S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 03:17

హైదరాబాద్, డిసెంబర్ 2: ‘బాలారిష్టాలు దాటేశాం. రెండున్నరేళ్లలో సంతృప్తికరమైన అభివృద్ధి సాధించాం. మిగిలిన రెండున్నరేళ్లలో దూకుడు పెంచుతాం. ప్రభుత్వ ప్రాధాన్యతలైన ముఖ్య ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తాం. పెద్ద నోట్ల రద్దు అనూహ్య స్పీడ్ బ్రేకర్. సమస్యను అధిగమించి, రెండేళ్లలో హైదరాబాద్ అభివృద్ధిలో మార్పు చూపిస్తాం. హైదరాబాద్‌ను విశ్వనగరం చేయాలన్న కల సాకారం కావడానికి ఎనిమిదేళ్లు పడుతుంది.

12/03/2016 - 03:14

గజ్వేల్, డిసెంబర్ 2: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. శుక్రవారం సిఎం దత్తత గ్రామాల్లో జరుగుతున్న వివిద అభివృద్ది పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈనెల 20లోపు సామూహిక గృహ ప్రవేశాలకు సిద్ధమవుదామని, అప్పటిలోగా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

12/03/2016 - 03:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ పదవి నుంచి అనిల్ సిన్హా శుక్రవారం పదవీ విరమణ పొందారు. దీంతో ఆయన తరువాతి స్థానంలో ఉన్న గుజరాత్ కేడర్ 1984 బ్యాచ్ ఐపిఎస్ అధికారి రాకేష్ ఆస్థానా కొత్త చీఫ్‌గా ఆ బాధ్యతలను చేపట్టారు. సిబిఐకి తదుపరి పూర్తిస్థాయి డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం ఎవరినీ ఎంపిక చేయకపోవడంతో ఆస్థానా ఈ బాధ్యతలు చేపట్టారు.

12/03/2016 - 03:08

హైదరాబాద్, డిసెంబర్ 2: డబ్బుకోసం కటకటలాడుతున్న తెలంగాణకు ఒక్కసారి ఉక్కిరిబిక్కిరియ్యేంత మొత్తం అందుతోంది. కేంద్రం నుంచి మొత్తంగా 3600 కోట్లు వచ్చిపడ్డాయి. వీటిలో 18 వందల కోట్ల ఆర్బీఐ నుంచి తెలంగాణలోని బ్యాంకులకు అందితే, కేంద్రం నుంచి పన్ను వాటాగా మరో 18 వందల కోట్లు రాష్ట్రానికి అందాయి.

12/03/2016 - 02:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశ వ్యాప్తంగా శుక్రవారం కూడా అన్ని బ్యాంకులు, ఎటిఎమ్‌లలో నగదు కటకట కొనసాగిన నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అప్పట్లోగా పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. డిసెంబర్ 30నాటికి దేశంలో కరెన్సీ కొరత గణనీయంగా తీరుతుందని చెప్పారు.

12/03/2016 - 02:42

విజయవాడ (క్రైం), డిసెంబర్ 2: నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠా ఒకటి టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడింది. వీరి నుంచి సుమారు రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసిపి పి మురళీధర్, సిఐ సురేష్‌రెడ్డి బృందం శుక్రవారం ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద దాడు లు నిర్వహించారు.

12/03/2016 - 02:40

అనంతపురం, డిసెంబర్ 2: దుర్భిక్ష పరిస్థితుల్ని అధిగమించి రైతులు, ప్రజలను ఆదుకోవడానికే రాష్ట్రంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాలను కరువు ప్రాంతాలకు తరలించామన్నారు.

12/03/2016 - 02:36

అమరావతి, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కల్పించనుంది. ఎప్పుడూ తీర్థయాత్రలు చేయని నిరుపేద హిందువుల కోసం ‘దివ్యదర్శనం’ అనే కార్యక్రమాన్ని జనవరి 2 నుంచి అమలు చేయనుంది. ఇప్పటివరకు మక్కా వెళ్లేందుకు ముస్లింలకు, జెరూసలెం వెళ్లేందుకు క్రైస్తవులకు ప్రభుత్వం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే.

12/03/2016 - 02:32

అమరావతి, డిసెంబర్ 2:బ్యాంకుల్లో, ఏటిఎంలలో నగదు లేక అల్లాడుతున్న ప్రజలకు ఓ శుభవార్త. రాష్ట్రానికి ఆర్‌బిఐ 2,420 కోట్ల రూపాయల నగదును అందించింది. ఆర్‌బిఐ ఇలా విడుదల చేసిందే తడవు రాష్ట్ర ప్రభుత్వం ఆ నగదును యుద్ధప్రాతిపదికన విమానాల్లో వివిధ ప్రాంతాలకు తరలించి, తక్షణమే ఆ నగదు బ్యాంకుల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం విశేషం.

12/03/2016 - 02:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను తొలగించడానికి తీసుకొంటున్న చర్యలేమిటో తక్షణం తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది.

Pages