S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/20/2016 - 01:44

నెల్లూరు లీగల్, సెప్టెంబర్ 19: జమ్మూ-కాశ్మీర్‌లోని భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ హతులైన భారత సైనికులకు సంఘీభావంగా నెల్లూరు న్యాయవాదులు సోమవారం రాత్రి జిల్లా కోర్టు ఆవరణలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

09/20/2016 - 01:44

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 19: వడ్డెరల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిని అన్నివిధాల అభివృద్ధిపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని రాష్ట్ర వడ్డెర ఫెడరేషన్ ఛైర్మెన్ దేవళ్ల మురళి అన్నారు. జిల్లా కేంద్రంలోని రహదారులు, భవనాలు అతిథిగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

09/20/2016 - 01:42

ఒంగోలు, సెప్టెంబర్ 19: జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తెలుగుతమ్ముళ్ల అంతర్గత విభేదాలు రావణ కష్టాంలా రగులుతూనే ఉన్నాయి. తెలుగుతమ్ముళ్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను సమిసిపోయేటట్లు చేయటంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లాపార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరిలు ప్రత్యేక దృష్టిసారించటం లేదన్న ఆరోపణలు పార్టీ నుండే వినిపిస్తున్నాయి.

09/20/2016 - 01:42

గిద్దలూరు, సెప్టెంబర్ 19: అనంతపూర్ జిల్లా గుంతకల్లు సమీపంలోని మద్దికర్రెకు చెందిన బెచ్చపోగుల శాంతిప్రియ (25)ను తన భర్తే ఒంటిపై కిరోసిన్ పోసి కిరాతకంగా కాల్చి చంపిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న చుట్టుపక్కల ఇళ్ళలోని ప్రజలు భర్తకు దేహశుద్ధి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

09/20/2016 - 01:41

ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 19: ఉగ్ర ఘాతుకాన్ని వెంటనే తరిమికొట్టాలని, ఉగ్రదాడిలో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ సోమవారం రాత్రి బిజెపి ఆధ్వర్యంలో ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా బిజెపి అధ్యక్షుడు పులి వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడుతూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

09/20/2016 - 01:40

ఒంగోలు, సెప్టెంబర్ 19: జిల్లాలో సహజవనరుల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు జిల్లా పరిశ్రమల శాఖ, బ్యాంకర్లు సంయుక్తంగా అవరమైన చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక టిటిడిసిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించే నిమిత్తం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అవగాహన సదస్సు జరిగింది.

09/20/2016 - 01:40

ఒంగోలు, సెప్టెంబర్ 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పదేపదే చెప్పిన దేశ ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసంచేశారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మానస మల్లిక్ ధ్వజమెత్తారు. సోమవారం ఒంగోలులో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుర్రాల రాజ్‌విమల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది.

09/20/2016 - 01:39

గిద్దలూరు, సెప్టెంబర్ 19: గురుపూజోత్సవ వేడుకల్లో గిద్దలూరు మండలం నుంచి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల విభాగంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కోసం పంపిన ప్రతిపాదనలపై ఉపాధ్యాయ వర్గాల్లో దుమారం చెలరేగింది. రాజకీయ ఒత్తిళ్ళ నేపధ్యంలో ప్రతిపాదనల సమర్పణ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కాగా, కొంతమంది ఉపాధ్యాయులు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఈ విషయమై ఉపాధ్యాయులు ఆర్‌జెడికి ఫిర్యాదు చేశారు.

09/20/2016 - 01:39

త్రిపురాంతకం, సెప్టెంబర్ 19: మండలంలోని దూపాడు చెరువులోపడి కేశినేనిపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు (35) మృతిచెందిన సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కేశినేనిపల్లి నుంచి శనివారం రాత్రి నడిగడ్డ గ్రామానికి వెళ్తుండగా చెరువులోపడి ఏడుకొండలు మృతిచెందాడు. సోమవారం సాయంత్రం మృతదేహాన్ని గొర్రెలకాపరులు గుర్తించి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు ఏడుకొండలుగా గుర్తించారు.

09/20/2016 - 01:38

యద్దనపూడి, సెప్టెంబర్ 19: మండలంలోని గన్నవరం గ్రామంలో ఒక మహిళపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇంకొల్లు సిఐ శ్రీనివాసరావు, ఎస్సై చెంచుప్రసాద్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ గన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన పెద్దబ్బాయి అత్యాచారం చేసినట్లు నిందితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Pages