S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 23:42

సంగారెడ్డి, సెప్టెంబర్ 22: సరిగ్గా దశాబ్ద కాలానికి సింగూర్ ఎత్తిపోతల పథకానికి దశ తిరిగింది. మూడున్నర దశాబ్దాల క్రితం పుల్కల్, మునిపల్లి, సదాశివపేట మండలాల సరిహద్దులో మంజీర నదిపై సింగూర్ ప్రాజెక్టును నిర్మించారు. జంటనగరాలకు తాగుకు, జిల్లా వ్యవసాయానికి సాగుకు అందించాలనే సంకల్పంతో ప్రాజెక్టును నిర్మించినా నేటి వరకు కేవలం తాగునీటి సరఫరాకే ప్రాధాన్యతను ఇచ్చారు.

09/22/2016 - 23:42

రామాయంపేట, సెప్టెంబర్ 22: రామాయంపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, నిజాంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టిపిసిసి కార్యదర్శి చౌదరి సుప్రబాత్‌రావు చేపట్టిన ఆమరణ దీక్ష రెండవ రోజు గురువారం రాత్రి 7గంటల ప్రాంతంలో పోలీసులు భగ్నం చేశారు.

09/22/2016 - 23:41

సిద్దిపేట, సెప్టెంబర్ 22 : సిద్దిపేట మున్సిపాల్టీలోవిలీనమైన ఆరు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజల స్థితిగతులను పరిశీలించిన తర్వాత పన్ను పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. గురువా రం విలీన గ్రామాల్లో పన్నుపెంపుపై వేసిన ప్రత్యేక కమిటీతో సమావేశమైనారు.

09/22/2016 - 23:40

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 22: గత మూడు రోజులుగా సంగారెడ్డి భవానీమాత ఆలయంలో కొనసాగుతున్న శత చండీయాగం ముగిసింది. శ్రీ మాధవనంద సరస్వతి స్వామి సమక్షంలో గురువారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూర్ణాహుతిలో పాల్గొని భవానీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయంలో చండీయాగం చేపట్టడం శుభసూచికమన్నారు.

09/22/2016 - 23:40

తొగుట, సెప్టెంబర్ 22: మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా మండలంలోని వేములఘాట్‌లో చేపట్టిన రిలేదీక్షలు గురువారానికి 110వ రోజుకు చేరింది. ఈ దీక్షల్లో గ్రామానికి చెందిన మద్దూరి రాంరెడ్డి, కె. సత్యనారాయణ, కుమ్మరి బాలమల్లు, దువ్వల ఎల్లయ్య, ఆకుల సతీష్ కూర్చున్నారు. వీరికి గ్రామస్తులు సంఘీభావం తెలిపారు. ప్రజల ఆకాంక్ష నెరవేరదాకా ఆందోళన చేస్తామన్నారు.

09/22/2016 - 23:39

ములుగు, సెప్టెంబర్ 22: మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరవుతున్న అధికారుల తీరుపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

09/22/2016 - 23:39

సిద్దిపేట, సెప్టెంబర్ 22: నంగునూరు మండలాన్ని జిల్లా పునర్విభజనలో హుస్నాబాద్ డివిజన్‌లో కలుపవద్దని అఖిల పక్షం నేతలు సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంగునూరు మండలానికి సిద్దిపేటతో ఎన్నో ఏండ్లుగా అనుబంధం ఉందని, విద్యా, వ్యాపార, వైధ్య తదితర విషయాల్లో మండల వాసులు సిద్దిపేటపైనే ఆధారపడ్డారని తెలిపారు.

09/22/2016 - 23:38

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 22: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసేది కాంగ్రెస్ పార్టీయేనని, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని టిపిసిసి కోశాధికారి,కాంగ్రెస్ నిఘా ఫైనాన్స్ కమిటీ కన్వీనర్ గూడురి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్‌గౌడ్‌లు పేర్కొన్నారు.

09/22/2016 - 23:37

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: జిల్లాలో భారీ నుండి అతిబారీ వర్సం వివిధ మండలాల్లో కురిసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో చెరువులు, కుంటలు నిండి ఆలుగులు పారుతున్నాయి. కొన్ని మండలాల్లో అతిభారీ వర్షం కురియడంతో చెరువులకు, కుంటలకు గండ్లు పడ్డాయి. వర్షం నీరు వృధాగా పోతుండడంతో పలు గ్రామాల ప్రజలు నీటిని ఆపుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

09/22/2016 - 23:36

భూత్పూర్, సెప్టెంబర్ 22: దేవాలయం నిర్మాణంలో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన మండలంలోని అమిస్తాపూర్‌లో జరిగింది. గ్రామస్ధుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ వెళ్లే రహదారి పక్కన శ్రీ సీతారాముల దేవాలయం నూతనంగా నిర్మాణం చేపడుతున్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు విగ్రహాల చేతులు, గదలను ధ్వంసం చేశారు.

Pages