S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/17/2020 - 02:03

మేఘాలయలోని ఉమ్రోయ్‌లో ఆదివారం ప్రారంభమైన సంయుక్త విన్యాసాల్లో భారత్-బంగ్లా సైనికులు.
ఇరు దేశాల మధ్య ఈ విన్యాసాలు జరగడం ఇది తొమ్మిదోసారి.

02/17/2020 - 01:57

న్యూఢిల్లీ/చెన్నై, ఫిబ్రవరి 16: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటు ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లోనూ, అటు చైన్నైలోనూ ముస్లిం మహిళల నిరసన రోజు, రోజుకూ తీవ్రమవుతోంది. షషీన్‌బాగ్‌లో గత కొన్ని వారాలుగా నిరసన ప్రదర్శన జరుపుతున్న ఆందోళనకారులు అధికారుల అనుమతి తీసుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటికి కూడా ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.

02/17/2020 - 06:13

న్యూఢిల్లీ: పలువురు సీనియర్ నేతలు చేసిన వివాదాస్పద ప్రకటనల ప్రభావం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి దారితీసిన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం రానున్న అన్ని ఎన్నికల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించబోతోంది. ముఖ్యంగా పార్టీ నేతలు ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయకుండా చాలా గట్టిగానే కట్టడి చేయాలని సంకల్పిస్తోంది.

02/17/2020 - 01:54

కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి తరలించిన 406 మంది భారతీయులపై జరిగిన పరీక్షల్లో ఈ రకమైన వైరస్ వారికి లేదన్న విషయం నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో ఉన్న వీరిని సోమవారం నుంచి దశలవారీగా డిశ్చార్జి చేస్తారు

02/17/2020 - 02:35

వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సంబంధాలు దృఢమయినవని అమెరికాకు చెందిన ఒక ఉన్నత స్థాయి దౌత్యవేత్త పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలలో భారత్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు.

02/17/2020 - 01:40

కోల్‌కతా, ఫిబ్రవరి 16: శాంతియు త సహజీవనం, భిన్నత్వంలో ఏక త్వం, బహుముఖీయ నైతిక వర్తనకు భారత్ పెట్టింది పేరు అని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రకమైన ఔన్నత్యభరిత సంస్కృతిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని లింగపరమైన లేదా ఇతరత్రా ప్రజల మధ్య ఏ రకమైన వివక్షకూ ఆస్కారం ఉండకూడదన్నారు.

02/17/2020 - 01:39

వారణాసి, ఫిబ్రవరి 16: ఎంతగా ఒత్తిళ్లు వచ్చినా పౌరసత్వ సవరణ చట్టం, 370 రాజ్యాంగ అధికరణ రద్దు నిర్ణయాలపై వెనక్కి తగ్గేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ విస్పష్టంగా ప్రకటించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా నిలబడుతుందని, అన్నివైపుల నుంచి ఎంత తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా రాజీ పడదని తెలిపారు.

02/17/2020 - 01:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న తాజా వీడియోను తాను విడుదల చేయలేదని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం ఆదివారం స్పష్టం చేసింది. గత సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన పారా మిలిటరి, పోలీసు దుస్తులు ధరించిన కొంతమంది విశ్వవిద్యాలయ గ్రంథాలయంలోకి ప్రవేశించి, విద్యార్థులను క్రూరంగా కొడుతున్న దృశ్యాలు ఈ తాజా వీడియోలో ఉన్నాయి.

02/17/2020 - 01:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ‘ఈ విజయం నాది కాదు.. మీదే. మీరంతా నా కుటుంబం. మీ బిడ్డగా మూడోసారి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాను’ అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం రామ్‌లీలా మైదానంలో మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 20 నిమిషాలపాటు బహిరంగ సభలో మాట్లాడిన కేజ్రీవాల్ ఢిల్లీలో సజావుగా పాలన సాగించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.

02/17/2020 - 01:24

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి విధి విధానాలు ఖరారు చేయడానికి మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్టస్థ్రాయి మున్సిపల్ సదస్సు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Pages