S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

03/17/2016 - 07:05

భగవంతుడు సృష్టించిన సకల జీవకోటి రాశుల్లో మానవ జన్మ మహోన్నతమైంది. ఎంతోమంది మహాత్ములు నడయాడిన ఈ పుణ్యభారతావనిలో.. జన్మించడం మనం చేసుకొన్న గొప్ప భాగ్యం. అలాంటి మానవజన్మకు ఓ అర్థం పరమార్థం చేకూరాలంటే.. మన మహాత్ములు చూపిన మంచి మార్గాన పయనించాలి. మనం సృష్టించుకొన్న కుల మత వర్గ వైషమ్యాలను విడనాడి మానవత్వంతో మనుషులుగా జీవించాలి.

03/15/2016 - 22:28

విష్ణురూపాలెన్నో విలసిల్లు జగతిలో అనే నానుడికి ప్రసిద్ధంగా విష్ణుమాయలు అనేకం. శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల్లో ప్రథమమైనది శ్రీమత్స్వావతారము.

03/14/2016 - 00:10

ఫల్గునీ నక్షత్రంలో కలిసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయంచే మాసం ఫాల్గునం. ఫల్గునీ నక్షత్రం ‘పూర్వఫల్గుని’ - ‘పుబ్బ’; ‘ఉత్తరఫల్గుని’- ఉత్తర అని రెండు నక్షత్రాలు ఈ రెండింటిలో దేనితో కలిసి చంద్రుడు ఉదయించినా అది ఫాల్గున మాసమే అవుతుంది.

03/12/2016 - 22:14

నిత్య జీవితంలో మనిషి ఎనె్నన్నో కలలు కంటూ వాటిని నిజం చేసుకునేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుంటాడు. కొందరు కళల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ కళాభిమానులుగా కళాకారులుగా రాణిస్తుంటారు. కలలు నిజమవడమైనా కళల్లో రాణించడమైనా భగవదనుగ్రహం తప్ప మరొకటి కాదంటారు.

03/11/2016 - 23:26

దైవభక్తి చిన్ననాటినుండే అలవడిన ఆధ్యాత్మిక కవయిత్రి, మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ. ఈ మహాభక్తురాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పరమ భక్తురాలు.

03/11/2016 - 00:40

వేదాంత చర్చలు, నీతి నిజాయతీలే ముఖ్యమంటూ చెప్పే కథలు, ఇతిహాసాలు, కావ్యాలు ఎన్నో ఉన్నాయ. అవన్నీ కూడా మనిషికి సేవాదృక్పథం, నీతి, ధైర్యం, మంచి నడవడి, త్యాగగుణం లాంటివి లక్షణాలు ఉండాలని చెబుతుంటాయ. ఓ కథనో, కావ్యాన్నో, ఇతిహాసాన్నో, చరిత్రనో చదివి మనిషి తన నడవడిని మార్చుకుంటాడు అంటే అది సహజమే నని పిస్తుంది. అందుకే పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడని అంటారు.

03/10/2016 - 04:06

శివమయం జగత్. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీలేదు. శివశబ్దమే కల్యాణకారకం అని అర్థం. శివుడు సకల జగాలకు పాలకుడు. దిక్కులనే అంబరాలు ధరించినవాడు. జగమంతటికీ ఆకలి తీర్చే అన్నపూర్ణ సాక్షాత్తు ఆయన ధర్మపత్ని అయినప్పటి ఆయన మాత్రం ఆదిభిక్షువుగా పేరుగాంచాడు.

03/08/2016 - 22:10

శుక్ల యజుర్వేద ప్రవర్తకుడు, శత పథ బ్రాహ్మణాన్ని, వైదిక లౌకిక ధర్లాను జీవం పోసి యాజ్ఞవల్క్య మహాముని రాజగురువుగా ఎన్నో సార్లు వారు ప్రతివాదాలలో సర్వోత్తముడుగా నిలిచి పారితోషకాలందుకొన్న వివేక చూడామణి. చులకనగా చూబడడం ఇష్టం లేక ఒకానొక సందర్భంలో గురుధిక్కారం చేశావన్న ఆరోపణ ఇష్టపడక గురువు ఆజ్ఞమేరకు ఆయన ప్రసాదించిన విద్యలన్నింటిని నిప్పుకణాల రూపంలో వదిలివేసి, ఆశ్రమం విడిచి వెళ్లిన ఆత్మాభిమాని.

03/06/2016 - 22:27

శివ శబ్దం మంగళం, శాంతి, శుభం, క్షేమం ఇలా ఎన్నో అర్థాలనిస్తుంది. క్షీరసాగరాన్ని అమృతోత్పాదనకోసం మథించినపుడు ముందుగా లోకాలన్నీ తల కిందులైయ్యేట్టుగా హాలాహలం పుట్టుకొచ్చింది. ఆ అగ్ని విస్ఫోటనాన్ని చూసి దేవతలు రాక్షసులు గగ్గోలెత్తారు. కాని మహాదేవుడు తానే ముందుకు వచ్చి ఆ హలాహలాన్నంతా తన పుక్కిట పట్టుకున్నారు.

03/06/2016 - 00:19

పినాకపాణి, వృషధ్వజుడు, విశాలాక్షుడు, సదానందుడు, శ్మశానవాసి, శైలధన్వుడు, శశిశేఖరుడు, కపర్ది అంటూ ఎన్ని పేర్లు పిలిచినా అవన్నీ ఒక్క శంకరునికే చెల్లుతాయ. అటువంటి కైలాసవాసునకు వారువీరను తేడాల్లేవు. రాక్షసులు దేవతలు, మనుష్యులు ఎవరైనా ఆయన్ను సేవించేవారే. రాజు-పేద, ఆడ - మగ, పశువు-పక్షి, పాము- చీమ శివుని పూజించేవారే. శివప్రేమను చూరగొంటే చాలు, శివతత్వం అర్థం చేసుకొంటేచాలు మనం శివునిగానే మారిపోవచ్చు.

Pages