S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2017 - 00:24

న్యూఢిల్లీ, మే 1: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్.. ధరలను పెంచింది. వివిధ రకాల మోడళ్లపై కనిష్టంగా 500 రూపాయల నుంచి గరిష్ఠంగా 2,200 రూపాయల వరకు పెంపును ప్రకటించింది. పెరిగిన ఉత్పాదక వ్యయం వల్ల ధరలను పెంచక తప్పట్లేదని సోమవారం హీరో మోటోకార్ప్ తెలిపింది. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

05/02/2017 - 00:23

న్యూఢిల్లీ, మే 1: భారత్.. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన దేశమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ పెట్టుబడులకు మంచి సమయం ఇదేనని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంతర్జాతీయ మదుపరులకు పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ భారత పర్యటన సందర్భంగా సోమవారం ఇక్కడ ఇండియా-టర్కీ బిజినెస్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో మాట్లాడిన మోదీ..

05/02/2017 - 00:22

రాజమహేంద్రవరం, మే 1: వర్జీనియా పొగాకు రైతులు అధిక ధర కోసం ఎదురు చూస్తుండటంతో కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన వేలం ప్రక్రియ మందగమనంలో సాగుతోంది. ప్రస్తుతం ధర ఆశాజనకంగానే ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత లభిస్తుందనే ఆలోచనతోనే రైతులు వేలానికి బేళ్లను తక్కువ సంఖ్యలో తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వేలం ప్రక్రియ మందగమనంలో సాగుతోందని అంచనా వేస్తున్నారు.

05/02/2017 - 00:17

విజయవాడ, మే 1: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తమను తెలంగాణకు బదిలీ చేయాలని ఎపి అసెంబ్లీ సెక్రటరీని సోమవారం కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని శాఖల ఉద్యోగుల పంపకాల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం తెలిసిందే.

05/02/2017 - 00:17

విజయవాడ, మే 1: రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న వివిధ జెడ్పీటిసి, ఎంపిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు జెడ్పీటిసి స్థానాలకు, 17 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు జెడ్పీటిసి స్థానానికి, కుక్కునూరు జెడ్పీటిసి స్థానానికి ఎన్నిక జరగనుంది.

05/02/2017 - 00:16

ఒంగోలు అర్బన్,మే 1:రాష్ట్రంలో అంగన్‌వాడి కేంద్రాలకు త్వరలో నూతన భవనాలను నిర్మించేందుకు అన్నివిధాలా చర్యలు తీసకుంటున్నట్లు రాష్ట్ర శిశుసంక్షేమశాఖమంత్రి పరిటాల సునీత వెల్లడించారు.

05/02/2017 - 00:14

విజయవాడ, మే 1: 2019 సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీని బలోపేతం చేసేందుకు విశాఖలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ తెలిపారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గత నెల 29, 30న విశాఖలో జరిగాయన్నారు.

05/02/2017 - 00:14

గుంటూరు, మే 1: ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ, కార్మిక వ్యతిరేకి అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులు ఎన్నో ఏళ్లుగా కనీస వేతనాలకు కూడా నోచుకోకుండా పనిచేస్తున్నా ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు జీహుజూర్ అంటోందని ఆరోపించారు.

05/02/2017 - 00:13

విజయవాడ, మే 1: అవయవదానంపై భారీస్థాయిలో అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నట్టు రాష్ట్ర శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. సోమవారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మంగళవారం నిర్వహించబోయే కార్యక్రమానికి 10వేల మందికి పైగా హాజరవుతారని స్పీకర్ చెప్పారు.

05/02/2017 - 00:13

విజయవాడ, మే 1: రాష్ట్రంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరైన ప్రచారం లేక ఆదరణకు నోచుకోవడం లేదు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదే పదే చెబుతున్నప్పటికీ నిర్వాహకులు కనీస శ్రద్ధ కనబరచడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు సమీక్ష సమావేశాల్లోనూ మంత్రి ఈ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

Pages