S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2016 - 02:54

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్టప్ ఇండియా/ స్టాండప్ ఇండియాలాంటి పథకాలను అమలు చేయడంలో అద్భుతంగా కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సివిల్ సర్వీస్ అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించనున్నారు.

08/29/2016 - 02:42

హైదరాబాద్, ఆగస్టు 28: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ప్రతిపాదిత జిల్లాల ముసాయిదాపై వ్యక్తమవుతోన్న ప్రజాభిప్రాయం మేరకు జనగామ, గద్వాల జిల్లాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ రెండు జిల్లాలుగా విభజించడం పట్ల ప్రజలు ముఖ్యంగా సొంతపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచే వ్యక్తమవుతోన్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు సమాచారం.

08/29/2016 - 02:23

హైదరాబాద్, ఆగస్టు 28: కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రతిపాదిత జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో చేర్పులు, మార్పులను సూచిస్తూ పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో వినతులు అందుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈనెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తూ సెప్టెంబర్ 22లోగా ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు, సూచనలు ఇవ్వొచ్చంటూ భూపరిపాలన శాఖ కోరింది.

08/29/2016 - 02:22

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ తాజాగా సిఎన్‌బిసి నుంచి మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు దక్కించుకుంది. ప్రతి ఏడాది సిఎన్‌బిసి టీవి నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్‌లో భాగంగా రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. జాతీయస్థాయిలో ప్రభుత్వాలకు, పరిశ్రమ, క్రీడా, సామాజిక, కళ, వినోద రంగాల్లో విజేతలకు అవార్డులను ఏటా సియన్‌బిసి ప్రదానం చేస్తోంది.

08/29/2016 - 02:21

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన పోరాటంలో ప్రజలతో కలిసి ఉద్యమం నడిపినట్టే, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిలో ప్రజల పక్షానే పనిచేస్తానని తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణలోని తాజా పరిస్థితులపై ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా ఆందోళనలు చేస్తున్నారు?

08/29/2016 - 02:19

హైదరాబాద్, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది.

08/29/2016 - 02:18

హైదరాబాద్, ఆగస్టు 28: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవిస్తే విద్యుత్ తిప్పలు తప్పవన్న ఉద్యమకాలంనాటి ప్రచారానికి భిన్నమైన వాతావరణం ఆవిష్కృతమవుతోంది. విద్యుత్తే ఇప్పుడు తెలంగాణకు అదనపు బలం కాబోతోంది. సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేసిన తెలంగాణలో విద్యుత్‌కు బెంగపడాల్సిన అవసరం లేదన్న ధీమా అటు సర్కారులోను, ఇటు అధికార యంత్రాంగంలోనూ కనిపిస్తోంది.

08/29/2016 - 02:06

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కాశ్మీర్ సమస్యకు ప్రేమ, ఐక్యతలే అసలు సిసలైన మంత్రాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కాశ్మీర్‌లో అశాంతిని రెచ్చగొట్టడానికి అమాయకులైన చిన్నారులను ఎగదోస్తున్న వారు ఏదో ఒక రోజు వారికి జవాబు చెప్పక తప్పదని కూడా ఆయన అన్నారు.

08/29/2016 - 02:04

సూళ్లూరుపేట, ఆగస్టు 28: వినూత్న ప్రయోగాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ దేశాలకు మరోసారి మన శాస్తవ్రేత్తలు చాటి చూపించారు. రోదసి ప్రయోగాల పరీక్షల్లో మరోసారి ఇస్రో శాస్తవ్రేత్తలు తమ శక్తిసంపద ఏమిటో మరోసారి విశ్వానికి చూపించారు. వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది.

08/29/2016 - 02:01

కదిరి/చిత్తూరు, ఆగస్టు 28: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఎవరికీ భయపడను. నాకు ప్రజలే హై కమాండ్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సిఎం పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

Pages