S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 02:40

గుంటూరు, సెప్టెంబర్ 25: ఒకటి కాదు... రెండు కాదు... దశాబ్దాల కాలంగా గ్రామాలకు గ్రామాలు సెలయేళ్లవుతున్నా ఎవరికీ పట్టదు.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆధునికీకరణ మంత్రం తెరపైకి వస్తుంది.. ఆనక అటకెక్కుతుంది.. ఎప్పటికప్పుడు వాగులకు వంకపెట్టి చేతులు దులుపుకోవటం రివాజుగా మారుతోంది.. భారీ వర్షాలు, వరదల కారణంగా జరుగుతున్న నష్టానికి శాశ్వత పరిష్కారం లభించటంలేదు.

09/26/2016 - 02:38

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడుకు వరకూ ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఆదివారం కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. సముద్ర ఉపరితలానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

09/26/2016 - 02:38

కర్నూలు, సెప్టెంబర్ 25: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు నమోదు చేసిన రౌడీషీట్ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. ఆయనపై సుమారు రెండేళ్ల క్రితం పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. ఆ కేసులో భూమా నాగిరెడ్డి రిమాండుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఆయన వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

09/26/2016 - 02:37

అనంతపురం, సెప్టెంబర్ 25 : ద్వై వార్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పదవీ కాలం పూర్తవుతున్న ఉపాధ్యాయ(టీచర్), పట్ట్భద్రులు(గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభం కానుంది. 2017 మార్చి 29వ తేదీ నాటికి ఆయా స్థానాల్లో ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది.

09/26/2016 - 02:36

పెదవేగి/ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 25 : ఒలింపిక్ క్రీడల్లో భారత్ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి ఇనుమడింపచేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఆదివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసియున్న శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి, ద్వారకాతిరుమలలో చినవెంకన్నకు విశేష పూజలు నిర్వహించారు.

09/26/2016 - 02:29

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: విభిన్న రంగాల్లో తన ప్రజ్ఞాపాటవాలను చూపిన శ్రీపాద జిత్‌మోహన్ మిత్ర రాజమహేంద్రవరం ఖ్యాతిని ఇనుమడింపజేశారని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చియ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో నవరస నట సమాఖ్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పౌరులు, గాయకుడు, నటుడు శ్రీపాద జిత్‌మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆదివారం రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో ప్రదానం చేశారు.

09/26/2016 - 02:28

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: గోదావరి నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది.మరో మూడు రోజుల్లో గోదావరి ఉద్ధృతి పెరగనుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోగా అవసరమైన అప్రమత్త చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద రెండు మీటర్ల వరకు నీటి మట్టం పెరిగింది. ఇక్కడ పెరిగిన నీటిమట్టం ధవళేశ్వరం వద్దకు చేరాలంటే మరో రెండు రోజులు పడుతుందని అధికారులు అంచనా వేశారు.

09/26/2016 - 02:27

కాకినాడ, సెప్టెంబర్ 25: ‘దోమలపై దండయాత్ర’ అనే ప్రభుత్వ నినాదం వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తోంది. దోమలపై దండయాత్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమాటెలా ఉన్నా, వాటిపై పోరాడలేక, అలసి, సొలసి, విసిగివేశారిపోతున్న అధికారులను చూస్తే మాత్రం పాపం జాలేస్తోంది. ఒకవైపు దండయాత్రంటూ తిరుగుతున్న అధికారులకు మరోవైపు దోమల మోత చిర్రెత్తేలా చేస్తోంది.

09/26/2016 - 02:26

తిరుపతి, సెప్టెంబర్ 25: వేద విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృత ఫలమని, ప్రతి వేద విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వేద విద్యార్థులకు హితవుపలికారు. ఆదివారం వేద విశ్వవిద్యాలయానికి విచ్చేసిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. వేదాలను అభ్యసిస్తున్న విధానాన్ని ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

09/26/2016 - 02:25

శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 25: శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్లులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రూ.30కోట్లతో పాల ఉత్పత్తుల తయారీకేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ఆదివారం పాలసహకార సొసైటీ సర్వసభ్య సమావేశం పట్టణంలోని శివమ్ కల్యాణమండపంలో జరిగింది.

Pages