S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/28/2016 - 23:55

కోహెడ, ఆగస్టు 28: మండలంలోని తంగళ్లపల్లిలో లంకెల శివ (3) అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి ఆదివారం మృతి చెందాడు. బ్రతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్న లంకెల వెంకటేశం-పద్మలు గ్రామ దేవతల మొక్కులు చెల్లించుకునేందుకు గాను శనివారం స్వగ్రామమైన తంగళ్లపల్లికి కుటుంబ సభ్యులతో సహా వచ్చారు.

08/28/2016 - 23:55

తిమ్మాపూర్, ఆగస్టు 28: జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సభ్యులకు గోపాలమిత్ర ద్వారా మంచి బ్రీడ్ డెవలప్‌మెంట్ కోసం పశువులకు కృత్రిమ గర్భదారణ చేయిస్తున్నట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, కరీంనగర్ డెయిరీ చైర్మన్ సిహెచ్ రాజేశ్వర్ రావు అన్నారు.

08/28/2016 - 23:55

కరీంనగర్, ఆగస్టు 28: కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తారు వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో సుమారు గంట పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అలాగే సిరిసిల్ల, జగిత్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. పక్షం రోజులుగా దంచికొడుతున్న ఎండలకు ఉక్కపోతతో బేజారవుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరట కలిగించింది.

08/28/2016 - 23:53

ఇచ్చోడ, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా పునర్నిర్మాణం చేపట్టిన ఎల్లమ్మకుంట చెరువును ఆదివారం నీటి పారుదల శాఖ ఓ ఎస్‌డి శ్రీదర్ దేశ్‌పాండేతో పాటు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరిశీలించారు. ఈ చెరువు కింద ఉన్న ఆయకట్టు వివరాలతో పాటు చెరువు పునర్నిర్మాణానికి నిధుల చెల్లింపు వివరాలు నీటి పారుదల శాఖ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

08/28/2016 - 23:53

బాసర, ఆగస్టు 28: వన సంరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాసర అమ్మవారి ఆలయానికి చెందిన భూములలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ ఒక్కరు వన సంరక్షణకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 23 శాతం ఉన్న అడవి సంపదను 33 శాతానికి పెంచేందుకు అందరూ కృషిచేయాలని సూచించారు.

08/28/2016 - 23:52

ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 28: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని (ఏఐకెఎస్) తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులందరికి రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.

08/28/2016 - 23:52

బెజ్జూరు, ఆగస్టు 28: వచ్చే యేడాదికల్లా బెజ్జూరు మండలంలో ఉన్న వంతెనలను పూర్తి చేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం బెజ్జూరు మండలంలోని దింద, గూడెం వంతెనలను పరిశీలించారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్న ప్రాణహితపై తెలంగాణ ప్రభుత్వం రూ.56కోట్లతో వంతెనకు నిధులు మంజూరు చేసిందని, అట్టి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

08/28/2016 - 23:51

ఇచ్చోడ, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలతో పాటు విద్యారంగాన్ని అభివృద్దిపర్చేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.

08/28/2016 - 23:51

లక్సెట్టిపేట, ఆగస్టు 28: లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బియ్యాల తిరుపతిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో చేరి పార్టీ జెండా పట్టుకొని పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని గ్రామాల్లోని యువకులను సైతం ఉత్తేజపరిచాడు.

08/28/2016 - 23:51

ఆదిలాబాద్, ఆగస్టు 28: ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో ఇనే్నళ్లుగా వృదాగా పోతున్న పెన్‌గంగా జలాలను బీడు భూముల్లోకి మళ్ళించి ఆదిలాబాద్ ప్రాంతాన్ని సస్యశామలం చేయడ మే ప్రభుత్వ లక్ష్యమని, రూ.368 కోట్ల వ్యయంతో మంజూరైన పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు.

Pages