S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/19/2019 - 23:14

చిలకలూరిపేట, ఫిబ్రవరి 19: యడ్లపాడు మండలం, కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు పిట్టల కోటయ్య మృతిపట్ల పలు అనుమానాలు ఉన్నాయని వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని ఆరోపించారు. మంగళవారం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి సోమవారం మృతిచెందిన కోటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకువచ్చారు.

02/19/2019 - 23:14

గుంటూరు, ఫిబ్రవరి 19: పోలీసుశాఖపై విషప్రచారం చేస్తే సమాజం నిర్వీర్యమవుతుందని రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సన్నిహితంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

02/19/2019 - 23:13

అమరావతి, ఫిబ్రవరి 19: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో మార్చి 1 నుండి 7వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే తన ఛాంబర్‌లో శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడ, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు.

02/19/2019 - 23:11

కర్నూలు, ఫిబ్రవరి 19:టీడీపీ తరఫున కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు.. సైకిల్ టికెట్ ఎవరికి దక్కుంది.. సర్వేల్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి.. సీటు రాని వారి దారెటు.. ఇదీ ప్రస్తుతం కర్నూలులో జరుగుతున్న చర్చ. కర్నూలులో ఎన్నికల వేడి రాజుకుందనేలా ఇటీవల ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

02/19/2019 - 23:11

కర్నూలు, ఫిబ్రవరి 19:18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగర శివారులోని దూపాడు వద్ద ఉన్న కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందన్నారు.

02/19/2019 - 23:10

మహానంది, ఫిబ్రవరి 19: మండల పరిధిలోని బసాపురం పంట పొలాల్లో చిరుత సంచరిస్తుండగా రైతులు భయభ్రాంతులకు గురవుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పొలాలకు కాపలా కాస్తున్నారు. ఆరుగాలం కష్టించి పంటను అడవి జంతువుల నుండి రక్షించుకొనేందుకు పంట పొలాలకు వెళ్లగా కాపలాగా వెళ్లిన రైతులుకు చిరుత కనిపించడంతో రైతులు పరుగులు పెట్టినట్లు వాపోయారు.

02/19/2019 - 23:09

కర్నూలు, ఫిబ్రవరి 19:రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు.

02/19/2019 - 23:09

కల్లూరు, ఫిబ్రవరి 19:కేంద్ర ప్రభు త్వం జియోతో లోపాయికారి ఒప్పం దం పెట్టుకుని ఏళ్ల తరబడి సేవలు అందించిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు ద్రోహం చేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు పుల్లారెడ్డి, రాజగోపాల్ ధ్వజమెత్తారు. బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్ ముందు చేపట్టిన ధర్నాకు సీఐటీయూ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకట్టించారు.

02/19/2019 - 23:08

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 19:రాష్ట్రంలోని బీసీలంతా టీడీపీ వెంటే ఉన్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న తన ఛాంబర్‌లో మంగళవారం సోమిశెట్టి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడమే కాకుండా వారిని చిన్నచూపు చూసిందన్నారు.

02/19/2019 - 23:06

నెల్లూరు, ఫిబ్రవరి 19: దేశ ప్రథమ, ద్వితీయ పౌరులైన రామ్‌నాథ్ కోవింద్, ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనకు సింహపురి సిద్ధమవుతోంది. వారి రాకను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ముమ్మరంగా పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్న రైల్వేలైన్, నెక్లెస్ రోడ్డు పనులను పరిశీలించారు.

Pages