S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/21/2020 - 01:27

వేములవాడ, ఫిబ్రవరి 20: ప్రణాళికాబద్ధంగా పట్టణాలు అభివృద్ధి చెందాలని, పట్టణాల్లో అవినీతి లేకుండా రూపాయి లంచం ఇవ్వకుండా ఇల్లు కట్టుకునే అవకాశం ఇవ్వాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పట్టణ ప్రణాళిక సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవినీతి రహితంగా పాలన ఉండేందుకే ముఖ్యమంత్రి ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చారన్నారు.

02/21/2020 - 01:11

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 20: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబానికి చెందని వారిని ఎన్నుకోవాలనే డిమాండ్ పార్టీలో పుంజుకుంటోంది. సోనియా గాంధీ స్థానంలో కొత్త వారిని పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకోవాలి, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాకుండా బయటి వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలని మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌కు పలువురు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు.

02/21/2020 - 01:16

మదనపల్లె: పాఠశాలలో జరిగిన విద్యార్థుల మధ్య ఘర్షణ ఓ విద్యార్థి హత్యకు దారితీసిన సంఘటన గురువారం సాయంత్రం చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో చోటుచేసుకుంది. మదనపల్లె రెండవ పట్టణ సీఐ తమీమ్‌అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ తొట్లివారిపల్లెకాలనీకి చెందిన వెంకటరమణ, రెడ్డిశాంతమ్మలకు కుమారుడు, కూతురు ఉన్నారు.

02/21/2020 - 01:07

గుంటూరు: దేశంలో ఏ రాజకీయ కుటుంబం కూడా ప్రకటించని విధంగా గత తొమ్మిది సంవత్సరాల నుండి తమ కుటుంబ ఆస్తులను ప్రకటిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో తమ కుటుంబ ఆస్తుల వివరాలను లోకేష్ ప్రకటించారు.

02/21/2020 - 02:16

న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పనిచేయటం ద్వారా దేశాభివృద్ధికి కృషి చేయాలని జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజాన్ భవన్‌లో గురువారం జరిగిన ‘్భరతీయ ఛాత్ర సంసద్’ (్భరతీయ విద్యార్థుల పార్లమెంటు)లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

02/21/2020 - 01:35

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 15వ తేదీన హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ గురువారం నాడు చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఉన్న అన్ని అనుమానాలను అమిత్ షా నివృత్తి చేస్తారని ఆయన చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే ఎల్‌బీ స్టేడియం అధికారులతో కూడా సంప్రదించినట్టు ఆయన తెలిపారు.

02/21/2020 - 01:00

శ్రీశైలం/శ్రీశైలం టౌన్, ఫిబ్రవరి 20: మహాశివరాత్రి రోజు మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో శ్రీగిరికి చేరుకుంటున్నారు. ఓం నమఃశివాయ నామస్మరణతో శ్రీశైలం మారుమోగుతోంది. సుమారు 4 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నట్లు తెలుస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.

02/21/2020 - 00:58

మార్కాపురం, ఫిబ్రవరి 20: పశ్చిమ ప్రకాశం ప్రజల కరవును శాశ్వతంగా పారదోలేందుకు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సందర్శించారు. తొలుత మొదటి, రెండవ టనె్నల్‌లను పరిశీలించారు.

02/21/2020 - 00:50

సంగీత ప్రపంచంలో భారతరత్న పొందిన గొప్ప షెహనాయి విద్వాంసులు ఉస్తాద్ ఖమ్రుద్దీన్ బిస్లిల్లాఖాన్ గురించి ఓ సంఘటన జనబాహుళ్యంలో ఉంది. ఆయన హిందూ పుణ్యక్షేత్రమైన వారణాసిలో ఉండేవారు. ఆయనను కలిసినవాళ్లు ‘‘మీరు ఇంకా గొప్పవారు కావాలంటే ఢిల్లీలో ఉంటే బాగుంటుంది కదా!’’ అంటే ఆయన తడుముకోకుండా ‘‘్ఢల్లీలో విశే్వశ్వరుడు, గంగానది లేవు కదా!’’ అని ఎదురు ప్రశ్నించేవాడట.

02/21/2020 - 00:49

మాతృభాష తల్లి పాలతో సమానం. శిశువుకు తల్లిపాలు లభించనట్లయితే ఏ విధంగా అనారోగ్యం పాలవుతాడో మాతృభాష అభ్యసించలేని విద్యార్థి కూడా విషయాలు నేర్చుకోవడంలో వెనుకబడతాడు. 1999వ సంవత్సరంలో యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించడంతో 2000 సంవత్సరంనుండి ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ భాషలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

Pages