S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/01/2018 - 22:34

రెండు కళ్లకింద
పూర్ణం బూరెలపై
చల్లని పిల్లవాయువులతో కలసి
మల్లెపూవు విచ్చుకున్నట్టు
సంపూర్ణమైన నవ్వు
కమ్మనైన నవ్వు
మంచి చెడ్డ మనుష్యుల సహజీవనంలో
వారిని దాటుకుంటూ పోవడానికీ నవ్వు
సాయంత్రం వచ్చి
విశ్రాంతి తీసుకొనే నేపధ్యంలో
ఏవో స్మరణల్లో దగ్గర లేని వారి గురించి
బాధదాచుకునే నవ్వు
అందరినీ వదిలించుకుని అమ్మ అండలో

06/01/2018 - 22:29

వస్తున్నవి.. ఎలక్షన్లు వస్తున్నవి..
నేతలు ఇంటింటికి తిరుగుతారు

మాటలో మాట్లు కలుపుతారు
చేతిలో చెయ్యేసి బాస చేపిస్తరు

ఓడ దిగినాక
బోడి మల్లయ్యన్నట్లు
గెలిచినాక మన
పొలిమేర తొక్కరు
పస్తుండి పలుమార్లు తిరిగిన
ఉలుకరు పలుకరు

మన నేత లరాతలను మార్చే
ఓటును కాపాడుకో
మనలను ఆదుకునే వారికే
వెద్దాము ఓటు!

05/31/2018 - 22:00

సాయం అనే మాట
మాయమైపోయింది..

మనిషికి మనిషికి ‘సాయం’
ఈ మాట విని ఎన్నిరోజులవుతుందో..
కాకులలో, కోతులలో ఉన్న కలయిక
మనిషిలో మాయం
అయిపోయింది..

05/31/2018 - 21:44

1. మనం తీసుకునే ఆహారంలో హెచ్చ్భుగం పండ్లు తీసుకోవాలి.పచ్చి కాయగూరలు కూడా అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ వుంటాయి.
2. పంచదారకన్నా తేనెను తీపిదనం కోసం వాడవచ్చు. లేదా బెల్లం వాడకం కూడా మంచిదే.

05/30/2018 - 23:38

ఆడజనే్మ పాపమైంది
అందమే శాపమైంది
ప్రకృతి జీవం ఆడతనమే
సృష్టికి ప్రతిసృష్టి ఆడతనమే
ఆమె ఓ తల్లి!
ఆమె ఓ చెల్లి!
చిరుప్రాయంలో ఓ చిట్టతల్లి
ఆటలాడుతూ రోడ్డెక్కింది
కాటువేసే కాలనాగు
‘చాక్లెట్’ ఆశ చూపింది
లోకం పోకడ తెలియని
ఈ రంగుల ప్రపంచం ఎరుగని
చిట్టితల్లి ఆశతో వెంట నడిచింది
కామం కత్తి దూసింది

05/29/2018 - 22:16

మానవత్వానికి మరో రూపం
దైవానికి ప్రతిరూపం
తన వారి కోసం నిత్యం హారతి కర్పూరమై
కుటుంబానికి వెలుగు దివ్వై
స్వచ్ఛమైన అనురాగామందించే
ఆమె ప్రేమ ఆకాశమంత ఎత్తు
ఏ కల్మషం లేని ఆమె ప్రేమ
సముద్రమంత లోతు
తన బిడ్డల భవిష్యత్తుకోసం
నిత్యం శ్రమించే శ్రామికురాలు
ప్రతిఫలం ఆశించని ప్రేమను పంచి
నిస్వార్థసేవతో పిల్లలను తీర్చిదిద్దే

05/29/2018 - 22:13

శాకాహారులు ఆకుకూరలు, కూరగాయలపైనే ఆధార పడకుండా తగిన పోషకాలు అందించే గింజలు, పాల ఉత్పత్తులు, పండ్లను విరివిగా వాడుతుండాలి. బాదం, వేరుశనగ, బఠానీలు తీసుకుంటే శరీరానికి కావల్సిన పీచు పదార్థాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు అందుతాయి. పాల ఉత్పత్తులను తీసుకుంటే కాల్షియం, విటమిన్-డి లభిస్తాయి. బీన్స్, చిక్కుడులో ఖనిజాలు, విటమిన్లు, పీచు పుష్కలంగా ఉంటాయి.

05/28/2018 - 22:12

కన్ను మిన్ను కానక
కౌగిళ్ళలో మునిగిన మీకు
కడుపులో నలుసుపడగానే
స్కానింగు సెంటర్ల వెంట
పరుగెడుతారు..

కడుపులో నలుసుకు
ఆకృతి రాకముందే
కన్నమ్మ అని
కడుపులోనే గొంతు నులిమేస్తారు
కాదని కంటే
కన్న తండ్రి కూడా కానివాడై పోతాడు

05/27/2018 - 22:17

పారే సెలయేరు...
వీచే చల లగాలి.....
స్పర్శించే పచ్చాపచ్చని గడ్డి .....
వీటనన్నింటిని వదిలేసి
ఎక్కడకు నేస్తమా నీ పయనం.....

వడగాలి సోకుతుందనా?
జడివాన కురుస్తుందనా?
పచ్చపచ్చని పచ్చిక
ఎండిపోతుందనా?
ఎక్కడకు నేస్తమా నీ పయనం....

నాలో నవనవోనే్మషం
ఉన్నంతవరకూ
నీ తోడుంటుందనుకొన్నా.......

05/28/2018 - 00:41

జనారణ్యంలో అన్నీ కాంక్రీటు భవనాలే కనిపిస్తాయి. రోడ్డువైపు చూస్తే అన్నీ భారీ వాహనాలే కనిపిస్తాయి. రోడ్టున నడిచివెళ్లేవాళ్లు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. దగ్గర దారి అయిన సరే బుర్రుమని బండీ తీస్తారు. అలా రోడ్లన్నీ చిన్న పెద్దవాహనాలతో నిండి పోయి ఉంటాయి.

Pages