S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 03:38

హైదరాబాద్/ అల్వాల్, డిసెంబర్ 2: ఇద్దరు ఆటోడ్రైవర్ల వేధింపులు భరించలేక ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగింది. అల్వాల్ సిఐ ఆనందరెడ్డి కథనం ప్రకారం ఓల్డ్ అల్వాల్ కుమ్మరిబస్తీ నివాసి, ఆటోడ్రైవర్ బాలరాజు ఆటోను రోజు వారీ కిరాయికి నర్సింహ వద్ద తీసుకుని నడిపిస్తున్నాడు.

12/03/2016 - 03:36

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆబ్కారీ విధానంలో పేర్కొన్న విధంగా మాదక ద్రవ్యాలు, మద్యం అలవాటును మాన్పించడానికి ఏర్పాటు చేయాల్సిన డి-ఎడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏమిటో వారం రోజులలో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

12/03/2016 - 03:46

హైదరాబాద్, డిసెంబర్ 2: వంగవీటి సినిమా ట్రైలర్ నుంచి అభ్యంతరకరమైన దృశ్యాలను, పాటలను తొలగిస్తామని ఆ సినిమా నిర్మాత హైకోర్టుకు లిఖితపూర్వకంగా అఫిడవిట్ ఇచ్చారు. ఈ సినిమా విడుదలైతే సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టినట్లవుతుందని, సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

12/03/2016 - 03:35

హైదరాబాద్, డిసెంబర్ 2: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కార్మిక , ఉద్యోగుల పక్షపాతి అని మరోసారి రుజువైందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షులు కె సత్యనారాయణరావు, ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాష్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖలవ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వారు చెప్పారు.

12/03/2016 - 03:34

హైదరాబాద్, డిసెంబర్ 2: తమ డిమాండ్లను తక్షణమే ఆమోదించి అమలు చేయాలని కోరుతూ ఏపిఎస్‌ఇబి అసిస్టెంట్ ఇంజనీర్లు శుక్రవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో ఏపి ట్రాన్స్‌కో సిఎండి చాంబర్ ముందు బైఠాయించారు. పదోన్నతుల విషయంలో విద్యుత్ సంస్థల యజమాన్యం న్యాయం చేయడంలో విఫలమైందని ఏపిఎస్‌ఇబి అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఎన్ కిరణ్‌కుమార్ అన్నారు.

12/03/2016 - 03:33

హైదరాబాద్/కుషాయిగూడ, డిసెంబర్ 2: చెక్కులు డ్రా చేస్తానని చెప్పి తీసుకున్న బ్యాంక్ ఎండి ఆ మొత్తాన్ని ఖాతాదారుకు ఇవ్వకుండా తానే డ్రా చేసుకున్న ఉదంతం ఇది. ఏఎఎస్‌రావునగర్ నవభారత్ బ్యాంకులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎఎస్‌రావునగర్‌కు చెందిన సుడుగు మహేందర్‌రెడ్డి నవభారత్ ప్రైవేట్ బ్యాంకులో బావమరిది పెళ్ళి కోసం లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు.

12/03/2016 - 03:33

హైదరాబాద్/హయత్‌నగర్, డిసెంబర్ 2: భూదాన్‌బోర్డు భూములను అక్రమంగా విక్రయించాడనే ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు హయత్‌నగర్ పోలీసులు భూదాన్‌బోర్డు మాజీ చైర్మెన్ రాజేందర్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయితీ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ పరిధిలోని పాపాయిగూడ సర్వే 215, 224లోని భూదాన్ భూమిలో అర్హులైన వారికి పట్టాలు ఇవ్వకుండా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

12/03/2016 - 03:31

వాషింగ్టన్, డిసెంబర్ 2: అమెరికా నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు తమ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తుందని ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్పష్టం చేశారు. మతదురభిమానం, దురభిప్రాయాలను తిప్పికొట్టి దేశమంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల విజయం సాధించిన ట్రంప్ కీలక రాష్టమ్రైన ఓహియో నుంచి తన తొలి విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు.

12/03/2016 - 03:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం నాడు రాజ్యసభలో ప్రజాప్రతినిధుల అనర్హతకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, 191లలోని నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు.

12/03/2016 - 03:27

నాచారం, డిసెంబర్ 2: తెలంగాణ ఉద్యమానికి ఆత్మబలిదానం చేసిన శ్రీకాంత్‌చారి వర్ధంతిని యువత ఉపాధి దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం జరిపించాలని జెఎసి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఓయులో జరిగిన శ్రీకాంత్‌చారి వర్ధంతి సభలో మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న యువకులను కెసిఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Pages