S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2018 - 00:25

విజయవాడ, సెప్టెంబర్ 24: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీనే ప్రధాన ముద్దాయి అని ఆంధ్రప్రదేశం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ ఆరోపించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని లెనిన్ సెంటర్‌లో ఈ కుంభకోణంపై నిరసన కార్యక్రమం, మానవహారం నిర్వహించారు.

09/25/2018 - 00:24

* రబీకి విత్తనాలు సిద్ధం చేయండి
* అధికారులకు సీఎస్ ఆదేశాలు
* నీరు-ప్రగతి పురోగతిపై సమీక్ష

09/25/2018 - 00:23

* స్థానికులకు ఉపాధి కల్పన
* వెల్నెస్ కేంద్రాలుగా అభివృద్ధి
* వి-రిసార్ట్ ప్రతినిధులతో భేటీలో సీఎం చంద్రబాబు

********************

09/25/2018 - 00:22

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: ట్రైన్‌లో బంగారం రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి దాదాపు రూ.62.35 లక్షల విలువైన రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆదివారం వెలుగుచూసింది.

09/25/2018 - 00:21

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 24: ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో బీజేపీని గెలిపించేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఎంతో బిజీగా ఉన్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో జరిగిన అతి భారీ కుంభకోణం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై గవర్నర్‌కు లేఖ ఇవ్వాలని కోరితే అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వలేనంతగా బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు.

09/25/2018 - 04:03

విశాఖపట్నం/అరకు/ పాడేరు: మావోయిస్ట్‌ల చేతిలో ఆదివారం హత్యకు గురైన అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కండ్రాం గ్రామానికి వెళుతుండగా మావోయిస్ట్‌లు వీరిని హతమార్చిన సంగతి తెలిసిందే. వీరి భౌతికకాయాలకు అరుకు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు.

09/25/2018 - 03:48

రేణిగుంట, సెప్టెంబర్ 24: రానున్న పదేళ్లలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తి గల దేశంగా ఎదుగుతున్నదని వరల్డ్‌బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోర్ నివేదికలు తెలియజేస్తున్నాయని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కుర్రకాల్వ వద్ద 99కోట్ల రూపాయలతో నిర్మించిన పాకశాస్త్ర ప్రావీణ్య విద్యాలయాన్ని ఆయన కేంద్రమంత్రి అల్ఫోన్స్‌తో కలిసి ప్రారంభించారు.

09/25/2018 - 04:04

విశాఖపట్నం: విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం లిప్టిపుట్టు వద్ద ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం హత్య చేసిన మావోయిస్టుల ఫొటోలను జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం విడుదల చేసింది. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు గుర్తించిన మావోల చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటనలో కొరాపుట్ దళానికి చెందిన సుమారు 20 మంది మహిళలు, 30 మంది పురుషులు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.

09/25/2018 - 00:12

మార్కాపురం, సెప్టెంబర్ 24: నల్లమల అటవీప్రాంతంపై నిఘాపెంచామని, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే నేతలు పోలీసులకు సమాచారం అందించి వెళ్ళాలని ఇప్పటికే వర్తమానం పంపామని ప్రకాశం జిల్లా మార్కాపురం డీవైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. ఆదివారం అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీఎమ్మెల్యే సోమాను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ నల్లమల అటవీప్రాంతంలో నిఘా పెంచామన్నారు.

09/25/2018 - 00:12

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: తను గ్రామ దర్శిని కార్యక్రమానికి వెళ్తున్నాను, బందోబస్త్ కావాలని అరుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు కోరినా, స్పందించకపోవడంతో డుంబ్రిగుడ ఎస్‌ఐ అమ్మన్‌రావును సస్పెండ్ చేసినట్టు పోలీసులు తెలియచేశారు. ప్రజా ప్రతినిధులకు సరైన రక్షణ కల్పించనందుకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు పోలీసు అధికారులు ప్రకటించారు.

Pages