S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/14/2016 - 21:55

దేశం నాకేమి ఇచ్చింది అని కాదు, దేశానికి నేను ఏమి చేశానని ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఉగ్రవాదుల దాడులతో అతలాకుతలమైపోతున్న వేళ దేశ రక్షణకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు ఆధునిక మహిళలు. సైన్యం పనిచేస్తూ అసువులు బాసిన తమ భర్తల బాటలోనే నడిచేందుకు భార్యలు సిద్ధమవుతున్నారు.

07/14/2016 - 21:52

ప్రేమ అత్యంత మానవీయమైన అంశం. ప్రేమించే మనిషి ఎంతో దయగలవారై ఉండాలి. ప్రేమించడం, ప్రేమతో వ్యవహరించడం ఒక జీవనశైలి. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, అదొక జీవన విధానం. ప్రేమను ఈ దృష్టితో చూసినపుడు ప్రేమించే మనిషి ఎలా ఉండాలో అర్థం చేసుకోవడం తేలిక.

07/13/2016 - 21:01

సిగ్గు బిడియం ఏదో ఒక సందర్భంలో అందరికీ అనుభవంలోకి వచ్చేవే. కాని నిరంతరం అలాగే వుండటం కొందరిలో కనిపిస్తుంది. ఇది వారి జీవితాలను వృత్తిపరంగా, సామాజికంగా, కుటుంబ పరంగా తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుంది. బిడియం పోకొట్టుకోవడానికి అలాంటివారు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. దీన్ని సరిచేయడం ఎలా.. అసలు ఈ బిడియం ఎందుకు కలుగుతుంది? ఒంటరిగా గడపాలనుకోవడం ఎందుకు? అసలది నిజంగా ఓ సమస్యేనా?

07/12/2016 - 22:30

కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సమస్యలను సహనంతో ఎదుర్కొంటే ఈ విశాల విశ్వంలో సాధించలేనిదంటూ ఏమి ఉండదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా ఆదివాసి బాలిక నీలూ కుమారిని చెప్పుకోవచ్చు. మావోయిస్టుల ప్రభావిత రాష్టమ్రైన జార్ఖండ్‌లో ఉన్న వేలాది గ్రామాలలో ‘కర్మటండ్’ ఒకటి. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ రికార్డులలో తప్ప ఈ గ్రామం పేరు ఎవరికీ తెలియదు.

07/07/2016 - 22:00

అతిథులంటే ఈనాడు భయపడతారు. మన ఇంటికి బందువులొస్తున్నారో లేక అతిథులొస్తున్నారో తెలిస్తే కొందరు భయపడతారు. ఏమో.. ఎన్ని రోజులు తిష్టవేస్తారో.. చాలీ చాలని సంసారం.. ఖర్చులు. సామాన్యుల ఇంట వినిపించే సమస్యలు ఇవి అయితే, ఇలా భయపడడం సహజమే కానీ అతిథులు కూడా కాస్త గౌరవంగా మెలగాలి. మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం మన తెలుగింటి సాంప్రదాయం అని మరచిపోకండి.

07/06/2016 - 23:34

ఇది ముస్లిం మహిళలకు శుభవార్తే. మసీదుల్లోకి మహిళలకు ప్రవేశం లేదు. కాని తొలిసారి లక్నోలోని అషిబాగ్ ఈద్గ్‌లో గురువారంనాడు ముస్లిం మహిళలు నమాజ్ చేయనున్నారు. ఇది ఓవిధంగా ముందడుగే అయినప్పటికీ, మహిళలను ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్ బాక్స్‌లో కూర్చోబెట్టి నమాజ్ చేయించేందుకు ఏర్పాట్లు చేయటం పట్ల స్ర్తివాదులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

07/05/2016 - 21:15

మెరుపు మెరిస్తే, వాన కురిస్తే మా కోసమే అనుకునే పిల్లల ఆనందం వానలో తడిసిముద్దయిన వేళలో ఇంద్రధనస్సులా మనసు వికసిస్తుంది. ఆ తరవాత అనారోగ్యం పాలవుతారు. చిన్నారులకు నీళ్లతో ఆడడం అన్నా, వర్షంలో తడవడం అన్నా మహా సరదా. వారిని కట్టడి చేయడం అనుకున్నంత ఈజీ కాదనే చెప్పాలి. కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరి.

07/01/2016 - 21:14

అవిటివాడినైతేనేమి తోడు గా తమ్ముడు ఉన్నాడు కదా! ఎలాంటి విజయాన్నై నా సొం తం చేసుకుంటానంటున్నాడు కృష్ణకుమార్ పండిట్. అవిటితనం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా...పేదరికంతో పస్తులుండాల్సినా...పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఒకరికిఒకరు ఆలంబనగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు ఈ సోదరులు. ఇద్దరూ ఐఐటిలో ర్యాంకులు సాధించి ఇంజినీరింగ్ చదువుతున్నారు.

06/30/2016 - 21:57

పుట్టిన ప్రతి బిడ్డ తల్లిపాలు తాగితే, వారి పెరుగుదల ఆరోగ్యవంతంగా వుంటుంది. అందువల్లనే, ప్రభుత్వం తల్లిపాలు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియచెప్పేందుకు ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్న విషయం సర్వవిదితమే. కొందరు తల్లులకు పాలు ఉండవు. అందువలన వారి పిల్లలకు తప్పనిసరిగా గేదె లేదా డబ్బా పాలు పట్టించాల్సి వస్తున్నది.

06/30/2016 - 21:56

మనం మనకే విలువలని ఆపాదించుకుంటున్నాం. ఎదుటి మనుషులకి, వస్తువులకి, ఆఖరికి కాలానికి కూడా విలువనివ్వడంలేదు. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా దేనికీ విలువ తగ్గదు. దానివల్ల నష్టపోయేది మనమే!

Pages