S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

06/30/2019 - 22:35

అతని గొంతు మృదువుగానూ, మెల్లగానూ ఉండటంతో జనం ఎక్కువగా హర్షించలేదు. వారికి ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు కావాలి. జనాలను రెచ్చగొట్టే ప్రసంగాలు కావాలి. గోడ్బోలే మాటలు ఉప్పులేని పప్పులా చప్పగా ఉన్నాయి.
ఆ తర్వాత విజయవాడ నుండి వచ్చిన ఒక నాయకుడు ఉద్రేకపూరితమైన ప్రసంగంతో సభను బాగా ఆకట్టుకొన్నాడు. అతనికి తెలుగు సాహిత్యంతో బాగా పరిచయం ఉంది. అందుకని కొన్ని పాటలు, పద్యాలు, కవితలు వినిపించాడు.

06/28/2019 - 19:59

‘‘గోడ్బోలే! నీవిక వెళ్లు. మరో విషయం - నాకెందుకో నిరీక్షణానంద స్వామి వారి ఆశ్రమంలో ఏద జరుగకూడనిది జరుగ బోతున్నదని తోస్తున్నదయ్యా!’’
‘‘అంటే ఏమిటి స్వామీ?’’
‘‘ఏమో తెలియడం లేదు. ఏదో అపశకునం కన్పడుతున్నది. సరే నీవు వెళ్లు’’
గోడ్బోలే బేగంబజార్‌కు వచ్చి చేవెళ్ళ స్థలం కొనవద్దని తంగిరాల సిద్ధాంతి గారు చెప్పినట్లు చెప్పాడు. అక్కడ దయ్యాలు ఉన్నమాట వాస్తవమేనని ఆయన నిర్ధారించారు.

06/27/2019 - 22:17

‘‘గోడ్బోలే! ఈ కర్తార్‌సింగ్ ట్రేడ్ యూనియన్ లీడర్లను తెచ్చి హమాలీ చార్జీలు పెంచాలి అంటూ గొడవ చేస్తున్నాడు.’’
గోడ్బోలే మాట్లాడలేదు.
‘‘పనిలో నుండి తీసివేస్తే మరొకడు ఇంత శ్రద్ధగా, నమ్మకంగా చేస్తాడని భరోసా లేదు’’
‘‘సేటూ! ఈ ట్రేడ్ యూనియన్ ప్రాబ్లం దేశమంతా ఉంది. మిగిలిని ట్రాన్స్‌పోర్టు కంపెనీలతో నేను సంప్రదిస్తాను. పెంచితే అందరం కలిసి పెంచవచ్చు. లేకుంటే లేదు’’

06/26/2019 - 22:19

‘‘సేటూ! చీకటి పడుతున్నది. త్వరగా సిటీ చేరుదాం. ఈ సంగతులన్నీ నాన్నగారికి చెప్పుదాం. ఆయన ఎలా నిర్ణయిస్తే అలా చేద్దాం’’
‘‘గోడ్బోలే! తోట అగ్గువ (తక్కువ) ధరకు వస్తుందని అనుకున్నాము కాని దాని వెనుక ఏదో కథ ఉందని ఇప్పుడు తెలిసింది’’
బండి మరికొంచెం ముందుకు వెళ్లింది.
‘‘గోడ్బోలే! బండిని వెనుకకు తిప్పు. ఈ రాత్రి మనం ఇక్కడే ఉందాం’’ అన్నాడు పార్థు.
‘‘నాన్నగారు ఏమంటారో?’’

06/25/2019 - 22:22

‘‘అలాగే పదండి. సంతులన స్వామిని చూద్దాం’’ అంటూ లేని భక్తి నటిస్తూ పార్థు, గోడ్బోలే వెంట ఆశ్రమంలోనికి వచ్చాడు.
అక్కడ వాతావరణమంతా ప్రశాంత సుందరంగా ఉంది. ఎవరో భక్తుడు చెట్లకు నీళ్ళు పోస్తున్నాడు. మరొకాయన ఆవుకు గడ్డి తినిపిస్తున్నాడు. సూర్యుని సంజుకెంజాయలు ఆశ్రమంలో పసుపును పండిస్తున్నట్లుగా మెరుస్తున్నాయి.
అక్కడి కార్యదర్శి ‘‘ఎవరు?’’ అని ప్రశ్నించాడు.

06/24/2019 - 22:51

‘‘చిన్న సేటూ! మీరు వయస్సులో ఇంకా చిన్నవారు. ప్రపంచ జ్ఞానం బాగా రావాలి. డబ్బు విలువ సంపాదించేవారికే తెలుస్తుంది’’
‘‘గోడ్బోలే! నీకు ఎన్నాళ్ళనుండి ఉద్యోగం చేస్తున్నావు?’’
‘‘ఐదేళ్ళ నుండి’’
‘‘నెలకు ఎంత సంపాదిస్తున్నావు?’’
‘‘ఐదు వేలు’’
‘‘కర్తార్ సింగ్ ఎన్నాళ్ళనుండి చేస్తున్నాడు?’’
‘‘పదేండ్ల నుండి’’
‘‘ఎంత సంపాదిస్తున్నాడు?’’
‘‘రోజుకు పది రూపాయలు’’

06/23/2019 - 22:37

విశ్వం నవ్వి, ‘‘సేట్‌గారూ! పులి కడుపున చలిచీమ పుట్టదు. మీ కొడుకు మీలాగే ప్రయోజకుడవుతాడే కాని జులాయిగా ఎందుకు తిరుగుతాడు?’’ అన్నాడు.

06/21/2019 - 19:51

కలకత్తాలోని కోర్టు ముందు శర్మిలాముఖర్జీ అవిశ్రాం తంగా తిరుగుతున్నది.
ఈమె షేక్‌స్పియర్ సరణి ప్రాంతంలో ఉండే ఫ్రీలాన్స్ జర్నలిస్టు. లాయర్ కూడా.
ఆ రోజు ఒక కేసు విచారణకు వచ్చింది. న్యాయమూర్తి ఋతుపర్ణ చటర్జీ ధర్మాసనం అధిష్ఠించారు.
శంఖపుష్పి అనే ముసలమ్మను బోనులో నిలబెట్టారు. ఆమె వయస్సు ఎనభై సంవత్సరాల పైమాటే.

06/20/2019 - 19:51

సులోచన ఇంకా ఆ షాక్‌లోనుంచి కోలుకోలేదు. ఆమెకు కలిగిన పెద్దషాక్... తన భర్త... తన బాస్‌ను చంపడానికి ప్రయత్నించడం..
భర్త పిసినారితనాన్ని అర్థం చేసుకుంది.. కానీ.. ఒక హంతకుడుగా మారడం.. మొట్టమొదిసారిగా ఆమెలో సహనం బరస్ట్ అయ్యింది. భర్త చెంపమీద గట్టిగాకొట్టింది.

06/19/2019 - 18:32

సునందరావు భార్యను తొందర పెట్టాడు. అతనికి ముందు.. ప్రద్యుమ్నకు బొకే ఇచ్చి కొత్త మొబైల్‌నుంచి ఆ దృశ్యాన్ని ఫొటో తీయాలని వుంది. అతని జేబులో అపరిచిత వ్యక్తి ఇచ్చిన డబ్బు పదిలంగా.. పడుకున్న పాములా వుంది. అది ఏ క్షణమైనా కాటువేయొచ్చు.. అనేలా..
కిరణ్మయి ముందుకు నడిచింది.
****

Pages