S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2018 - 01:50

జైపూర్, సెప్టెంబర్ 22: బంగ్లాదేశ్ నుంచి మనదేశానికి వలస వచ్చిన వారు చెదపురుగుల్లాంటి వారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

09/23/2018 - 01:50

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: 2017వ సంవత్సరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేసిన కృషిలో గణనీయమయిన పురోగతిని సాధించిన 14 దేశాలలో భారత్ ఉందని అమెరికా విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది.

09/23/2018 - 01:43

గుడివాడ, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహిస్తోందని జడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చెప్పారు. గుడివాడ రూరల్ మండలం చౌటపల్లిలో రూ.20లక్షలతో నిర్మించే పాఠశాల కాంపౌండ్ వాల్, రూ.28లక్షలతో చేపట్టిన శివాలయం పునరుద్ధరణ పనులకు ఆమె శనివారం శంకుస్థాపన చేశారు.

09/23/2018 - 01:40

మచిలీపట్నం, సెప్టెంబర్ 22: జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. గత మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవమవుతున్న రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలు ఈ విడత కూడా ఏకగ్రీవం కావడం విశేషం. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన బందరు ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారి సిహెచ్‌వి చంద్రశేఖర్‌నే మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

09/23/2018 - 01:39

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశ వ్యాప్తంగా ఒకే సిద్ధాంతాన్ని రుద్దేందుకు ప్రయత్నించడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పరివ్యాప్తం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఒకే సిద్ధాంతం ప్రాతిపదికగా భారత దేశాన్ని ముందకు నడిపించే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

09/23/2018 - 01:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని, వైద్య విద్యార్థులు జ్ఞానంతోపాటు సేవాభావాన్ని అలవరుచుకుని ఆదర్శంగా నిలవలని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయు డు పిలుపునిచ్చారు. విశాఖపట్నం గీతమ్ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శనివారం వెంకయ్య నాయుడని కలిశారు.

09/23/2018 - 01:36

ఐరాల, సెప్టెంబర్ 22: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ధ్వజావరోహణం కన్నుల పండుగగా జరిగింది. వినాయకచవితి రోజున స్వర్ణ ధ్వజస్థంభంపై ఎగరేసిన మూషిక ధ్వజపటాన్ని మేళతాళాలు వేదమంత్రోచ్చరణల నడుమ అర్చకులు కిందకు దించారు. ధ్వజావరోహణం జరగడంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు అయింది.

09/23/2018 - 01:35

జి.కొండూరు, సెప్టెంబర్ 22: ఆత్కూరు-ముత్యాలంపాడు - జి.కొం డూరు (ఎఎంజికె) ఎత్తిపోతల పథకం విజయవంతం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

09/23/2018 - 01:34

తిరుపతి, సెప్టెంబర్ 22: ప్రకృతి, సాంకేతికతను మిళితం చేస్తే... అభివృద్ధి, అరోగ్యం, వౌలిక సదుపాయాలు మనముందు ఆవిష్కరించు కోవచ్చని అందుకే ఆదిశగా తాను ప్రణాళికలు రూపొందిస్తున్నానని ఇందులో భాగంగానే పుర సేవలను గడప ముందుకు చేర్చేందుకు డిజిటల్ డోర్ నెంబర్లను ఏర్పాటు చేశామని, భారతదేశంలోనే తొలిసారిగా తిరుపతిలో ఈవిధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

09/23/2018 - 01:30

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ దంపతులకు పిడుగులాంటి వార్త. హెచ్- 4 వీసాదారుల పని వీసాలను రద్దుచేస్తామంటూ ఇంతకాలం ప్రకటిస్తూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మూడు నెలల్లోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో హెచ్- 1 బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములకు కష్టాలు తప్పని పరిస్థితి వస్తోంది.

Pages