట చేయడం, పిల్లల్ను రెడీ చేయడం వారిని స్కూల్స్ , కాలేజ్స్‌కు పంపడం, భర్త ఆఫీసుకు రెడీ అవడంలో సహాయం చేయడం, అందరికీ టిఫిన్ బాక్స్ సర్దడం, ఇంట్లో ఉన్నవారికి కావాల్సిన సదుపాయాలు అమర్చడం, చివరకు తాను రెడీ అయి ఆఫీసుకు వెళ్లడం .. ఇలాంటి వన్నీ సహజంగా అందరి ఇండ్లల్లో జరుగుతున్నవే.

07/12/2018 - 20:06

నేడు ఆధునిక టెక్నాలజీ పెరిగింది.అరచేతిలోనే వైకుంఠం అన్నట్టు ప్రపంచంలోని నలుమూలల్లో జరిగే వింతలు విశేషాలు తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ అరుదైన విషయం ఉన్నా తెలుసుకోవచ్చు. వస్తువున్నా క్షణాల్లో దాన్ని మన ముంగిట పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెరిగిన సాంకేతిక విజ్ఞానం వల్లే జరుగుతున్నాయి.

07/11/2018 - 20:30

ఒక యంత్రంలోని ముఖ్యభాగాలన్నీ అవి చేయవలసిన పనులను సక్రమంగా చేస్తేనే ఆ యంత్రం ఉత్పత్తి చేయవలసిన వస్తువులు అందంగా సమర్థవంతంగా ఉంటాయి. కుటుంబం కూడా ఒక విలువైన యంత్రమే. భార్య, భర్త, కొడుకులు, కూతుళ్లు అందులోని ముఖ్యభాగాలు. ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహిస్తే ఆయంత్రం బాగా పనిచేసి సుఖ సంతోషాలనేవి పుష్కలంగా ఉత్పత్తి అవుతాయి.

07/10/2018 - 20:47

ఎక్కడైనా సర్దుబాటు తప్పనిసరి. అది ఉద్యోగంలోనైనా, ఇంట్లోనైనా, తల్లిదండ్రుల దగ్గర నుంచి జీవిత భాగస్వామి దాకా ఏదో ఒక విషయంలో సర్దుబాటు ఉంటేనే జీవన క్రమం మెల్లగా సాగుతుంది. లేకుంటే ప్రతిరోజు గొడవలు మొదలు. గొడవలు, కొట్లాట వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంది. దానితో లేనిపోనీ రోగాలు అంటుకుంటాయి. ఎదురు వాళ్లు ఏమనుకొంటారో అని ఒకటే ఆలోచనతో చేసే పనిపైన శ్రద్ధ తగ్గుతుంది.

Pages