S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

08/16/2019 - 19:41

‘‘ఉక్కు కడ్డీలనే వొంచిన మీ బాహుబలం, ఇలలనుంచి తైలాన్ని పిండిన మీ చేతి పుష్టి ముట్టుకుంటే కందిపోయే మా రాణిమీద మోటుగా ప్రయోగించకండి. ఆమె కామశాస్త్ర పారంగతురాలు; రసికురాలు; ఆమె ఆశించే రసికత్వాన్ని ఇవ్వగల పురుషుని మెచ్చుకుంటుంది. కామకళలు కరతలామలకాలు తనకని ప్రియునికి తెలియపరుస్తుంది. పున్నామ నరక బాధనుంచి తనను తప్పించేందుకే రుూ తప్పుదారిన ప్రియుని ఆహ్వానించింది.

08/15/2019 - 21:55

‘‘వెలుగు మన పథకానికి పరమ విరోధి. రాణి శయనాగారంలో కూడా దేదీప్యమానంగా ఉండే వెలుగు ఉండదు. కన్ను కాస్త అలపడితే అంతా స్పష్టంగా కనిపించే వెలుగు మాత్రమే ఉంటుంది!’’
‘‘ఆమెతో మాట్లాడవచ్చునా?’’

08/14/2019 - 19:49

ఒకో కోర్కె తీరేందుకు ఎనె్నన్ని ఎత్తులు! ఎనె్నన్ని వేషాలు! ఎంతెంత నటనలు! ఇంత కష్ట సాధ్యం కనుకనే ఆ అనుభవం కూడా అంత విలువైనదీ, సామాన్యులకు సుదూరాన ఉండేదీ, చాలా సందర్భాలలో అసామాన్యమూ ఐనదిగా ఉండిపోతోంది.

08/13/2019 - 20:01

అందుకని అవేమీ ఉండేందుకు వీలుండదు.. ఏమైనా మీరు వేషం మార్చుకోక తప్పదు..’’
వీరభద్రుడికి అర్థమవలేదు. ‘‘అంటే?’’అన్నాడతను.

08/12/2019 - 19:01

ఉన్నది ఒక్కటే ప్రాణం కనుక మీ సర్వస్వమూ వెలగా చెల్లిస్తున్నారనేది సబబైన మాట కావొచ్చేమో కాని అది చాలా స్వల్పమైన విలువని నేను అంటాను. నేనెందుకు ప్రథమ సమాగమానంతరం మీరే ఆ మాట అంటారని నా నమ్మకం!

08/11/2019 - 20:06

వీరభద్రుని మూతిమీద మీసం పౌరుషాన్ని ప్రదర్శించకపోతుందా అని.

08/09/2019 - 19:37

ఈ ద్వారం దగ్గిర్నుంచి రాణివాసం కొద్ది దూరాన ఉండటం మనకు మరో అనుకూలం! .. రాజుగారు రారని నిర్థారణ చేసుకొని నేను తమకు తెలియపరుస్తాను. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెపుతాను- మీరు సరాసరి రావొచ్చు-’’
వీరభద్రుడికి అంతా కళ్ళకు కట్టినట్లయింది. కత్తెర బోనులాంటి రాణివాసంలోకి వెళ్లి సురక్షితంగా తిరిగిరావటమంటే గరళం మింగి హరించుకోవటం లాంటిది; శవం సజీవమవటంలాటిదేననే అభిప్రాయం ఏర్పడుతోంది.

08/08/2019 - 20:06

కలల్లో జరిపే ప్రణయంలాగు అంతా తనకే సానుకూలంగా వుండి ఊపిరి పీల్చుకునే సావకాశం కూడా లేకుండానే అనుభవం అందుబాటులో ఉంటుందనుకుంటున్నట్లున్నాడు పిచ్చి బ్రాహ్మడు!

08/07/2019 - 20:01

ఎంతో శ్రద్ధతో వీరభద్రుడు ఆమె ముఖంలోకి చూశాడు.
సరస్వతి చిలిపి కళ్ళను అటూ ఇటూ తిప్పి ‘‘దానాలన్నింటిలోకి పురుషుడు స్ర్తికి ఇవ్వగలిగిన ఉత్కృష్టదానమేది?’’ అని కొంటెగా అతన్ని కవ్వించింది.
ఆ చిలిపితనానికి చిలిపితనమే జవాబుగా ఉంటుందనే ఉద్దేశంతో ‘గర్భాదానం!’ అని వీరభద్రుడు కూడా మరింత కొంటెగా సవాలుగా సరస్వతి ముఖంలోకి తీక్షణంగా చూశాడు.

08/06/2019 - 20:41

‘‘దయచేసి తలుపు వేసెయ్యండి!’’ అన్నది సరస్వతి ప్రార్థనా స్వరంతో.
‘‘ఎందుకూ? అసలు నీవెవరివీ? రుూ బ్రహ్మచారి మఠంలోకి రుూ రాత్రివేళ రావటమేమిటీ? ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉన్నదా? నాతో నీకేం పనీ? వెంటనే జవాబు చెప్పి వచ్చిన తోవ చూసుకో!’’ అధికార స్వరంతో భయం వెన్నాడగా కలిగే తొందరపాటుతో ప్రశ్నల వర్షం కురిపించాడతను.

Pages