S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2017 - 23:56

విజయనగరం, మే 1: దేశానికి నైపుణ్యం గల యువత అవసరమని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. దేశంలో అపారమైన వనరులు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకొని దేశాభివృద్ధికి వినియోగించాలంటే నైపుణ్యం గల యువత అవసరమన్నారు. సోమవారం పట్టణంలో మాన్సాస్‌కు చెందిన లా కళాశాల ఆవరణలో నైపుణ్యాభివృద్ధి సంస్థను ప్రారంభించారు.

05/01/2017 - 23:55

విజయనగరం (్ఫర్టు), మే 1: ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయనగరం ప్రాంగణం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఎయు ఉపకులపతి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. ప్రాంగణంలో విద్యార్థులకు అవసరమైన వౌలిక వసతులు, ఇతర సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక విశ్వవిద్యాలయం విజయనగరం ప్రాంగణాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

05/01/2017 - 23:47

హైదరాబాద్, మే 1: తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఆగస్టు 15లోగా ఈ-పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు కావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సిపార్డులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, సెర్ప్‌లపై మంత్రి సమీక్షించారు. ఈ-పంచాయతీ, ఉపాధి హామీ, హరిత హారం, కార్యదర్శుల రేషనలైజేషన్ తదితర అంశాలపై కమిషనర్ నీతూ ప్రసాద్‌తో పాటు ఇతర అధికారులతో చర్చించారు.

05/01/2017 - 23:47

హైదరాబాద్, మే 1: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 23 నుండి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాన్ని, కార్యాచరణను అందించనున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లి అమిత్‌షాను కలిసి పర్యటనపై చర్చించారు.

05/01/2017 - 23:46

హైదరాబాద్, మే 1: తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సోమవారం కాస్త తగ్గగా, ఏపిలో ఒకవైపు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవగా, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైంది. ఏపిలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో గత 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీగా వర్షం కురిసింది.

05/01/2017 - 23:46

హైదరాబాద్, మే 1: తమ హక్కుల పరిరక్షణ, సమస్యల సాధనకు ధర్నా చౌక్‌ను పునరుద్దరించాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బాలబాలికలు నిరసన దీక్ష నిర్వహించారు. సోమవారం మగ్ధుంభవన్‌లో నిర్వహించిన దీక్ష శిబిరంలో పలువురు బాలబాలికలు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ వెంటనే ధర్నా చౌక్‌ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. 10 నుంచి పిజి వరకు చదువుతున్న బాలబాలికలు ఈ ధర్నా నిర్వహించారు.

05/01/2017 - 22:18

కోట్లు పెట్టారు. కోట్లు వసూలు చేస్తున్నారు. చెప్పుకోడానికి ఇదొక్కటి తప్ప -ఏముంది బాహుబలిలో. ‘కన్‌క్లూజన్’ చూసిన తరువాత కోటి మందికి ఎదురైన ప్రశ్న ఇది.

దీనికి సమాధానమే -బాహుబలికి డబ్బు చేసింది? అందుకే ఎక్కడ చూసినా ‘బాహుబలి’ వసూళ్ల గురించి మాట్లాడుతున్నారు. థియేటర్లవారీ, ప్రాంతాలవారీ, రాష్ట్రాలవారీ, దేశాలవారీ, ఓవర్సీస్‌లో ఎంతెంత కొల్లగొట్టారో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

05/01/2017 - 22:14

హీరో అంటే అన్ని సద్గుణాల సంపన్నుడు. ఇది ఒకప్పటి సినిమా పరిభాష. ఇప్పుడు మాత్రం కథానాయకుడంటే అవగుణాల పుట్టగా కనిపించాలి. ఎవడు ఏది చెప్పినా వినకూడదు. మంచి మాట మాట్లాడరాదు. మంచి పనులూ చేయకూడదు. కాలేజీకి డుమ్మా కొట్టేసి ప్రియురాళ్ళను పట్టుకుని హోటళ్ళల్లో బాతాఖానీలు కొట్టాలి, సినిమాలకు తిరగాలి. వీలైతే హుక్కా లాంటి మాదకద్రవ్యాలు సేవిస్తూ, అవి కూడా హీరోయిన్లకు నేర్పించగలగాలి.

05/01/2017 - 21:56

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

05/01/2017 - 21:47

సాధారణంగా హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ అఫైర్స్ ఏదోక టైంలో గుప్పుమంటాయ. కానీ ఈ విషయాన్ని ఏ హీరోయిన్ అయినా అడిగితే మాత్రం.. మా మధ్య అఫైరా... ఛ.. అలాంటిదేమీ లేదు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కవర్ చేస్తుంటారు. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి కామెంట్ చేసింది మరో ముద్దుగుమ్మ అవికాగోర్? చిన్నారి పెళ్లికూతురిగా ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో వరుసగా రెండు మూడు హిట్స్‌తో పాపులర్ అయింది.

Pages