S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/20/2020 - 23:33

హైదరాబాద్, ఫిబ్రవరి 20: విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఎట్టకేలకు వాస్తవాలను గ్రహించి, ఆధునిక టెక్నాలజీని వినియోగించడం ద్వారా పొరపాట్లు సరిదిద్దుకునేందుకు సిద్ధమవుతోంది. గత ఏడాది జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృత్తం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు సీనియర్ అధికారులు అంతా చాలా గట్టిగా చెప్పడంతో ఈ ఏడాది బోర్డు అధికారులు మరింత దృష్టి సారించి టెక్నాలజీని ఊతంగా తీసుకుంటున్నారు.

02/20/2020 - 23:32

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఐఐటీ హైదరాబాద్ ట్యాలెంట్ స్ప్రింట్ సహకారంతో కృత్రిమ మేథస్సుపై సర్ట్ఫికేట్ కోర్సును ప్రారంభించింది. ఆరు నెలల వ్యవధితో కూడిన ఈ కోర్సులో భాగంగా ఎఐ, ఐఓటీ, బ్లాక్ చెయిన్, క్వాంటం కంప్యూటింగ్, ఇతర అధునాతన టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తామని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి చెప్పారు.

02/20/2020 - 23:32

హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని మరో రెండు దేవాలయాలకు రెనోవేషన్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రెండు ఆలయాలకు ఈ తరహా కమిటీలను నియమించిన ప్రభుత్వం గురువారం మరో రెండు ఆలయాలకు కమిటీలను ఏర్పాటు చేస్తూ జీఓలను జారీ చేసింది. రెవెన్యూ (దేవాదాయ) శాఖ కార్యదర్శి వి.అనిల్‌కుమార్ పేరుతో రెండు వేర్వేరు జీఓలు జారీ అయ్యాయి.

02/20/2020 - 23:31

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఆంధ్రాలో ప్రధాన కార్యాలయాలతో నడుస్తున్న అనేక కార్పొరేట్ కాలేజీలు తెలంగాణకు తరలివస్తున్నాయి. ఆంధ్రాలో కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడానికే పరిమితం కాకుండా తరచూ పర్యవేక్షణ చేయడంతో అక్కడి నిబంధనలను పాటించలేకపోతున్న కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీల అనుబంధ హాస్టళ్లు తెలంగాణకు వస్తున్నాయి.

02/20/2020 - 23:30

హైదరాబాద్, ఫిబ్రవరి 20:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఈ నెల 23వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఎంసీపీఐయూ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనున్నట్టు కార్యదర్శి తాండ్ర కుమార్ తెలిపారు. గురువారం నాడు ఆయన ప్లీనరీ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

02/20/2020 - 23:29

హైదరాబాద్, ఫిబ్రవరి 20: శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, మహాశివరాత్రి పండుగను కోట్లాది మంది ప్రజలు శ్రద్దతో జరుపుకుంటారని, ఉపవాసం ఉంటూ పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరిలో మంచి ఆలోచనలు రావాలని, ప్రేమ, ఆప్యాయత, మైత్రి, సోదరభావం పెంపొందాలన్నారు.

02/21/2020 - 01:55

సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగే మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ జట్టు ఢీ కొంటుంది. మొత్తం పది జట్లు ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.

02/20/2020 - 23:20

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తుందని స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ ధీమా వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత్‌పై డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాదే పైచేయి కావచ్చని గురువారం పీటీఐతో మాట్లాడుతూ జోస్యం చెప్పింది.

02/20/2020 - 23:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ సంచలన రెజ్లర్ దివ్య కక్రాన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో టైటిల్ సాధించిన రెండో భారతీయురాలిగా గుర్తింపు సంపాదించింది. కాగా, మరో ఇద్దరు భారత మహిళా రెజ్లర్లు, పింకీ, సరితా మోర్ స్వర్ణ పతకాలను గెల్చుకోగా, నిర్మలా దేవి రజత పతకంతో సంతృప్తి చెందింది.

02/20/2020 - 23:08

చికాగో, ఫిబ్రవరి 20: మహిళా బాస్కెట్‌బాల్ స్టార్ స్ట్ఫోనీ డాల్సన్ డబ్ల్యూఎన్‌బీఏలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న స్కై క్లబ్‌కు గుడ్‌బై చెప్పిం ది. ఇటీవలే ఆమె చికాగోలో జరిగే టోర్నీకి ఎన్‌బీఏ ఆల్‌స్టార్ జట్టుకు ఎంపికైంది. అంతేగాక, యూఎస్‌ఏ బాస్కెట్ బాల్ 3 ఆన్ 3 క్వాలిఫయింగ్ జట్టులోనూ ఆమె సభ్యురాలు.

Pages