S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/20/2017 - 20:12

టెక్నాలజీ పెరిగినా.. మెయిల్, వాట్సాప్ మెస్సెజ్‌లు అందుబాటులోకి వచ్చినా.. మనం పంపాలనుకున్న శుభాకాంక్షలు స్వహస్తాలతో పంపుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. హస్తకళలో అతివల నైపుణ్యం వెలకట్టలేనిది. మనకున్న హస్త కళలతో అతి తక్కువ ఖర్చుతో పోస్టు కార్డులను అందంగా ముస్తాబు చేసుకోవచ్చని నిరూపించారు చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పరిమి శ్యామలా రాధాకృష్ణ.

12/15/2017 - 21:02

ఎంత చక్కనిదే నా అందాల జిలుగు కవిత
అబ్బ ఎంతెంత చక్కనిదే నా సుగంధాల చరిత
తెలుగుబంధాల చెక్కుటద్దాలది
వెలుగు కావ్యాల పెక్కుటందాలది
సొగసరి చూపుల ప్రబంధ జాబిలి
తొలకరి వలపుల అక్షర నెచ్చెలి

తాను నా అమ్మనుడి సుమరాగ విరివాటిక
జాను తెలుగు జావళీల నవరాగ సిరిగీతిక
ఆమె శిశిర ఋతుశీతల పవన మందాకిని
వర ఆంధ్రనాట్య విలాసాల కవన శుభాంగిని

12/15/2017 - 20:34

తెలుగు భాష కమ్మదనం నలుదిశలా చాటుదాం
తెలుగులోని అమ్మదనం ఎలుగెత్తి పాడుదాం

12/14/2017 - 20:37

తెలుగు భాష భాషణం
మదినిండా మధురభావ భూషణం
పరభాషీయుల నేర్వకాదు భీషణం
సుర స్వర సవ్వడుల భోషాణం

సరిగమ లయల సంగీత సరాగాల
అజంత భాష తెలుగు
భాషలంద భావ సాగరమై భాసిల్లె
తీయదనాల తేనె తెలుగు

రసరాగాల శబ్ద రవళుల రసధుని
సులభ పల్లవి పలుకుల
మురళిగాన సుశ్రావ్య ధ్వని

12/14/2017 - 20:19

నవరత్నముల వలె ప్రకాశించెను నా తెలుగు అక్షరములు
నలుదిశల నదుల వలె పొంగి పొరలెను నా తెలుగు అలలు

తెలుగువాడి తేట తెలుగు మాటల పలకరింపులు
పసిడికి దిద్దిన మెరుగులే నా తెలుగు అందాలు

నింగిలో ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు
పాల నురగల అలలు నా తెలుగు పదాల సొబగులు

పరిమళ కవన గజమాలలు అద్భుత పదప్రయోగ జతులు
అవని సిగలో విరిసిన విరులు నా తెలుగు అక్షర కుసుమాలు

12/14/2017 - 20:09

ఓహో! వెంకటశాస్ర్తీ సత్కవి కవిత్వోద్యాన వన్యాంగణ
శ్రీహాసన్నవ పారిజాత కుసుమ శ్రేణుల్ గుబాళించునీ
ఊహావీధి కలన్ త్రిలింగ కవిరాజ్ యూధంబు గుర్రాలపై
రాహుత్తుల్ బలె స్వారిచేసెగద ధారారమ్య కావ్యాళితో
మా తెలంగాణ మంతయు రమారమి రెండు శతాబ్దముల్ తమః
ప్రేతము చేతిలో గడచె వెచ్చని యెండయె కాయలె; దదే
దో తెరచాటునన్ గడచె; నుజ్జ్వల కాంతి ఘటా కవాటముల్

12/13/2017 - 19:51

పారిస్ వీధుల్లో కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ షార్జ్‌నెగ్గర్ సైకిలు త్రొక్కుతూ కనబడ్డాడు. జనం అచ్చరువే పొందారు.

12/13/2017 - 19:49

‘పంది బురదమెచ్చు గాని, పన్నీరు మెచ్చునా?’ అంటే ఓకెగాని, కేవలం మెచ్చుకోవడానికేనా? బ్రతుకు? తిండి కావాలి బాబూ! అంచేత జైపూర్‌లో ఓ వరాహ రాజము - కోతితో నేస్తం కట్టింది- నేస్తం కూడా కాదు, బేరం పెట్టుకుంది.. జైపూర్ అంటే రాజస్థాన్‌లోని చారిత్రక నగరం - పింక్‌సిటీ అంటారు.

12/13/2017 - 19:44

నేనో పాటల పిట్టనై
కిటికీ గుండెపై వాలి
ఈ ప్రపంచాన్ని నా రాగంతో వెలిగించనా..
గుండెల్లో బాధను పాడి
నిన్నో తడి నిండిన తనువుగా చేయనా..
పచ్చని చెట్టును ఆలపించి
నిన్ను ఆనందాల ఆభరణంగా మార్చనా..
పాలబుగ్గల నవ్వుల స్వరాలను చిలకరించి
నిన్నో స్నేహపు ఛాయగా మలచనా..
ఉలికులికి పడే లోకానికి
వాడిపోని ధైర్యపు కవచంగా చేయనా..
నేనో పాటల పిట్టనై

12/12/2017 - 17:59

ఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గులు పెడుతున్నాం.

మీ సృజనకు పదునుపెట్టి చక్కగా వేసిన అందమైన ముగ్గులు మాకు పంపండి. చుక్కల వివరాలు రాయడం మరువకండి. చుక్కలు, గీతలు.. ఏ ముగ్గులైనా చూసేందుకు స్పష్టంగా ఉండాలి. పాతవాటిని తిరిగి పంపొద్దు. ముగ్గు వేసిన కాగితం మీద తప్పనిసరిగా మీ చిరునామా రాయండి. ఇష్టమైతే ఫొటో పంపండి. వచ్చిన వాటిలో బాగున్న వాటిని వరుసగా ప్రచురిస్తాం.

చిరునామా:

Pages