S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/24/2020 - 05:24

విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం ద్వారా చక్కటి పౌష్టికాహారం అందించే మహత్తర కార్యక్రమాన్ని రూపొందించిందని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించే బాధ్యత టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులపై ఉందన్నారు.

01/24/2020 - 02:11

అమరావతి, జనవరి 23: రాష్ట్ర శాసనసభ సమావేశాలు 27కు వాయిదా పడ్డాయి. ముందుగా ఈ నెల 20 నుంచి 22 వరకే సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో సమావేశాలను పొడిగించాల్సి వచ్చింది. గురువారం వరకు పూర్తి స్థాయిలో సమావేశాలు జరిగాయి. తొలి రోజునే ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు చర్చ జరిగింది.

01/24/2020 - 02:09

విజయవాడ, జనవరి 23: రక్షణ రంగంలో పెట్టుబడుల ప్రవాహం వచ్చేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గురువారం రక్షణ రంగ ప్రతినిధులు, పరిశ్రమలు, ఐటీ శాఖ అధికారులు మంత్రితో సమావేశమయ్యారు.

01/24/2020 - 02:08

గద్వాల, జనవరి 23: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం దయ్యాలవాగు సమీపంలో గురువారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గద్వాల పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

01/24/2020 - 02:01

విజయవాడ, జనవరి 23: అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించి నాడు ఎంతో మంది యువత స్వాతంత్య్ర ఉద్యమంలో చేరడానికి ప్రేరణగా నిలిచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్మరణీయుడని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాలులో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

01/24/2020 - 01:59

విజయవాడ: రాష్ట్ర శాసన మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై శాసనసభలో పలువురు మంత్రులు మండిపడ్డారు. తాము ఎమ్మెల్సీలమైనప్పటికీ మండలిని రద్దు చేయాలని కోరుతున్నట్లు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చను చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదించారు.

01/24/2020 - 01:58

విజయవాడ, జనవరి 23: దిశ చట్టం అమలు కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని, దిశ కేసుల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేక న్యాయ స్థానాలను ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని దిశ ప్రత్యేక అధికారిణి కృతిక శుక్లా తెలిపారు.

01/24/2020 - 01:57

అమీన్‌పూర్, జనవరి 23: ఇంటినుండి బయటకు వెళ్లిన ఒక బాలికపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

01/24/2020 - 01:56

పాడేరు, జనవరి 23: గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రాంప్రసాద్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక లోచలిపుట్టులోని రెంటల్ హౌసింగ్ కాలనీలోని ఐటీడీఏ క్వార్టర్‌లో నివాసం ఉంటున్న ఆయన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అధికార, ఉద్యోగ వర్గాలను తీవ్ర విస్మయానికి గురి చేసింది.

01/24/2020 - 01:50

షాద్‌నగర్ రూరల్: సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురవారం పట్టణంలోని నేతాజి చౌరస్తాలరో సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.

Pages